సబ్ ఫీచర్

పెసర పిండితో పసిడి ఛాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా అందానికి లక్స్ సోపు కాదు కేవలం సున్నిపిండే అని ఒకప్పటి బాలీవుడ్ సౌందర్యరాశి శ్రీదేవి అనేవారు. తాను సున్నిపిండితోనే స్నానం చేస్తానని స్వయంగా చెప్పటం జరిగింది. అందానికి మెరుపులు అద్దాలంటే కాస్తంత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఈ చలికాలంలో చర్మం బరకగా.. తెల్లగా కనిపిస్తోంది. ఈ సమయంలో సబ్బుకు బదులు సున్నిపిండి వాడితే చాలా మేలుచేస్తోంది.
సున్నిపిండిలో చెంచా నిమ్మరసం, ఆలీవ్ ఆయిల్ కలిపి ఆ మిశ్రమాన్ని నలుగా పెట్టుకుని స్నానమాచరిస్తే మృతకణాలు తొలగి చర్మం నునుపుగా తయారవుతుంది.
రెండు, మూడు చెంచాల పెసర పిండిలో పావుకప్పు పెరుగు, ఇందులో తేనె, చిటికెడు పసుపు కలిపి మెత్తని పేస్టులో చేసుకుని ఒళ్లంతా పూతలా రాసుకోవాలి. అరగంట తరువాత కడిగేసుకుంటే చర్మంపై ఉన్న ముడతలు, మొటిమల తాలుకా మచ్చలు తొలగిపోతాయి.
పెసర పిండితో ముఖమే కాదు జుట్టు కూడా ఒత్తుగా, మెత్తగా పెరుగుతుంది. ఎలా అంటే గుడ్డులోని తెల్లసొనలో చెంచా పెరుగూ, చెంచా పెసరపిండి, అరచెక్క నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంటాగి స్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే జుట్టు నిగనిగలాడుతూ కనిపిస్తుంది. జిడ్డు సమస్య తొలగిపోతుంది.
పెసరపిండిలో చెంచా తేనె, పావు చెంచా కలబంద గుజ్జూ, అరచెంచా బొప్పాయి పేస్ట్ కలుపుకొని మెత్తగా చేసుకుని పేస్‌ప్యాక్‌లా వేసుకుంటే ముఖంపై ఉన్న మురికి తొలగిపోయి తాజాగా కనిపిస్తారు.
సున్నిపిండిని పాలతో కలిపి పేస్టులా చేసుకుని ఒళ్లంతా పట్టించి మర్దన చేసి కడిగేస్తే శరీరం తేటాగా ఉంటుంది. ఇలా ప్రతిరోజూ చేస్తే పిల్లల్లో తేడా కనిపిస్తోంది.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో
bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03