సబ్ ఫీచర్

వ్యాపకాలకు వారధి కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడేళ్ల శిరీషా కమ్మగా నిద్రపోతుంది. అమ్మ కుదిపి కుదిపి లేపేసరికి ఏడుపు లంకించుకుంది. హడావుడిగా స్నానం చేయించి కొత్త స్కూలు డ్రెస్స్ వేసి భుజం వెనుక చిన్న బ్యాగ్, చేతిలో పాస్టిక్ బుట్టలో చిన్న క్యారియర్, కాళ్లకు బూట్లు, సాక్స్ వేసేస్తుంటే ఆ చిన్నారికి ఏమీ అర్థం కాలేదు. కాని ఈ డ్రెస్స్, బూట్లు అన్నీ బాగున్నాయి. అమ్మ వేస్తుంటే ఏడుపు ఆపి ఆసక్తిగా చూస్తుంది. ఇంతలో ఆటో హారన్ వినిపించేసరికి అమ్మ గబగబా తీసుకువెళ్లి ఆటోలో కూర్చోబెట్టి టాటా చెప్పేసరికి అపుడు శిరీషా గట్టిగా ఏడ్వవటం ప్రారంభించింది. డ్రెస్స్, బూట్లు, బ్యాగ్ అన్నీ బాగున్నాయి. కాని అమ్మని విడిచి వెళ్లమనే సరికి ఆ కళ్లల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆటోలో కూర్చోనని ఏడ్చినా..మారం చేసినా అమ్మ బుజ్జగించి.. గదమాయించి కూర్చోబెట్టేసరికి వెక్కివెక్కి ఏడుస్తూనే వెళ్లింది.

పుట్టిన బిడ్డలో సగటున వంద మిలియన్ల బ్రెయిన్ కణాలు ఉంటాయి. ఇవి బిడ్డ మూడేళ్లు వచ్చేవరకు మెదడును వృద్ధిచేసేందుకు తోడ్పడతాయి. ప్రతి సెకండుకు 700 కొత్త సినాప్టిక్ కనెక్షన్లు తయారవుతుంటాయి. ఈ వయసులో వారికి ఏదైనా నేర్పితే మెదడుకు పదును పెట్టినట్లే. పెద్దవారికంటే పిల్లల్లో రెండురెట్లు అధికంగా మెదడుకు పదును పెరుగుతుంది. అందుకే ఈ వయసులో వారిలో ఆసక్తిని మెండుగా కలిగిస్తే అది కొన్ని దశాబ్దాలపాటు అదేక్రమంలో సాగుతుంది.

పిల్లల్ని స్కూలుకు పంపేముందు వారికి స్కూలు పట్ల ఇష్టాన్ని పెంచేందుకు వేసే ప్రీప్రైమరీ స్కూలుకు తమ పిల్లల్ని పంపే ప్రతి తల్లికి ఎదురయ్యే సమస్య ఇది. చిన్నారుల్లో ఉన్న ఆసక్తి, అనురక్తి, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని రెట్టింపుచేసే వాతావరణం ఉండేలా ప్రీప్రైమరీ స్కూ లును ఎంపిక చేసుకోవటం కూడా తల్లిదండ్రులకు పరీక్షే. తమ ముద్దుల బిడ్డ ఆడుతూ.. పాడుతూ ప్రైమరీ స్కూలుకు వెళ్లాలంటే స్కూలు ఎంపికలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు.
స్కూలు ఇంటికి దగ్గరగా ఉండేటట్లు చూసుకోవాలి. ఆ స్కూల్లో పిల్లలకు ఆసక్తికరంగ ఎలాంటి పద్ధతుల్లో నేర్పుతున్నారో తెలుసుకుని చేర్పించాలి.
సంవత్సరానికి వసూలు చేస్తున్న ఫీజు వివరాలు, ఆటస్థలం, ఆధునిక సాంకేతికి పరిజ్ఞానాన్ని అందించే సౌకర్యాలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. పిల్లల సంఖ్యకు తగ్గట్లు టీచర్లు ఉన్నారో లేదో తెలుసుకోవాలి.
ప్రీప్రైమరీ స్కూల్లో ప్రతిరోజూ విద్యార్థులతో ప్రార్థన చేయిస్తున్నారో లేదో గమనించండి.
బడి అంటే ఆడుతూ పాడుతూ తమకు నేర్పే నేస్తమే అనుకునే విధంగా వాతావరణం ఉండాలి.
కొంతమంది పిల్లలకు ఆటలు నేర్పిస్తే చాలు అనుకుంటారు. చదువు అవసరం లేదనుకుంటారు. కాని ఎదిగే పిల్లల్లో ఆసక్తి మెండుగా ఉంటుందనే విషయం గుర్తించి వారికి చదువు పట్ల మమకారాన్ని పెంచేలా చేయాలి.
ఇంటి దగ్గర్లో ఉన్న అన్ని ప్రీప్రైమరీ స్కూళ్ల వివరాలను తెలుసుకుని అందులో మేలైన స్కూలును ఎంపికచేసుకుంటే మంచిది.
క్షణం తీరకలేని ఉద్యోగంలో తలమునకలయ్యే తల్లులు వారితో కనీసం రెండు గంటలైనా గడపండి. లేకపోతే పెద్దవారిని వారికి తోడుగా ఉంచండి. దీనివల్ల వారితో అనుబంధం పెరిగి చక్కటి అలవాట్లు వస్తాయి.
ఈ వయసులో వారికి కథలు చెప్పటం వల్ల వారిలో నైతికస్థయిర్యాన్ని కలిగించినవారవుతారు. బొమ్మల కథలే వారిలోని భయాన్ని తొలగిస్తుంది.
చదువుతో పాటు డ్యాన్స్, సంగీతం, ఆటలు తదితర వ్యాపకాల్లో ఆసక్తిని పెంచితే వారిలోనమ్మకాన్ని కలిగిస్తోంది.
తోటి పిల్లల నుంచి ఎంతో నేర్చుకుంటారు. తమనుతాము మార్చుకుంటారు. కాబట్టే మంచి అలవాట్లు అలవర్చుకునేలా ప్రైమరీ పాఠశాల ఉండాలి.
భవిష్యత్తులో ఉపయోగపడే నైపుణ్యాలను అలవర్చుకునేలా వారిని తీర్చిదిద్దేలా ఉండాలి.
నలుగురిలో చక్కగా మెలిగే నైపుణ్యాన్ని వారికి ప్రాధమికంగా నేర్పించేలా సన్నద్ధం చేయండి.