సబ్ ఫీచర్

ప్రేమే సంగీతానికి ఆహారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా అధ్యక్ష స్కాలర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన భారతీయ సంతతి యువగాయని
పద్దెనిమిదేళ్ల శ్రీయా బధ్రిరాజు సాధారాణ టీనేజర్ కాదు. భారత- అమెరికా సంతతికి చెందిన ఈ యువ కెరటం ఆర్ట్స్‌లో సంగీతం విభాగంలో ఈ ఏడాది అమెరికా అధ్యక్ష స్కాలర్ ప్రోగ్రామ్‌కు ఎంపికైంది. టెక్సాస్‌లోని ఎల్కిన్స్ హైస్కూల్‌లో చదువుతున్న శ్రీయా 60మందిని దాటుకుని ఈ ప్రోగ్రామ్‌లో ఎంపికైంది. నేషనల్ ఎంగ్ ఆర్ట్స్ ఫౌండేషన్ విద్యార్థుల్లోని సృజనాత్మకమైన కళలను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటుచేస్తుంది. దాదాపు 20 రాష్ట్రాల నుంచి 60 నామినేషన్లు వచ్చాయి. ఇందులో 20 మంది అన్ని రకాల పోటీల్లో గెలిచి నిలిచారు. వీరిలో ఒపెరా సంగీతం విభాగంలో శ్రీయా బధ్రిరాజు ఎంపికైంది. ఈ సంతోషకరమైన వార్త శ్రీయా స్కూల్లో ఉండగానే ఆమెకు చేరింది. వెంటనే ఆనందం పట్టలేక తల్లిదండ్రులకు ఈ-మెయిల్ మెస్సెజ్ పంపానని వెల్లడించింది.
నాలుగేళ్ల నుంచే కర్నాటక సంగీతంలో శిక్షణ
నాలుగేళ్ల వయసు నుంచే కర్నాటక సంగీతం నేర్చుకుంటున్న ఈ యువగళం వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లోనూ శిక్షణ తీసుకుంది. పదవ గ్రేడ్ నుంచి ఒపెరా నేర్చుకుంటుంది. ‘నేను ఈ పోటీలో ఒపెరా సింగర్‌గా విజేతగా నిలిచినప్పటికీ తనకు భారతీయ సంగీతం అంటేనే ప్రాణమని చెబుతుంది. నేను ఇప్పటికీ భారతీయ సంగీత పాటలే పాడతాను. భజన్లు, హిందీ సినిమా పాటలంటే ఎంతో ఇష్టం. నాకు పునాదిరాయి కర్నాటకా సంగీతంలోనే పడింది. ఈ శాస్ర్తియ సంగీతాన్ని నిరంతరం ప్రాక్టీస్ చేస్తుండటం వల్ల నా వాయిస్ ఒపెరా నేర్చుకోవటానికి దోహదపడిందని చెబుతుంది.
మా ఇంట్లో మూడు భాషలు మాట్లాడుకుంటాం..
అమెరికాలో ఎన్నో ప్రతిష్టాత్మకమైన సంగీత కచ్చేరీల్లో పాల్గొన్న శ్రీయాకు కుటుంబ తోడ్పాటు సమృద్ధిగా ఉంది. అంతేకాదు ఇంట్లో తెలుగు, ఇంగ్లీషు, బెంగాలీ మాట్లాడుకుంటారు. తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్ నుంచి 24 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లారు. అక్కడ మిచిగాన్‌లో శ్రీయ బధ్రిరాజు పుట్టింది. ఆమెకు భారతీయ వంటకాలన్నా మక్కువే. దోశ,ఇడ్లీ, వడ అంటే ఇష్టం. ఇండియా వచ్చిందంటే కేరళ, షీర్డి, పుట్టపర్తి, హైదరాబాద్ చూడకుండా వెళ్లదు. ఖాళీ సమయంలో సంగీతంతో పాటు పుస్తకాలు చదువుతుంది. సినిమాలు చూస్తుంది. ప్రస్తుతం తానే సొంతంగా పాటలు రాసి బాణీలు కట్టే పనిలో శ్రీయా బిజీగా ఉంది.