సబ్ ఫీచర్

హిందూ వ్యతిరేక ప్రణాళిక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేవతలందరూ నిజానికి- మనుషుల్లో, జంతువుల్లో, వృక్షాల్లో,క్రిమికీటకాదుల్లో, రాళ్లల్లో, కొండల్లో నివసించే ఉన్నారు. ఇది హిందువుల నమ్మకం. అందుకనే కాళిదాస కవి ‘అస్తి ఉత్తరస్యాం దిశి దేవతాత్మా, హిమాలయో నామ నగాధిరాజా’ అంటూ హిమాలయాన్ని ‘దేవతాత్మ’గా ప్రస్తుతించాడు. కానీ, మోక్షం ఇవ్వటానికి ఈ మనుషులూ, ఇతర జీవులూ అర్హులా? కోర్కెలు తీరుస్తారేమో గానీ మోక్షం ఇవ్వలేరు. ఉదాహరణకు రావిచెట్టుకు ప్రదక్షిణలు చెయ్యటం. ఉత్తర భారతదేశంలోని ఒక దేవాలయంలో భక్తులు వందలాది ఎలుకలకి పాలుపోస్తారు. ఆంధ్రప్రదేశ్‌లోని ‘పూళ్ల’ గ్రామం వద్ద బియ్యం మిల్లులో వదిలిబెట్టిన గింజలను తినటానికి వందలాది చిలుకలు ఎగిరి వస్తుంటాయి. కాశ్మీర్‌లోని అనంతనాగ్ దగ్గరున్న మార్తాండ్ సూర్య దేవాలయం కోనేరులో కొన్ని వందల పెద్ద చేపలున్నాయి. అవ్వి ఋషులట! వాటికి వెయ్యటం కోసం పేలాలు అమ్ముతారు. శృంగేరీలో కూడా ఈ చేపలను చూస్తాము. శ్రీకూర్మంలో ఆలయం ప్రహరీ లోపలున్న కూర్మాలు తలెత్తి చూస్తాయి- మనం ఏమన్నా పెడతామేమోనని.
ఈ జీవులు మనకి మోక్షాన్నివ్వవు. పుణ్యాన్ని మాత్రం ఇస్తాయి. ఇలాగే సాధువులు, సంతులు, సిద్ధపురుషులు కూడా తాము దేవుళ్లము కాము అన్న విషయాన్ని భక్తులకు తెలియపరిచే విధంగా- ‘మేము మోక్షం ఇవ్వలేం, పుణ్యం ఎలా పొందాలో చెప్పగలం’ అంటారు. ఇట్లాంటి సిద్ధపురుషులు పూర్వమూ, ఇప్పుడూ ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు. ప్రపంచం అంతటా ఉంటారు. అతి ఎక్కువగా మన దేశంలోనే ఉంటారు- మోక్షాన్నిచ్చే దేవతలు ఇక్కడే ఉన్నారు గనుక. మెహర్‌బాబా తాను దేవుణ్ణని ఎక్కడా చెప్పుకోలేదు, జిల్లెళ్లమూడి అమ్మ భక్తులూ, నంబూరు బాబా భక్తులు కూడా ఆ ఇద్దరూ దేవుళ్లని చెప్పట్లేదు. కుసుమ హరనాథ్ బాబా భక్తులు కూడా అంతే.
బాబాలు, సిద్ధులు, గురువులు- భక్తుల కొద్దిపాటి కోర్కెల్ని తీర్చగలరేమో కాని, మోక్షాన్ని మాత్రం ఇవ్వలేరు. ఒక్క ఉదాహరణ చూద్దాం. కంచి పరమాచార్య, బ్రహ్మీభూత శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి కర్నూలు దగ్గరున్న ఒక కుగ్రామంలో తెల్లవారు జామున శివాలయంలో పూజకు కూర్చున్నారు. ఊరి పెద్దలు ఎవ్వరూ బిల్వాలు (మారేడుదళాలు) తెచ్చి ఇవ్వలేకపోయారు. మేకల్ని కాచుకుంటూ వచ్చిన ఒక కుర్రాడు, పరిస్థితి చూసి పరుగెత్తి వెళ్లిపోయాడు. కాస్సేపట్లో ఒక తట్టనిండా బిల్వాలు తెచ్చి స్వామి దగ్గర పెట్టాడు. పూజ అంతా అయిపోయాక స్వామి మెట్లు దిగుతూంటే ఆ కుర్రాడు వారికి అడ్డంగా పడుకుండిపోయాడు. స్వామి, ‘ఏం కావాల్రా నీకు?’ అన్నారు. వాడు ‘మోక్షం’ అన్నాడు. స్వామి కళ్లుమూసుకుని ఆలోచించి, ‘సర్లే.. అమ్మను అడుగుతానే్ల’ అని వెళ్లిపోయారు. ఆరునెల్ల తర్వాత స్వామి తన కంచి ఆశ్రమంలో కోనేరు పక్కన కూర్చుని ఉండగా మేనేజరు వచ్చి, ‘స్వామీ టెలిగ్రాం వచ్చింది. ఆ కుర్రాడి ప్రాణం పోయేట్టుగా ఉందట!’ అన్నాడు. స్వామి వారు- ‘వాడికి ఆరు జన్మలకిగాని మోక్షం రాదు. అమ్మ వాడికి మూడు జన్మలకే ఇస్తానంటోంది. ఈ మరణం వాడికి లాభమే.’ అన్నారట! ఆ స్వామిని ‘నడిచే దేవుడు’ అన్నారు గాని, ‘దేవుడు’ అనలేదు.
