సబ్ ఫీచర్

ఆలుమగలు ఆగర్భ శత్రువులు కాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భర్తలు భార్యలను సతాయించటం ఎంత వాస్తవమో భార్యలు భర్తల్ని సతాయించటమూ అంతే సత్యం. అయితే నిష్పత్తిలో తేడా ఉండవచ్చు. కాని సాధించటంలో మాత్రం సమపాళ్ళలోనే ఉంటుంది. భర్తల్ని ఎలా లొంగదీసుకోవాలి? ఎలా మచ్చిక చేసుకోవాలి వంటి విషయాలపై చర్చలు జరుగుతుంటే ఆశ్చర్యమేస్తోంది. మచ్చిక చేసుకోవటానికి లొంగదీసుకోవటానికి కొమ్ములు కోరలు వున్న క్రూరమృగాలా? అని అనిపించేది అప్పట్లో. ఆడవారిని అణచిపెడుతున్నారని గోల చేసే మహిళలు మగవాడిని చెప్పుకింద తేలులా చూడాలనుకోవటం తప్పుగా భావించటంలేదు. స్ర్తి, పురుషులిద్దరూ మానవజాతికి చెందినవారే. ఒకరి అవసరాలకు మరొకరు ఆసరానే తప్ప ఆగర్భ శత్రువులు కారు.
నాడు కేవలం టీచరు, నర్సు, వైద్య వృత్తులకే పరిమితమైన స్ర్తిలు నేడు అడుగుపెట్టని రంగం లేదన్నా అతిశయోక్తి కాదనుకుంటాను. పట్ట్భద్రత నేటి యువతుల సామాన్య విద్యార్హత. అత్యధిక విద్యావంతులే కాక అధిక సంపాదనాపరులుకూడా. (చాలామంది) విద్యవలన జ్ఞానం, జ్ఞానం వలన వినయం కలుగుతుందన్నమాట నేడు అసత్యమైపోతూ వుంది (మినహాయింపులు ఉన్నాయనుకోండి). ఆర్థిక స్వాతంత్య్రంవలన ఆత్మవిశ్వాసానికి బదులుగా అహంకారం చోటుచేసుకుంటున్నది. ఉదారమైన ప్రవృత్తికి బదులు సంకుచిత తత్వం పెరిగిపోతున్నది. వెనుకటి రోజుల్లో చాలావరకు తల్లి తండ్రివైపు నుంచి మేనరికపు పెళ్లి చేసేవారు. శాస్ర్తియంగా మంచిది కాదని తేలటంతో వదులుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే. తల్లివైపు మేనరికమైనా అప్పగింతల వేళలో తల్లులు అమ్మాయిలతో అది నాకు పుట్టిల్లే అయినా నీకు అత్తగారిల్లు. అందుచేత ఎవరి మనసు నొప్పించకుండా జాగ్రత్తగా మసలుకొమ్మని హితబోధ చేసేవాడు. నేడలాంటి వాతావరణమూ లేదు. హితబోధలు వినేంత చిన్న పిల్లలు కాకపోవటం మరి కారణం. స్వయం నిర్ణయం తీసుకోగల వివేచన నేటి అమ్మాయిలకు ఉంది. అయినా చెప్పుడు మాటల తీపి ముందు వివేచన తలవంచక తప్పదు.
భార్యలందరూ మంచి వాళ్ళు కారు. అలాగే భర్తలందరూ చెడ్డవారు కారు. మంచి చెడు ఇద్దరిలోనూ ఉంది. ఎప్పుడూ మనం నాణేనికి ఒకవైపు చూస్తాం. మరోవైపు చూడటం అవసరం.
పెళ్ళయి నెల రోజులయినా వేరింటి కాపురం ధ్యాసే లేదండి మా అమ్మాయికి. కొత్త పెళ్లికూతురన్న ధ్యాసయినా లేకుండా వాళ్ళత్తగారు గొడ్డుచాకిరీ చేయిస్తుందని వాపోయే తల్లులూ ఉన్నారు. ఇరుగుపొరుగు అయ్యాక కూతురు నస పెట్టడం మొదలుపెడతారు. ఆ పాటికి కొత్తకాపురం మోజు తీరి రంగంలోనికి దిగుతారు. అమ్మాయిలయినా, అమ్మలయినా ఈ సంకుచితత్వం విడిచి కాస్తా ఉదారంగా వ్యహరిస్తే నాటికి నేటికి కూడా మన భార్యాభర్తల అనుబంధమే ప్రపంచ దేశాలన్నింటికి తలమానికంగా నిలబడుతుందనటంలో ఎలాంటి సంశయమూ లేదు.

- ఆయికమలమ్మ