సబ్ ఫీచర్

పసి మనసుపై పిచ్చి గీతలు వద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమాజంలో పిల్లలు గురించి.. తల్లిదండ్రులు ప్రతిక్షణం ఆలోచన చేస్తూనే వుంటారు. తప్పదు మరి. ఎందుకంటే.. అది వారి బాధ్యత. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు అవగాహన లేకపోతే నష్టపోయేది చిన్నారులే. పిల్లలకు స్వేచ్ఛ అనేది కొంత పరిమితి వుండాలి. మితిమీరిన స్వేచ్ఛ అనర్థదాయకం. ఒక వయస్సు వచ్చేవరకు మాత్రమే అది సాధ్యం. కొందరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు తగినవా? కావా? అనే పరిశీలన చేసేది మాత్రం తల్లిదండ్రులే!. ఎదిగే వారి మనస్సులో పిచ్చిగీతలు రాయకుండా అందమైన అక్షరాలను లిఖిస్తే వారికి అందమైన జీవితాన్ని అందించినవారవుతారు.
బలవంతపు చదువు ఒక ప్రశ్నగానే..
పిల్లలకు ఇష్టం లేకపోయినా.. తమ ఆలోచనలకు తగ్గట్టుగా అసలు విషయం లేని చదువును కొందరు బలవంతంగా నేర్పించాలనీ చూస్తారు. చదువుకున్నవారందరూ డాక్టర్లు కారు.. ఇంజనీర్లు కారు కదా! బలవంతపు చదువు అనేది ఒక ప్రశ్నగానే మిగిలి వుంటుంది. సాధించాలనే లక్ష్యం వుం డాలేగానీ విద్యార్థులకు చదువుకోవడం అనేది ఏ మాత్రం కష్టం కాదు. ఇందుకోసం మంచి అవగాహనతో కూడిన సూచనలు ఇవ్వడం..వ్యక్తిత్వ వికా సానికి సంబంధించిన రచనలను ఎక్కువగా చదివించేలా చర్యలు తీసుకోవడం పెద్దల బాధ్యతగా గుర్తించాలి. పసి మనస్సులను అర్థం చేసుకోవాలి.
నష్టపోతున్నది రేపటి పౌరులు
ఈనాటి విద్యార్థులు మానసికంగా ఎదగడంలే దు. కోపం.. విసుగు.. ప్రతికారవాంఛ.. మొదలగు లక్షణాలతో ఆవేశంలో.. వారికి తెలియని ఒత్తిడిని జయించలేక, పెద్దల మాటలను పూర్తిగా వినలేక.. అసలు చదువుకోవడం ఇష్టంలేక.. భవిష్యత్ అం తా తెలియని శూన్యం అని భావించి, ఎంతో విలువైన జీవితాన్ని వదలివెళ్లడం చూస్తూనే వున్నాం. ఈ విషయంలో మార్పు తప్పనిసరిగా రావాలి.
స్వయం కృషే సోపానం
మన సంగీత ప్రపంచంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ, సేవాభావంతో మదర్ థెరిస్సా, శాస్త్ర సాంకేతిక రంగంలో అబ్దుల్ కలాం.. ఇలా ఎంద రో మహానుభావులు వారి చిన్నతనంలో ఎన్నో కష్టాలు పడినవారే.. ఇలా స్వయంకృషితో వారి వారి రంగాల్లో అగ్రస్థానంలో నిలిచారంటే అది వారి గురువులు, ఉపాధ్యాయుల చేయూత ఎంతో వుందని గ్రహించాలి. ఇలాంటి ఆదర్శప్రాయుల జీవితాల గురించి వారు చదివేటట్లు ప్రోత్సహిస్తే ఉన్నతంగా ఎదుగుతారు. సమాజం నాకేమి ఇచ్చింది అని ఎదురుచూడడం మాని, నేను కొంచమైనా సేవ చేస్తున్నానా అనే ప్రశ్న ప్రతి ఒక్కరూ వేసుకుంటూ వుంటే.. మనసులో సరికొత్త ఆలోచనలు వస్తాయి. తద్వారా బాధ్యతలు పెరుగుతాయి. చివరికి ఒక నవీన సమాజానికి కావలసిన రేపటి పౌరులు తయారవుతారు. ఈ విషయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంత ముఖ్యమో.. ఉపాధ్యాయుల పాత్ర కూడా అంతే అవసరం.. ఈ దిశ గా అందరూ పునరంకితులు కావడం ఉత్తమం!
చిన్నారులు యవ్వన ప్రాయం వచ్చేవరకు పెద్దలపై ఆధారపడటం సహజం! తమ పిల్లలకు ఫలానా స్కూల్లో సీటు కావాలనీ ఆరాటపడుతున్నారే కానీ అసలు విషయం లేని చదువును బలవంతంగా నేర్పిస్తున్నామని అనుకోవటం లేదు. దీనివల్ల ఒత్తిడికి గురై మానసికంగా ఎదగడంలేదు.

- పెండెం శ్రీనివాస శివప్రసాద్