సబ్ ఫీచర్

మాటతీరుతో గుండె పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనేది సామెత. నాడు మన పెద్దలు చెప్పిన పలు హితోక్తులను నేడు మనం పెడచెవిన పెడుతున్నాం. అంతేకాకుండా, పెద్దలు చెప్పిన మాటలకు శాస్ర్తియత లేదని కొట్టివేస్తున్నాం. అయితే పెద్దల మాటలు చద్దిమూటలు వంటివని, వాటికి శాస్ర్తియత ఉందని ఇప్పటికే పలు అంశాలలో తేటతెల్లం అయింది. తాజాగా నోరు మంచిదైతే గుండె పదిలంగా ఉంటుందని నూటికి నూరుపాళ్ళు నిజమని ఒక పరిశోధనలో తేలింది. నోరు మంచిది అయితే గుండె చక్కగా పనిచేస్తుందని ఈ పరిశోధనలో వెల్లడి అయింది. నోటికి, గుండెకి మధ్య సంబంధం ఏముంది అనే అనుమానం కలగడం సహజమే. మనకు సమాజంలో గుర్తింపును కలుగజేసేది, మిత్రులు, బంధువులను ఆకట్టుకొనేలా చేసేది మన మాట తీరు (నోరు). మనం ఎంత మం చిగా మాట్లిడితే, మనకు మన చుట్టుప్రక్కల వారితో అంత చక్కని ఆత్మీయ బంధం ఏర్పడుతుంది. అందరితో ప్రేమభావంతో మాట్లాడితే, మనకు శతృవులు ఎవరూ వుండరు. అయితే ఇరుగు పొరుగు వారితో స్నేహంగా, ప్రేమపూర్వకంగా ఉండేవారి గుండె చక్కగా పనిచేస్తుందని, అటువంటివారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువని ఇటీవల జరిపిన ఒక పరిశోధనలో తేలింది.
అమెరికాలోని మిచిగన్ విశ్వవిద్యాలయం ఈ విషయంపై ఐదువేల మందిపై పరిశోధనలు చేసి ఫలితాలను ఇటీవల వెల్లడించింది. ఈ పరిశోధనలో ఇరుగుపొరుగుతో స్నేహపూర్వకంగా ఉండేవారి గుండె చాలా చక్కగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా, అటువంటివారికి గుండెపరమైన సమస్యలు (వ్యాధులు) వచ్చే అవకాశాలు తక్కువని తేలింది. నిత్యం చిర్రుబుర్రులాడే సోదర, సోదరీమణులారా, మీరు గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే, ఇరుగుపొరుగుతో స్నేహపూర్వకంగా ఉండండి.

- పి.్భర్గవ్‌రామ్