సబ్ ఫీచర్

‘తలాక్’కే తలాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో ఏ ఒక్క వర్గానికీ ప్రాథమిక హక్కులను త్రోసిరాజనలేమని మోదీ ప్రభుత్వ వాదనలో హేతుబద్ధతను భారతీయులందరూ ముక్తకంఠంతో అనుసరించాల్సిన సహేతుక విధానం. ముస్లిం మహిళలకు పెనుశాపంగా మారిన ‘తలాక్’ పద్ధతికి స్వస్తి పలకాలన్న ప్రతిపాదనపై ఇపుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఇండోనేషియా, ఈజిప్టు, ఇరాన్, టర్కీ, మొరాకో వంటి దేశాలన్నీ ‘తలాక్’ పేరిట అమలవుతున్న మతఛాందస వాదానికి వీడ్కోలు పలికి నూతన దృక్పథానికి నాంది పలికాయి. ఎవరి పట్లా వివక్ష, వ్యక్తిత్వానికి భంగం లేకుండా సమానత్వాన్ని చాటాలని భారత రాజ్యాంగ అధికరణలు ఉద్ఘోషిస్తున్నాయి. ‘తలాక్’ అనే పదాన్ని మూడుసార్లు భర్త చెబితేచాలు విడాకులు అయినట్లేనన్న మత ఛాందసవాదం ముస్లిం మహిళలకు హాని కలిగిస్తోంది. ఈ దురాచారానికి తామెప్పుడు బాధితులవుతామోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ముస్లిం మహిళల ఆవేదనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకుంది.
‘్భరతీయ ముస్లిం ఆందోళన్’ సంస్థ 2013 జూలై-డిసెంబర్‌ల మధ్య తలాక్ పై పది రాష్ట్రాల్లో చేసిన అధ్యయనంలో దిగ్భ్రాంతిని గొలిపే అనేక వాస్తవాలు వెల్లడయ్యాయి. దేశంలో దాదాపు 98 శాతం మంది ముస్లిం మహిళలు తలాక్ విధానం తొలగిపోవాలని ఆశిస్తున్నారు. అయితే, రాజ్యాంగంలోని 25వ అధికరణ మతస్వేచ్ఛను ప్రసాదిస్తోందని, తమ మత చట్టాల్లో జోక్యం చేసుకొనే హక్కు సర్వోన్నత న్యాయస్థానానికి లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు సవాల్ చేసింది. ఛాందసవాద మతశక్తుల ధోరణి వల్ల దాదాపు 19 కోట్ల ముస్లిం జనాభాలో 50 శాతం ఉన్న ముస్లిం మహిళలు ఆత్మగౌరవం, సమానత్వాన్ని కోల్పోయే పరిస్థితి ఉందని మానవతా విశే్లషకులు చెబుతున్నారు. మహిళల హక్కుల్ని పురుషులు కాలరాచివేస్తున్న వైనం మానవీయకోణంలో సహించరాని ఘోరమని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘తలాక్’ ఆచారం నుంచి ముస్లిం మహిళలను రక్షించేందుకు ఎన్‌డిఎ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఏ మతానికి చెందినవారైనప్పటికీ స్ర్తి, పురుషులకు సమాన న్యాయం దక్కేలా చూడాల్సిన బాధ్యత చట్టాలపైన, ప్రభుత్వాలపై ఉంది.
తమకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలంటూ కొందరు ముస్లిం మహిళలే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఉన్నత విద్యనభ్యసించిన షాయరా బానో ఉదంతం ఇందుకు ఉదాహరణ. ఇద్దరు పిల్లల తల్లిగా పదిహేనేళ్లు కాపురం చేసిన ఆమెకు భర్త విడాకులిచ్చేశాడు. ‘తలాక్’ అని మూడుసార్లు రాసిన కాగితాన్ని పోస్టుద్వారా పంపి దాంపత్య జీవితాన్ని భర్త తెగతెంపులు చేసుకొన్నాడు. ఇలాంటి క్షోభకు గురైన పలువురు మహిళలు ‘తలాక్’ పేరిట విడాకులు చెల్లవంటూ కోర్టులను ఆశ్రయించారు. రాజ్యాంగబద్ధత అనే గీటురాయితో ఆ చట్టాన్ని పరీక్షించాల్సి ఉందన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మోదీ ప్రభుత్వం స్పందించింది. లింగ వివక్షతో పాటు ముస్లిం మహిళల గౌరవాన్ని భంగపరచేలా ఉన్న చట్టాన్ని రద్దుచేయడం అత్యంత అవశ్యకమని కేంద్రం సుప్రీం కోర్టులో దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో పేర్కొంది. పలు ఇస్లాం దేశాలే ఈ ఛాందస ఆచారాలు మతంలో అంతర్భాగం కాదంటూ సంస్కరణల బాటలో సాగినపుడు, మూర్ఖంగా వాటినే పట్టుకొని మనం వేలాడడం అర్థరహితమని ప్రభుత్వం చెబుతోంది. కేంద్రం వినిపించిన సహేతుక వాదనను స్వాగతిస్తూ, ఛాందస వాదుల కుతర్కాలకు ‘తలాక్’ చెప్పి నవ సమాజ నిర్మాణానికి ప్రగతిశీలక ముస్లింలందరూ నడుం కట్టాలి.

-దాసరి కృష్ణారెడ్డి