సబ్ ఫీచర్

పనిలోనే జీవన సౌందర్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా స్నేహితురాలింట్లో పిచ్చాపాటీ మాట్లాడుకుంటుండగా ఆమె కోడలి బంధువు వచ్చింది. పరిచయాలూ, కాఫీలూ అయ్యాక బంధువు ‘‘రోజూ పద్దెనిమిది గంటలు పని చేస్తున్నాను. విశ్రాంతి అంటే ఏమిటో తెలియదు. నాకై నేను సమయం కేటాయించుకునే అవకాశమే లేదు’’ అంటూ అరగంటసేపు వాపోయింది. ‘‘ఇంతసేపు నీ కష్టాలు నువ్వు మా అందరికీ చెప్తూనే ఉన్నావు. ఈ సమయమెవరి ఖాతాలో వెయ్యాలి’’ అని అడగాలనిపించలేదు. ఎందుకంటే ప్రతిరోజూ వింటున్న మాటలే, చాలా కథలలో, వ్యాసాలలో సారాంశమే.
ఆధునిక స్ర్తి అనుక్షణమూ, అనుదినమూ (నేటి మేనేజిమెంటు భాషలో (365న7న24) అందరికోసం ఆరాటపడుతోంది. ఆమె కష్టాన్ని కుటుంబ సభ్యులు గుర్తించడం లేదు. కథలలో అయితే ఆమెకు ఏ హార్ట్ అటాక్ వచ్చినప్పుడో భర్త గుర్తిస్తారు. ఇంతకీ రోజుకి 18 గంటలు స్ర్తి చేసే పనేమిటి? యాభై ఏళ్ళకి క్రిందకు వెళితే...
అప్పట్లో పల్లెలలో ఉదయమే నిద్రలేచిన వెంటనే వీధి గుమ్మం తుడిచి ముగ్గు వేసుకోవాలి. (నేటి ఇల్లాళ్ళు ఈ పని చేస్తున్నారు). అదృష్టం బాగుంటే నూతి నీళ్ళు రుచిగా ఉంటాయి. నూతి దగ్గరే స్నానం చేసి నీళ్ళు తోడి తెచ్చుకోవచ్చును. లేదంటే దగ్గరలో ఉన్న నదికో, కాలవకో, ఊరి బావిలో బిందె తీసుకొని వెళ్ళవలసినదే. (నీటి ఎద్దడి ప్రాంతాలలో శ్రామిక వర్గ స్ర్తిలకు కష్టం నేటికీ ఉంది).
నీళ్ళు తెచ్చుకున్నాక కుంపటికానీ, కట్టెల పొయ్యి కానీ అంటించి వంట చెయ్యాలి. పచ్చళ్ళూ, మినప్పప్పు రోట్లో రుబ్బుకోవాలి. పిండి, రవ్వ తిరగట్లో విసురుకోవాలి. సాయంత్రమయ్యేసరికి దీపాల చినీలు ముగ్గు పిండితో తుడిచి, కిరసనాయిలు పోసి, దీపాలు వెలిగించి అన్ని గదులలో పెట్టాలి. నేడు సమయం లేదనే మహిళలు కిరసనాయిలు దీపాలను చూసైనా ఉంటారా?
అయినప్పటికీ అప్పటి అతివలకి ‘హాయిగా ఎంజాయ్’ చెయ్యడానికి టైం ఉండేది. భర్తను ఆఫీసుకీ, నలుగురైదుగురు పిల్లలనూ స్కూలికి పంపాక మధ్యాహ్న వేళలో గవ్వలుకానీ, చీట్లపేక కానీ ఆడుకునేవారు. సాయంత్రాలు గుడికి కానీ, ఎవరైనా పిలిస్తే పేరంటాలకు కానీ వెళ్లి నలుగురితో సరదాగా గడిపేవారు. ఆధునిక సదుపాయాలేమీ లేకున్నా ఆనందంగానే ఉండేవారు.
ఇంతకీ పద్ధెనిమిది గంటలు తంటాలు పడుతూ చేసే పని ఇంట్లో ఏముంటుంది? ఇద్దరు పిల్లలు కొన్ని కుటుంబాలలో అయితే ఒక్కరే. గ్యాస్‌స్టవ్, మిక్సీ, ఫ్రిజ్ లేకుండా ‘‘ఈ రెండు వైపులా కాలిపోయే కొవ్వుత్తుల’’వంటి ఆడవారి ఇళ్ళు ఉంటాయనుకోను. ఇడ్లీ టిఫినుగా చెయ్యాలనుకుంటే మినపప్పు నానపెట్టడానికి అరనిమిషం, నానిన పప్పును కడిగి మిక్సీలో వెయ్యడానికి మూడు నిమిషాలు, పప్పు నలిగే సమయం మూడున్నర నిమిషాలు, రవ్వ కడిగి పిండిలో కలిపే సమయం అయిదు నిమిషాలు. పిండి పులిసేదాకా పనిలేదు. ఆపైన ఇడ్లీ పిండి ప్లేట్లలో వేసి కుక్కర్‌లో పెట్టడం పది నిమిషాలను మించదు. ఇడ్లీ ఉడికే సమయంలో పచ్చడి ‘మిక్సీ పట్టవచ్చును’ (ఈ తెలుగు భాషా ప్రయోగం నాది కాదు)
పది దోసెలు వెయ్యడానికి పది నిమిషాలకన్నా పట్టదు. ఆ మాత్రానికే రెండు పెనాలు రెండు పొయ్యిల మీద పెట్టి హడావుడి పడిపోవడమెందుకో అర్థంకాదు. అరకిలో బంగాళాదుంపలు తరిగి వేయించడానికి అరగంటకన్నా పట్టగూడదు. ఎంత గొప్పగా వంట చేసుకున్నా గృహిణికి రోజుకి రెండు, మూడు గంటలకన్నా వంటింట్లో పని ఉండదు. ఇక పనిమనిషి కూడా లేకుండా గినె్నలు తోముకోవడం, ఇల్లు తుడుచుకోవడం, బట్టలుతకడం, ఇస్ర్తి చెయ్యడం వంటివన్నీ చేసేస్తూంటే మరో మూడు గంటల పని. ఎంతగా లెక్కపెట్టినా బజారుపనితో కలిపి రోజుకి ఎనిమిది గంటల పని ఉండవచ్చు కానీ పద్దెనిమిది గంటల పని ఎక్కడిది?
