సబ్ ఫీచర్

కంచి చీరలో దీప కాంతులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపాల పండుగ వేళ కంచి చీరలో కనిపిస్తే ఆ అందం, హుందాతనం మరే చీరతో రాదు. ఆధునిక యువతి కొత్త కొత్త ట్రెండ్స్‌ను అనుసరిస్తున్నప్పటికీ సంప్రదాయాలను మీరటంలేదు. అందుకే చిన్నా పెద్దా చీర మొదలు పరికిణీలనే ఇష్టపడుతున్నారు. పండుగు సీజన్‌లో ఫ్యాషన్ బజారులో సరికొత్త కంచిపురం చీరలు అందుబాటులోకి వచ్చాయి. కంచి చీరను ఎంచుకునే ముందు మన శరీరాకృతికి తగినట్లు రంగులను ఎంచుకుంటే బాగుంటుంది.
లక్ష్మీపూజకు కంచి పట్టు చీరలో కనిపిస్తేనే లక్ష్మీకళ ఉట్టిపడుతుంది. పూజ తరువాత కంచి సిల్క్ కాటన్ చీర కట్టుకుంటే మేనుకు మెత్తగా ఉంటుంది. దీపాలు వెలిగించే వేళలో ఎలాంటి ప్రమాదాలు దరిచేరవు. ఇందులో సెమీ సిల్క్ చీరలు కూడా నేడు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. కాంచివరం సిల్క్ కాటన్ చీరలు ఇవి. అరుదుగా కనిపించే డిజైన్లతో నేతపనివారు తయారుచేసిన ఈ చీర లు మేనుకు బరువుగా అనిపించవు. సౌకర్యవంతంగా ఉంటాయ. రిచ్ పల్లుతో హరివిల్లులా మలచిన చీరలో అందంగా స్మార్ట్‌గా కనిపిస్తారు. కంచిపురం సెమీ సిల్క్ చీరకు రిచ్ పల్లుతో రెండు వైపులా జరీ బోర్డర్ కళకళలాడుతోంది. జీవితంలో మధురమైన క్షణాలకు గుర్తుగా నిలిచే ఈ చీరను కట్టుకుంటే సొగసుగా కనిపిస్తారు.
కంచి చీరల మీదకి మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ రంగుల బ్లౌజ్ లు వేసుకుంటే బాగుంటాయి. మరింకెందుకు ఆలస్యం నేతవస్త్రంపై సహజ సిద్ధమైన డిజైన్లలో చేసిన కంచి సిల్క్ కాటన్ చీరలలో కంటికి ఇంపుగా కనిపిస్తారు.