ఐడియా

సోలార్ సోల్జర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పచ్చటి ప్రకృతిని కాపాడుకోవాలనే తహ తహ అందరికీ ఉంటుంది. కాని కొందరు మాత్రమే పర్యావరణ ప్రేమికులుగా మారతారు. ఇలాంటి ప్రేమికులలో కూడా చాలామంది తమ వరకు తాము పనిచేసుకుపోతారు. కొందరు మాత్రమే నలుగురికి పర్యావరణ పాఠాలను జీవిత పాఠాలుగా చెప్పేందుకు సాహసిస్తారు. ఇలాంటి కోవకు చెందినవాడే హైదరాబాద్‌కు చెందిన రాబెల్లి నవీన్. ఎలక్ట్రానిక్ ఇంజినీర్‌గా రెవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీలో పనిచేస్తుండగా.. అక్కడ సోలార్‌తో పనిచేసే వాహనాల గురించి అధ్యయనం చేయటం ప్రారంభించాడు. అతనికి చిన్నప్పటి నుంచి ప్రజలకు పర్వావరణ అంశాలను చెప్పాలని కలలు కనేవాడు. ఈ ఉద్యోగం వల్ల అతనికి మంచి అవకాశం దొరికింది. సోలార్ ఆటో రిక్షాలో ఇండియా నుంచి లండన్‌కు ప్రయాణం చేస్తూ.. ప్రజలకు సోలార్ వాడకం వల్ల కలిగే పర్యావరణ ప్రయోజనాలను తెలియజెప్పాలని ఆరాటపడ్డాడు. దీనికోసం సోలార్‌తో నడిచే ఆటోరిక్షాను రూపొందించాడు. సెకెండ్‌హ్యాండ్‌కు చెందిన ఆటోరిక్షాను యశ్వంత్‌పూర్‌లో రూ.65,000లకు కొనుగోలు చేశాడు. ఈ ఆటోరిక్షాపై పర్యావరణానికి సంబంధించిన బొమ్మలను అందంగా చిత్రీకరించాడు. ఇక యాత్రకు ఉపక్రమించాడు.
మరో తోడు లేకుండా..
తెలంగాణ ప్రభుత్వ టూరిజం సహకారంతో.. ఎంపీ కవిత ఆశీస్సులతో తన యాత్రకు శ్రీకారం చుట్టాడు. మరో మనిషి తోడు లేకుండా వేల కిలోమీటర్ల ప్రయాణం అంటే మాటలు కాదు. అయినప్పటికీ వెరవలేదు. గత ఏడాది అంటే ఫిబ్రవరి 8, 2016న బెంగళూరు నుంచి తన యాత్ర ఆరంభించాడు. ఏడునెలల పాటు రాత్రీ పగలూ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి తన సాహస యాత్ర పూర్తిచేశాడు. మధ్య మధ్యలో చిన్న చిన్న అవాంతరాలు అంటే పర్స్, పాస్‌పోర్టు పోగొట్టుకోవటం జరిగింది. దీని వల్ల ప్రయాణం ఐదురోజుల పాటు ఆలస్యం అయింది మినహా ఎలాంటి ఆటంకం కలుగలేదు. తొలుత ఇరాన్ వరకు షిప్‌లో వెళ్లిన నవీన్ అక్కడ నుంచి ఆటోయాత్ర ఆరంభించాడు. అక్కడ నుంచి టర్కీ, బల్గేరియా, సెర్బియా, హంగేరి, ఆస్ట్రేయా, జర్మనీ, పారిస్ మీదుగా లండన్‌కు చేరాడు. ఈ ప్రయాణంలో అతనికి అన్నంపెట్టి ఆదరించినవారు లేకపోలేదు. పర్యావరణ బొమ్మలతో ఉన్న ఈ ఆటోను వింతగా.. ఆసక్తిగా ఆగి చదివినవారు కోకొలల్లు. ఇతని కృషిని అభినందిస్తూ కొన్ని హోటళ్లవారు ఉచితంగా వసతి సౌకర్యాన్ని సైతం కల్పించటం జరిగింది. అంతేకాదు ప్రముఖ హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వార్జ్ తన ట్విట్టర్ ద్వారా నవీన్‌ను అభినందిస్తూ ప్రోత్సహించారు. ఇలా ఎన్ని అడ్డంకులు ఎదురైనా తన చిన్ననాటి కలను నెరవేర్చుకున్న నవీన్ సోలార్ పవర్‌ను ప్రపంచానికి చాటి చెప్పాడు.
.............................
తెలంగాణ ప్రభుత్వ టూరిజం సహకారంతో.. ఎంపీ కవిత ప్రోత్సాహంతో తన యాత్రకు శ్రీకారం చుట్టాడు. మరో మనిషి తోడు లేకుండా వేల కిలోమీటర్ల ప్రయాణం అంటే మాటలు కాదు. అయినప్పటికీ వెరవలేదు. గత ఏడాది అంటే ఫిబ్రవరి 8, 2016న బెంగళూరు నుంచి తన యాత్ర ఆరంభించాడు. ఏడునెలల పాటు రాత్రీ పగలూ రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి తన సాహస యాత్ర పూర్తిచేశాడు. *