ఇక ఇంటిపనీ, ఆఫీసు పనీ చేసే ఉద్యోగినుల మాటకేం చెప్పచ్చు? వారికి మొదటి ప్రశ్న- ఆఫీసులో ఉన్నంతసేపూ ఇంట్లో చెయ్యవలసిన పనులూ, పిల్లల పెకంపమూ ఇంకొకరు చేస్తూనే ఉండాలి. ఆ సమయమంతా గృహకృత్యాల నిర్వహణ నుండి విముక్తి ఉన్నట్లు కాదా? ఇక రెండవ ప్రశ్న- ఉద్యోగమన్నది కుటుంబ పోషణకూ, పిల్లల భవిష్యత్తుకూ మాత్రమే చేస్తున్నామా? ఉద్యోగం చెయ్యడంవల్ల సంఘంలో హోదా పెరుగుతుంది. తమకు నచ్చిన ఖర్చులు పెట్టకుందుకు చేతిలో డబ్బుంటుంది. పది మందితో కలిసిమెలిసి ఉండే అవకాశం సులభంగా లభిస్తుంది. ఉద్యోగ నిర్వహణకయ్యే ప్రయాణ ఖర్చులూ, ఆఫీసులో పెట్టుకునే ఖర్చులూ, ఖరీదైన వస్త్రాలకూ, మేకప్ సామానులకూ అయ్యే ఖర్చులూ మొదలైనవి తీసేస్తే జీతంలో మిగిలేదెంత? కుటుంబం కోసం ఇంటా, బయటా కష్టపడిపోతున్నామన్న సెల్ఫ్ పిటీ ఎందుకు? (అఫ్‌కోర్స్, మగవారికీ ఈ విషయం వర్తిస్తుంది. నీకోసం, పిల్లలకోసం గొడ్డుచాకిరీ చేస్తున్నాననే భర్తలకి లోటులేదు)
గృహిణులైనా, ఉద్యోగినులైనా గుర్తించవలసినదొక్కటే. మనం చేస్తున్న ప్రతి పనీ ఎవరికోసమో కాదు. వండుకున్నమ్మ తినకమానదు, కడుపుతో ఉన్నమ్మ కనక మానదు అని (కొంత మోటు) సామెత ఉంది. వంట ఎవరికోసమో చెయ్యం. సంపాదన ఇతరుల కోసమే సంపాదించం. జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని పనులు చేసుకుంటే రోజుకి ఎనిమిది గంటలు, మహా అయితే పది గంటలు పని ఉంటుంది. ఇంట్లో పసిపిల్లలు, దీర్ఘవ్యాధిగ్రస్తులు ఉంటే బయటకు వెళ్ళే అవకాశం లేక మనస్సుకి విశ్రాంతి ఉండకపోవచ్చును. సాధారణ పరిస్థితులలో రోజుకి పద్ధెనిమిది గంటలు పనిచేస్తున్నారంటే వారు అబద్ధమైనా చెప్తూ ఉండాలి లేదా చక్కగా పనిచెయ్యడం రానివాళ్ళైనా అయి ఉండాలి. మొదటిరకం మహిళలు సంఘంలో గుర్తింపుకోసం, సింపతీకోసం తహతహలాడడం మానేసి నిజాయితీగా ఉండడం నేర్చుకోవాలి.
రెండవ రకం స్ర్తిలు తమ పని విధానాన్ని పరిశీలించుకుని, వర్క్ ఆడిట్ చేసుకుని, పనిలో సమర్థతను పెంచుకుని, పని చేసే గంటలు తగ్గించుకోవాలి. అంతేకానీ రోజుకి పద్ధెనిమిది గంటలు పనిచేస్తున్నాను, రెండు వైపులా కాలిపోయే కొవ్వొత్తిని అని అనుకోడం, అనడం అభిలషణీయం కాదు. గుర్తింపు దానంతట అదే రావాలి కానీ అందుకోసమే ఆరాటపడడం సరైన పనికాదు. గుర్తింపు రాకున్నా బాధపడకూడదు. సంతోషం, తృప్తి మనలో ఉండాలి కానీ ఇతరులపై ఆధారపడితే లాభం లేదు.

- పాలంకి సత్య