సబ్ ఫీచర్

వ్యాపారంలోనూ రాణులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెలబ్రిటీ అనే కోవలోకి వస్తే ఆ స్టేటస్‌ను నిలబెట్టుకునేందుకు నానాతంటాలు పడక తప్పదు. ఇందుకు ఐశ్వర్యం తొలి మెట్టు అవుతుంది. ఆర్థిక విజయానికైనా..జీవితంలో గెలుపుకైనా కావల్సింది మన మీద మనకు నమ్మకం అనే సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకున్న నేటీ సెలబ్రిటీలు ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. ఆర్థిక పరిణితితో అడుగు ముందుకు వేస్తున్నారు. క్షణం తీరిక లేకుండా షూటింగ్‌లతో సంపాదించిన సంపాదనతో గాలిలో మేడలు కట్టకుండా ఆ సంపాదన నిలుబెట్టుకునేందుకు అవసరమైన పునాదులు, స్తంభాలు ఏర్పాటుచేసుకునేందుకు సమాయత్తమవుతున్నారు. వెండితెర మీద సెలబ్రిటీలుగా వెలుగొందుతున్న అనేక మంది తారలు ఈ వెలుగు ఆరిపోకుండా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు కోట్లలో సంపాదించిన సంపదను చాలామంది పెట్టుబడులుగా పెట్టి వ్యాపార రంగంలోనూ తమదైన ముద్ర వేసుకుంటున్నారు. ఆర్థిక స్థిరత్వాన్ని సంపాదించుకుంటున్నారు. సినీ రంగంలోని కొందరు సెలబ్రిటీలు ఏ వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఎలా రాణిస్తున్నారో తెలుసుకుందాం.
శృతిహాసన్:హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న ఈ మల్టీస్టార్ హీరోయిన్ ఇపుడు బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. సొంతంగా ప్రొడక్షన్ సంస్థను ఏర్పాటుచేసి షార్ట్ ఫిల్మ్స్, వీడియో రికార్డింగ్, యానిమేషన్ చిత్రాలను నిర్మిస్తోంది. ఆమె సోదరి అక్షరహాసన్ ఈ ప్రొడక్షన్ కంపెనీ వ్యవహారాలను చూసుకుంటుంది.
ఆషాభోంస్లే:ప్లేబ్యాక్ సింగర్, మెలోడీ మహారాణి ఆషాభోంస్లే ఎన్‌ఆర్‌ఐలకు భారతీయ వంటకాలను రుచి చూపిస్తుంది. దుబాయ్‌లో అనేక చోట్ల ఎన్‌ఆర్‌ఐలకు తన రెస్టారెంట్ నుంచి రుచికరమైన వంటలను అందించే బిజినెస్స్ చేస్తుంది.
సుస్మితాసేన్:మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ వెండితెర నుంచి తప్పుకున్న తరువాత ఖాళీగా ఉండకుండా అనతికాలంలోనే వ్యాపార రంగంలోకి ప్రవేశించి రాణిస్తోంది. అంతేకాదు నావీ ముంబయిలో బెంగాలీ రుచులను సరసమైన ధరలకు అందిస్తోంది. దుబాయ్‌లో ఈ సుందరికి రిటైల్ బంగారం షాప్ ఉంది. పలు హోటళ్లు, స్పా సెంటర్లు సైతం ఉన్నాయి.
ట్వింకిల్ ఖన్నా : అక్షయ్‌కుమార్ భార్య అయిన ట్వింకిల్ ఖన్నా తల్లి డింపుల్ కపాడియాతో కలసి క్యాండిల్ బిజినెస్ చేస్తుంది. కొవ్వొత్తుల వ్యాపారం అని చిన్న చూపు చూడకండి. కోట్లాది రూపాయల్లో టర్నోవర్ జరుగుతుంది. విదేశాలకు సైతం ట్వింకిల్ క్యాండిల్స్ ఎగుమతి అవుతాయి. ట్వింకిల్‌లో మరోకోణం కూడా దాగి ఉంది. మంచి రచయిత్రి. ఇది కాకుండా గ్రేజింగ్ గోట్ పిక్చర్స్ పేరుతో సొంత ప్రొడక్షన్ ఉంది. దానికి ట్వింకిల్ కో ఫౌండర్. ముంభై వ్యాప్తంగా వైట్ విండో అనే ఇంటీరియర్ డిజైన్ స్టోర్ బ్రాంచీలకు ఆమె కోఓనర్.
శిల్పాశెట్టీ:ఈ పొడవు కాళ్ల సుందరి రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ అసోసియేట్ సంగతి పక్కనపెడితే, ఈమె అనేక స్పా సెంటర్లను లాంచ్ చేసింది. ఈ మధ్యకాలంలో బంగారం బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. శిల్పా భర్త కూడా వ్యాపారవేత్త కావటంతో ఈ రంగంలో దూసుకుపోతుంది. యోగాపై వీడియోలను రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసి తన పాపులార్టీతో బిజినెస్ చేసుకుంటుంది. అంతేకాదు తన సొంత కంపెనీ అయిన ఎస్సెన్షియల్ స్పోర్ట్స్ మీడియా బ్యానర్‌లో దిష్కియాన్ అనే సినిమా కూడా నిర్మించింది.
లారాదత్తా:ఈ మాజీ విశ్వసుందరి, తల్లయిన లారాదత్తా సైతం వ్యాపారం రంగంలో రాణిస్తుంది. ఈమెకు భీగి బసంతి అనే సొంత ప్రొడక్షన్ కంపెనీ ఉంది. వస్తర్రంగంలోకి వచ్చి చాబ్రా 555తో కలిసి చీరల అమ్మకాలు చేస్తుంది. మరోవైపు ఫిట్‌నెస్ డీవీడీలు విడుదల చేస్తుంది.
కరిష్మాకపూర్:అందాల కరీష్మాకపూర్ ఇద్దరు పిల్లలకు తల్లి. ఈ-కామర్స్ పోర్టల్ ప్రారంభించి తల్లీబిడ్డలకు సంబంధించిన వస్తువుల అమ్మకాల వ్యాపారం ఆరంభించింది. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లోకి ప్రవేశించి కొత్త వెంచర్లను ప్రారంభించింది.
*

చిత్రాలు..సుస్మితాసేన్, కరిష్మాకపూర్, ఆషాభోంస్లే, శిల్పాశెట్టీ, లారాదత్తా