సబ్ ఫీచర్

ఎటు చూసినా చీకటే..! అయ్యో...ఇషా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నేనేం నేరం చేశాను. నేనెందుకిలా అయ్యాను. ఒకప్పుడు ఈ కిటికీలో నుంచి చూస్తే ఆకాశం ఎంత అందంగా కనిపించేది. నేడు చీకటి కమ్మేసింది. ఒకప్పుడు ఈ లెక్కల పుస్తకంలోని చిక్కులను సునాయాసంగా విప్పేదాన్ని, ఈరోజు పేజీలను తిప్పుతుంటే కేవలం అనుభూతే మిగిలింది.’’ - ఇది 14ఏళ్ల ఇషా ముస్తాఖ్ చిన్ని మనసులో గూడుకట్టుకున్న వేదన. మూడు నెలల క్రితం ఈ బాలిక అందరిలాగానే నెలవంకను చూసింది. పచ్చటి ప్రకృతిని వీక్షిస్తూ చెంగు చెంగున స్కూలుకు పరుగుపెట్టేది. పాఠాలను చదివేది. అదే ఇషా ముస్తాఖ్ కళ్లు పోగొట్టుకుని గుడ్డిదైంది. అందాల కశ్మీర్ లోయ నేడు రణభూమిని తలపిస్తోంది. ఎటు చూసినా తుపాకీల మోత, బాంబుల శబ్ధాలతో నెత్తురోడుతుంది. అలాంటి కాశ్మీర్‌లో మూడు నెలల క్రితం ఇషా కిటికీలో నుంచి చూస్తోంది. ఉన్నంట్టుండి ఒక్కసారిగా గోళీల వర్షం ముఖం అంతా చిమ్మింది. ఏమి జరిగిందోనని అనుకునేలోపే ఆమె కళ్లల్లో గోలీలు గుచ్చుకుని ‘అమ్మా ’అని అరిచి పడిపోయింది. బాధతో ఆ కళ్లలో నుంచి కన్నీరు కారాల్సివుండగా రక్తంధారలు కట్టింది. ఢిల్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆ చిన్నారి కళ్లల్లో వెలుగులు పూయలేదు. రెండు కళ్లూ పోయాయి. సైనికులారా! నేను చేసిన నేరం ఏమిటి? అని ఆ చిన్నారి గుండె ఆక్రోశిస్తోంది. కాశ్మీర్‌లోనేడు తుపాకీ గుళ్ల వర్షం కురుస్తోంది. ఎపుడు ఏమిజరుగుతుందోనని ఆత్మరక్షణ కోసం గోళీల తుపాకీలు వాడుతున్నారు. ఇవి ఒకప్పుడు జంతువులను వేటాడేందుకు వాడేవారు. కాని నేడు వీటిని పోలీసులు ఆత్మరక్షణ కోసం వాడుతున్నారు. ఏమాత్రం అనుమానం వచ్చినా ముందు ఈ తుపాకీలతో కాల్పుల జరుపుతారు. ఆనాడు కిటీకీలో నుంచి చూస్తున్న ఇషా పొరపాటున సైనికులు జరిపిన కాల్పుల్లో ఇలా రెండు కళ్లు పోగొట్టుకుంది. ఈ గోలీల తుపాకీ వర్షానికి ఇప్పటి వరకూ 89మంది చనిపోగా, వేలాదిమంది గాయపడ్డారు. ఇలాంటి బాధితులలో ఇషా ఒకరు.