సబ్ ఫీచర్

కిక్‌బాక్సింగ్‌లో కాశ్మీరీ కుసుమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లోల కాశ్మీర్‌కు ప్రపంచ చరిత్రలో నెత్తురోడే ప్రాంతంగానే పేరు ఉన్నది. కాని ఇపుడు ఆ చరిత్రను తిరగరాస్తూతొమ్మిదేళ్ల తజముల్ అనే కాశ్మీర్ కుసుమం కిక్ బాక్సింగ్‌లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అతి చిన్న వయసులోనే ప్రపంచ విజేతగా నిలిచిన తజముల్ కాశ్మీర్‌లోని తర్కపుర అనే కుగ్రామం నుంచి వచ్చిన పేదింటి పిల్ల. అయితేనేమి ఈ చిన్నారికి పసివయసు నుంచే తల్లి అందించిన ప్రోత్సాహాంతో కిక్‌బాక్సింగ్‌లో రాటుతేలింది. ఇటలీలోని ఆండ్రియాలో జరిగిన ప్రపంచ కిక్‌బాక్సింగ్ పోటీల్లో స్వర్ణపతకం సాధించి కాశ్మీర్‌కే కాదు యావత్ భారతదేశానికి ఘన విజయాన్ని అందించింది. ఎందుకంటే కిక్‌బాక్సింగ్‌లో బంగారుపతకం సాధించిన అతి చిన్న వయస్కురాలు. అంతేకాదు ఇప్పటి వరకు కిక్‌బాక్సింగ్ చాంపియన్‌కు ఎంపికైన తొలి భారతీయురాలు తజముల్ కావటం విశేషం. 90 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనగా వాళ్లందరినీ పక్కకునెట్టి విజేతగా నిలిచింది.
తండ్రి డ్రైవర్
తజముల్ తండ్రి గులాం మహమ్మద్ కనస్ట్రక్షన్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి గృహిణి. సోదరుడు కిక్‌బాక్సింగ్‌కు శిక్షణకు వెళుతుంటే తజముల్ కూడా వెళ్లేది. అలా చిన్న వయసులోనే కిక్‌బాక్సింగ్‌లోకి ప్రవేశించిన తజముల్ గత ఏడాది స్టేట్ చాంపియన్ షిప్ సాధించింది. వెనువెంటనే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని తనకన్నా ఎక్కువ వయసు ఉన్న 13ఏళ్ల ప్రత్యర్థిని మట్టికరిపించి బంగారు పతకాన్ని సాధించి రికార్డు నెలకొల్పింది. ప్రపంచ విజేతగా నిలవటం పట్ల ఆనందాన్ని వ్యక్తంచేస్తూ ఈ పోటీల్లో నిలిచినపుడు ప్రత్యర్థిని చూసి ఒకింత భయపడ్డాను. కాని దృష్టంతా ఆటపై నిలిపి తానిచ్చిన ఒకేఒక షాట్‌తో ప్రత్యర్థిని ఒడించి గెలిచాను. తనపై తనకు ఉన్న నమ్మకమే విజేతగా నిలిపిందని తజముల్ సమాధానిమిస్తుంది. ఫైజల్ అలీ అనే మార్షల్ ఆర్ట్స్ కోచ్ వద్ద శిక్షణ తీసుకుంటున్న తజముల్ వారానికి 25 గంటలు మాత్రమే శిక్షణ తీసుకుంటుందని, సరైన కోచింగ్ అందిస్తే తజముల్ అద్భుత విజయాలు సాధిస్తుందని అంటున్నాడు. ఇప్పటికే కోచ్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వేగంగా ప్రాక్టీస్ చేసే తజముల్ అంటే స్కూల్లో టీచర్లకు కూడా ఎంతో ఇష్టం. క్యూట్‌గా ఉండే తజముల్ తోటి పిల్లలతో ఎంతో మృధువుగా మాట్లాడుతుందని ప్రిన్సిపాల్ షబ్నమ్ కౌన్సర్ అంటారు. కిక్‌బాక్సర్ మాత్రమే కాదు తోటి పిల్లలతో హుషారుగా డ్యాన్స్ చేస్తుంది. పాటలు పాడు తూ సీతాకోకచిలుకవలే స్కూల్లో సందడి చేస్తోంది. భవిష్యత్తులో డాక్టర్‌ను అవతాను. ఇప్పటి వరకు తాను కిక్‌బాక్సింగ్‌లో ఎంతోమంది ఎముకలు విరగ్గొట్టాను. మరి డాక్టర్‌నై వారి ఎముకలు సరిచేయాలి కాదా అని చిరునవ్వులు చిందిస్తుంది చిన్నారి తజముల్.

చిత్రం..క్యూట్‌గా ఉండే తజముల్ స్కూల్లో తోటి పిల్లలతో హుషారుగా డ్యాన్స్ చేస్తుంది. పాటలు పాడుతూ సీతాకోకచిలుక వలే సందడి చేస్తుంది
*