రామకృష్ణ పరమహంస తన అనుయాయులతో- ‘మీతో ఎట్లా మాట్లాడుతున్నానో, అమ్మతోనూ అట్లాగే మాట్లాడుతున్నాన’ని అనేవారట. తాను దేవుణ్ణని ఆయన అన్నాడా? ఏడాది క్రితం మనల్ని వదిలివెళ్లిపోయిన సద్గురు శివానందమూర్తిగారు లెక్కలేనంత మందికి మంత్రాలిచ్చారు. శాంతిని ప్రసాదించారు. తాను దేవుణ్ణని ఆయన అనుకొన్నారా? ఆయన భక్తులు అలా అన్నారా? తులసీదాసు అందరికీ తన ‘రామచరిత మానస్’ ద్వారా రాముణ్ణి ఇచ్చాడు, మోక్షాన్నివ్వలేదు. ఇది హిందూ జీవన విధానం. ప్రపంచానికే తలమానికం. దీన్ని వంట పట్టించుకోటానికే పాశ్చాత్య విద్వాంసులు తపించిపోతున్నారు. ‘ఇందుకోసమే.. ఎక్కణ్ణించో వాళ్లు వచ్చేది’’ అన్నారు బ్రహ్మీభూత కంచిస్వామి.
* * *
ఈమధ్య ఒక ఆసామీ- ‘షిర్డీబాబాలోంచే శివుడూ, గణపతీ, విష్ణువూ, అంబా- అందరూ పుట్టారు. అసలు దేవుడు షిర్డీబాబాయే. ఆ బాబా నాలో ఉన్నాడు. నేను ఆ బాబాలో ఉన్నాను. నేనే బాబాని!’ అని అన్నాడు. ‘షిర్డీబాబా అందరికీ దేవుడే’ అన్న ప్రచారం ఇపుడు బాగా జరుగుతోంది. ఈ విషయంలో నాకో అనుభవం ఉంది.. ఏలూరు దగ్గరున్న పెదవేగిలోని శివాలయంలో ముప్ఫయ్యేళ్ల టీచర్ యువతి వచ్చి నాతో-‘బాబా గుడికి కూడా రండి. అందరికీ ఆయనే దేవుడు. బౌద్ధ చైత్యం పక్కనుంది’ అంది. నేను- ‘అందరికీ అంటున్నావు, వాళ్లు వస్తున్నారా మరి?’ అన్నాను. ఆమె- ‘రావట్లేదనుకోండి, ముందుముందు వస్తారు’ అంది. ‘ఎలా వస్తారు, వాళ్ల దేవుళ్లమీద నమ్మకం లేనివాళ్లు అగ్నిగుండాల్లో పడి మలమల కాలిపోతారని వాళ్లు అంటారు కదా. మనం అలా కాలిపోయే వాళ్లం కదా. కాలకుండా ఉండాలంటే మనం వాళ్ల దేవుళ్లని కూడా నమ్మాలి గాని, వాళ్లని రమ్మంటే మనతో వస్తారా! మన దీపారాధనలూ, కర్పూర హారతులూ, సూర్యార్చనలూ, కుంకంబొట్టూ, విభూతులూ- ఇవన్నీ వాళ్లకి నచ్చుతాయా?’ అని నేను అనడంతో ఆమె ఆలోచనలో పడింది. ఆమె అంది- ‘అందుకనేగదా, మనం చెప్పేది.. బాబాయే అందరికీ దేవుడు’-అని.
‘‘రేపు వాళ్లురావటం మొదలుపెట్టి నిన్ను మతం మారమంటే..’’ అన్నా. చురుగ్గా ఆమె అంది. ‘మారిపోతాం! ఏ మతమైతే ఏంటి సార్, అన్ని మతాలూ ఒకటే గదా!’ అని. అన్ని మతాలూ ఒకటేనా? అన్నింట్లోనూ జన్మ-కర్మ ఉందా?
నాకర్థమయ్యింది.. బాబాని అందరికీ దేవుడుగా ఎందుకు చేస్తున్నారంటే హిందువులు క్రమంగా అల్లానీ, క్రీస్తునీ మాత్రమే తమ దేవుళ్లుగా స్వీకరించాలనే ప్రణాళిక ఒకటి చాపకింద నీరులాగా ప్రవహిస్తోంది కనక! అందుకనే గదా ‘షిర్డీబాబా హిందూ దేవుడు కాదు’ అని సుప్రీంకోర్టు నుంచి తీర్పు తెప్పించబడింది!.. ‘కోట్లమంది బాబాను దేవుడంటున్నారు గదా’ అని ఒకవాదం. మరి, కోట్లమంది అమెరికన్ ‘కోకాకోలా’ అమోఘం అంటున్నారు. ఇంగ్లీషును ఇండియా భాష అంటున్నారు. ఆమోదిద్దామా? అసలు ఈ ప్రణాళికా వ్యూహం ఎవరిది? రాజకీయ నాయకులదా? మతం మార్పిడులు ప్రోత్సహిస్తూన్న వారిదా?
దేశంలో తీవ్రవాదులు ఎక్కువైపోయారు. ‘జీహాదీ’లు హిందూ ఆడపిల్లల్ని మాయం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కాశ్మీర్‌ను ఎట్లాగయినా పాకిస్తాన్‌లో కలపాలనే కుట్రతో నేషనల్ కాన్ఫరెన్స్ వగైరా పార్టీలూ, మతోన్మాదులు పెరిగిపోతున్నారు. ఈ స్థితిలో మన సనాతన హిందూ సంప్రదాయాల్ని వదులుకొని, వేదాల్లోగాని, ఉపనిషత్తుల్లోగాని, పురాణాల్లోగాని ఎక్కడా లేని బాబాని- ‘దేవుడు’ అని ప్రచారం చేసుకోవటం ఎంత తీవ్రమైన విషయమో అందరూ ఆలోచించాలి!

-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు 98857 98556