సబ్ ఫీచర్

రోగ నివారిణి ..నేరేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లోనేరేడు పండ్లు మార్కెట్‌లో తరచూ లభ్యమవుతాయ. ఆయుర్వేద వైద్యులు ఈ పళ్ళలో ఔషధ గుణాలు ఎన్నో వున్నాయంటారు. వాటిలో కొన్ని వాడితే స్వస్థత చేకొరుతుందని అంటారు. ఇక వాటి ఉపయోగాలు.
ఈ పండ్ల గింజల్ని ఎండబెట్టి పొడి చేసుకొని సీసాల్లో భద్రపరచుకోవాలి. రోజూ ఒకసారి మూడు గ్రాముల పొడి చప్పున నీళ్ళలో వేసుకుని నాలుగుసార్లు త్రాగితే మూత్రంలోని మధుమేహ వ్యాధి నివారణ అవుతుంది.
మూలశంక (పైల్స్) వారు విడువకుండా ఈ పళ్ళు రెండు లేక మూడు పళ్ళను తేనెలోగాని, ఉప్పులో గాని ముంచుకుని, అద్దుకొని తింటే అతి సత్వరంగానే పైల్స్ వ్యాధి మాయమైందని చెప్పటం ఎంత ఆశ్చర్యకరం. వీటి విత్తనాలను ఎండబెట్టి, పొడి చేసి పది గ్రాముల చొప్పున మజ్జిగలో వేసుకుని తాగితే విరోచనాలు తగ్గుతాయి. తరచుగా మూత్ర విసర్జన చేసేవారు ఈ గింజల పొడిని ప్రతిరోజు ఒక గ్రాము చొప్పున ఉదయం, సాయంత్రం నీళ్లలో కలుపుకుని తాగాలి.
ఈ పళ్లలో కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, సి విటమిన్, బి విటమిన్ వుండటంవలన శరీరానికి చల్లదనం చేకూరుతుంది. వేడి తగ్గుతుంది. నేరేడు చెక్కను కాల్చి పొడి చేసి ఒక సీసాలో వుంచుకొని ఉదయానే్న పరగడుపున ఒక గ్లాసు నీళ్ళలో ఒక టీ స్పూన్ పొడి వేసుకుని త్రాగితే క్రానిక్‌గా వున్న షుగర్ వ్యాధి నివారణ అవుతుంది.
ఇన్ని ఔషధ గుణాలు వున్న నేరేడు పళ్ళు వైద్యంతోబాటు షుగర్, పైల్స్, కడుపునొప్పి విరోచనాలతో బాధపడేవారు ఆహార నిబంధనలను పాటించడం అత్యవసరమని, అతి సర్వత్ర వర్జయేత్ అనే ఆరోగ్య సూత్రం ప్రకారం నడుచుకొని సదా ఆరోగ్య జీవితం గడపాలి. నిండూ నూరేళ్ళు జీవించాలి. రోజుకో యాపిల్ పండు తింటే మంచిదని మనం అనుకుంటే, డాక్టర్లు, షుగర్ వ్యాధిగ్రస్తులు ఆ పండులోని ఒకటి లేక రెండు ముక్కలు మాత్రమే తినాలంటారు. కమలాపండ్లవల్ల జలుబు భారం వస్తుందంటారు.
ఏదిఏమైనా ఆయా వ్యాధులు వున్నవారు డాక్టర్లను సంప్రదించి ఏ పండు తనకు పడుతుందో పడదో తేల్చుకొని వైద్య సలహాలు పాటిస్తే రోగ నివారణ అవుతుంది.

- బి.విజయలక్ష్మి