సబ్ ఫీచర్

టీనేజర్లకు వింటర్ చిట్కాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి చలి పెరుగుతూ ఉష్ణోగ్రతలు అక్కడక్కడ సింగిల్ డిజిట్‌లో నమోదవుతున్నాయి. అందం, ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ పెట్టాల్సిన సమయం ఇది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యం విషయంలో ఈ చలికాలం చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే టీనేజర్స్‌ని చలి అంతగా బాధించదు కాబట్టి ఎంతసేపు చర్మం పొడిబారం, పెదవులు పగలడం సమస్యలకే సులువైన మార్గాలు వెతుక్కుని కాలం గడుపుతారు. కానీ టీనేజర్స్ సైతం శీతాకాలంలో తీసుకునే ఆహారం, వేసుకునే దుస్తులు, స్నానం, నిద్ర.. ఇలా ప్రతీ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.బయటకు వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ తప్పక రాసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తాగాలి. పచ్చికూరలూ పళ్ళూ అధికంగా తినాలి.
సబ్బుల జోలికి వెళ్లకండి: చలికాలంలో చర్మం సహజ మెరుపును కోల్పోయి అందవిహీనంగా తయారవుతుంది. ఒకింత నల్లగా మారుతుంది కూడా. ఈ ఇబ్బందులనుంచి తప్పించుకోవాలంటే.. వీలైనంత వరకు సబ్బుల జోలికి వెళ్లకుండా సున్నిపిండి వినియోగించి గోరువెచ్చటి నీటితో స్నానమాచరించాలి. సున్నితమైన చర్మ సౌందర్యానికి స్నానానికి ముందుగా ఏదైనా నూనె శరీరానికి పట్టిస్తే మంచిది. నువ్వుల నూనె, ఆముదం చలికాలంలో చక్కగా పనిచేస్తాయి. ముఖవర్చస్సుకు సెనగపిండి, పాలు కలిపి పేస్టులా చేసి రాయండి. పావుగంట తర్వాత కడిగేస్తే చర్మం సరికొత్త కాంతులీనుతుంది. ముఖంమీదనే కాక మెడ, మోచేతులు, మోకాళ్ళు, కాళ్ల మడమలు.. ఇలా కాస్త నల్లగా మారిన చోట నిమ్మ చెక్కలను తీసుకుని కాస్త రసం రుద్ది కాసేపు తర్వాత కడిగేస్తే చర్మం తేటగా తయారవుతుంది.
ఇలాంటి ఆహారం అవసరం : ఆమ్లాలు చర్మరోగాన్ని సంరక్షిస్తాయి. అవి పుష్కలంగా లభ్యమయ్యే పాలు, చేపలు, వాల్‌నట్స్, సోయా, అవిసె గింజలు ఆహారంలో భాగం చేసుకోవాలి. జీర్ణక్రియ మందగించడం, రోగ నిరోధక శక్తి తగ్గడం మూలంగా పలు రుగ్మతలకు దారితీయకుండా ఉండాలంటే.. సమయానికి ఆహారం వేడిగా తీసుకోవడంతో పాటు తాజా పండ్లు, పండ్ల రసాలు తప్పనిసరి. నిత్యం నడక, వ్యాయామం, సరిపడా నిద్ర అవసరం.
జట్టుకు పోషణ : యువతలో ప్రధానమైన సమస్య జుట్టు పొడిబారటం. చిట్లిపోవటం, చుండ్రు.. వీటిని నివారించాలంటే రెండు రోజులకొకసారి విధిగా తలస్నానం చేయాలి. జుట్టు మృదుత్వం సంతరించుకోవడానికి కొబ్బరి నూనెలో కాస్త బాదం నూనె చేర్చి రాత్రివేళ జుట్టుకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి ఉదయానే్న గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. గోళ్ళు, పాదాలు, పెదవులు, బుగ్గలు, జుట్టు మరే ఇతర శరీరావయవాలకైనా రాత్రి పడుకునే ముందు లేపనాలు రాసుకోవడం మరిచిపోవద్దు. కాళ్ల పగుళ్లకు వేజిలిన్ లేదా పెట్రోలియం జెల్లీలు వాడాలి. వీలైతే కాసేపు గోరువెచ్చటి నీటిలో పాదాలను నాననిచ్చి శుభ్రంగా తుడిచి జెల్లీ రాయడం ఉత్తమం. పాదాలు పగలకుండా సాక్స్ వేసుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
ఇంట్లోనే చేసుకునే ఫేస్‌ప్యాక్‌లు ఉత్తమం : డబ్బు ఆదాతో పాటూ అనవసరమైన ఫుడ్ ఎఫెక్ట్స్ లేకుండానూ ఉంటాయి. చిటికెడు పసుపులో పాల మీగడ కలిపి ముఖానికి రాసి పది నిమిషాల తర్వాత కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడంవల్ల చర్మం కాంతులీనుతుంది. ఒక టేబుల్ స్పూను శెనగపిండిలో అర టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ పాలమీగడ, రెండు టీ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి ఆరిన తర్వాత కడగాలి. మేలిమి చర్మం మీ సొంతం అవుతుంది. పెదవులను నాలుకతో తడపకూడదు. అలాగే పెదవులను కొరకడం, చర్మం లాగడంవల్ల సమస్య జఠిలమవుతుంది. ఆయింట్‌మెంట్ బేస్ ఉన్న చక్కని లిప్ బామ్‌లను వాడుకోవాలి.

- హర్షిత