సబ్ ఫీచర్

కార్మికులతోనే అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని జాతీయ కార్మిక సంఘాలు ప్రభుత్వం తేనున్న కార్మిక చట్టాలకు సంస్కరణలకు వ్యతిరేకంగా మార్చి 10వ తేదీన నిరసన కార్యక్రమాన్ని ఖరారు చేసాయి. అదే నెలాఖరున ఒక సామూహిక తీర్మానం కోసం పెద్దఎత్తున కార్మిక సమీకరణను తలపెట్టాయి. కార్మిక సంఘాలు జనవరిలో 15 డిమాండ్లతో వినతిని కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించాయి. వాటి సాధనకు ఈ రెండు కార్యక్రమాలను 11 జాతీయ సంఘాలు చేయనున్నాయి. దేశం తీవ్ర కార్మిక సమస్యను ఎదుర్కొంటున్నది. ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) కూడా అదే మాట అంటున్నారు. ప్రపంచ కార్మిక సంక్షేమం కొరకు ఐఎల్‌ఓ ఎనిమిది ప్రధాన అంశాలను పేర్కొంది. వాటిలో నాలుగింటిని భారత ప్రభుత్వం అధికారికంగా ఆమోదించలేదు. అవి కార్మిక సంఘంగా ఏర్పడడం,విస్తరణకు కార్మికులను సమీకరించడం, కనీస పని వయసు మినహాయింపు, ప్రమాదకర బాల కార్మిక పనుల జాబితా, కార్మికుల సమీకరణ, సమస్యల పరిష్కారానికి యాజమాన్యంతో సామూహిక మంతనాలు. ఇండియా ఆమోదించని మరో ముఖ్యాంశం కనీస వేతన మినహాయింపు.
ఐఎల్‌ఓ ఏర్పరిచిన కార్మిక ప్రమాణాలను అనుకరించి అంతర్జాతీయ కార్మిక సమాఖ్య ప్రతి సంవత్సరం ఆ సమాఖ్యలో భాగస్వామ్య దేశాలకు రేటింగ్ ఇస్తుంది. ఆయా దేశాల్లో కార్మిక శ్రేయస్సు ఆధారంగా 1-5 రేటింగ్ ఇస్తుంది. గత సంవత్సరం ఆ సంస్థ రేటింగ్‌లో ఇండియాకు 5వ స్థానం దక్కింది. ఇది చివరి స్థానం. ఇండియా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని మనందరికీ తెలుసు. కానీ కార్మికుల హక్కులు గుర్తింపులో నియంతృత్వ దేశాలైన సౌదీ అరేబియా, క్వాటర్, యుఎఇల సరసన వున్నాం. ఈ ఒక్కటి చాలు మన కార్మిక ప్రగతి అంచనాకు. ఐఎల్‌ఓ నిబంధనల ప్రకారం కార్మిక చట్టాల తయారీలో, వివాదాల పరిష్కారాల్లో త్రైపాక్షిక విధానం అవలంబించాలి. కానీ ప్రస్తుత పరిణమాలు గమనిస్తే ఎన్‌డిఎ ప్రభుత్వం పారిశ్రామిక వర్గాలకే ఓటు వేసే అవకాశాలు ఎక్కువగా పొడసూపుతున్నాయి. అలా జరిగితే గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు వుండి కష్టజీవులకు ఒనగూడే ఫ్రయోజనం ఏదీ వుండదు. దేశీయ కార్మిక సంఘాల గురించి పరిశీలకుల అభిప్రాయాలను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవడం అవసరమే. జాతీయ కార్మిక సంఘాల మధ్య వున్న సంఘీభావం కేవలం లాంఛనప్రాయమంటారు. ఈ బలహీనతే వరసగా ఎన్నికైన ప్రభుత్వాలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నది. గత సంవత్సరం సెప్టెంబర్ 2న జరిగిన సార్వత్రిక సమ్మె విఫలతకు ఈ బలహీనతే అవకాశాన్నిచ్చింది. మారిన పరిస్థితుల్లో కార్మిక సంఘాలు ప్రాధాన్యత కోల్పోయాయని, ముఖ్యంగా జాతీయ కార్మిక సంఘాలకు కాలం చెల్లిందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచీకరణ పదునెక్కాక తయారీ రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. తయారీ రంగాన్ని విడగొట్టి చిన్న కాంట్రాక్టుగా ఇచ్చి లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ మార్పు సంఘటిత రంగాన్ని చాలా నీరసింపచేసింది. ఇందుకు మంచి ఉదాహరణ రెడీమేడ్ బట్టల తయారీ. దేశంలో అన్ని పెద్ద పట్టణాలు, నగరాల్లో పెద్ద కంపెనీలు కాంట్రాక్టు పద్ధతిలో రెడీమేడ్ దుస్తులు చేయిస్తున్నాయి. ఈ రంగంలో వేలాదిమంది కనీస వేతనాలు, సెలవులు, పనిచేసే చోట మంచినీరు, మరుగుదొడ్లువంటి కనీస వసతులు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వివిధ వస్తు తయారీ ఈ బాటనే నడస్తున్నది. సంఘటిత రంగాన్ని అసంఘటితంగా మార్చివేస్తున్నది.
జాతీయ కార్మిక సంఘాలు రాజకీయ పార్టీలకు అనుబంధంగా పనిచేస్తున్నాయి. ఇవి ఆయా పార్టీలకు వ్యతిరేకంగా పనిచేయగలవా? అలాగే పార్టీ మధ్య వుండే సంఘీభావం గురించి తెలియంది ఎవరికి? రాజకీయ పార్టీలే వారి అనుబంధ కార్మిక సంఘాలను శాసిస్తాయనడంలో వారు విభేదించకపోవచ్చు. కార్మిక సంఘాలు కొన్ని సంఘటిత రంగాలకే పరిమితం కావడానికి కూడా ఇదేకారణం కావచ్చు. సామాన్యుని ఎదుగుదలే దేశ ప్రగతికి కొలమానం. మేక్ ఇన్ ఇండియా విజయవంతం కావాలంటే అది కార్మిక రంగ అభివృద్ధితోనే సాధ్యం. ఆ దిశగా పార్టీలు, వారి అనుబంధ కార్మిక సంఘాలు పనిచేస్తేనే ప్రగతి, ప్రజాస్వామ్యాలు ముందుకు వెడతాయి.

- వి.వరదరాజు