సబ్ ఫీచర్

పెట్టుబడులకు బానిసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే. కుర్రకారు స్మార్ట్ఫోన్‌లో సగటున 30 యాప్స్ ఉంటాయని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఎనిమిదేళ్ళ క్రితం వాట్స్ యాప్‌ను స్థాపించినపుడు ఆ అప్లికేషన్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఆ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసిన జాన్‌కౌమ్ గురించి కూడా అంతగా ఎవరికీ తెలియదు. ఫేస్‌బుక్- ఈ అప్లికేషన్‌ను 2014 ఫిబ్రవరి 1900 కోట్ల డాలర్లకు (రూ.1.15 లక్షల కోట్లు) కొనుగోలు చేయడంతో ప్రపంచ వ్యాప్తంగా కౌమ్ పేరు మారిమోగిపోయింది. యుక్రేన్‌లో పుట్టి పెరిగిన 39 ఏళ్ళ కౌమ్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుం దాం.. జాన్ కౌమ్ యుక్రేన్‌లో పుట్టి పెరిగాడు. కౌమ్ తల్లి ఒక అమెరికా వాణిజ్యవేత్తను పెళ్లిచేసుకుంది. దీంతో కౌమ్ శాన్ జోసేకు వచ్చేశాడు. చిన్నప్పుడు అంతా యుక్రేన్‌లో చదవడంవల్ల అమెరికా విద్యా సంస్థల్లో ఇమడలేకపోయాడు. కాలేజీ చదువు పూర్తికాకుండానే బయటకు వచ్చేశాడు. బిల్‌గేట్స్, మార్క్ జూకర్‌బర్గ్ మాదిరిగా యుక్తవయసు వచ్చిన వెంటనే అవకాశాల కోసం వెతకడం ప్రారంభించాడు. సిలికాన్ వ్యాలీలో ముందు చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు. ఆ తర్వాత వాట్స్ యాప్‌ను ప్రారంభించాడు. సిలికాన్ వ్యాలీలో విజయాలు సాధించిన యుక్రేన్‌కు చెందిన మరో వాణిజ్యవేత్త, పేపాల్ వ్యవస్థాపకుడు మ్యాక్స్ లెవ్‌చిన్, రష్యాకు చెందిన గూగుల్ వ్యవస్థాపకుడు సెర్గిబ్రిన్‌లు ఈ విషయంలో కౌమ్‌కు స్ఫూర్తి అని చెప్పవచ్చు.
స్వేచ్ఛగా జీవించడమే ఇష్టం
కౌమ్‌కు దైనందిన జీవనంలో ప్రభుత్వం కలగజేసుకోవడం అస్సలు నచ్చదు. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ప్రభుత్వ పాత్ర ఎక్కువ ఉండకూడదనేది కౌమ్ వాదన. ప్రకటనల ద్వారా కంపెనీలపై ప్రభుత్వాలు ఆధిపత్యం చెలాంచడానికి ప్రయత్నించడాన్ని కూడా అతను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చాడు. అందువల్లే ఈ వాట్స్‌యాప్‌లో ఎక్కడా ప్రకటనలు కనిపించవు. ప్రకటనలు రావడం మొదలుపెడితే వినియోగదారుడే ప్రొడక్ట్ అయిపోతాడు. చాలాసార్లు మనం స్వేచ్ఛగా ఉన్నామనుకుంటాం. కానీ అది నిజం కాదు. మనం పెట్టుబడులకు బానిసలం అని 2012లో ఒక బ్లాగ్‌లో కౌమ్ వ్యాఖ్యానించాడు. - నీలిమ సబ్బిశెట్టి

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03