సబ్ ఫీచర్

తరుణుల చేతిలో వార్తా తరంగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలుపు తీసిన చేతులే కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తున్నాయి.. లక్ష్మీశర్మ 27 ఏళ్ల యువతి. బీహార్‌లోని సీతామర్హికి చెందిన ఈ యువతి బ్యాచిలర్ ఆర్ట్స్ ఫైనలియర్ చదువుతుంది. చిత్రకూట్‌లోని మహిళా సమితిలో పనిచేస్తుంది. ఆమె రిపోర్టర్ జాబ్ కోసం దరఖాస్తు చేసుకుంది. విలేకరిగా ఎలాంటి అనుభవం లేదు. కాని మొదటి రౌండ్‌లోనే ఎంపికైంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమెకు పట్టలేని ఆనందం కలిగింది. ఎందుకంటే ఆ గ్రామం నుంచి మహిళా జర్నలిస్ట్‌గా ఎంపికైన తొలి యువతి. ఏడురోజులు మాత్రమే ఆమెకు శిక్షణ ఇచ్చారు. వార్తలు ఎలా సేకరించి, ప్రెజెంట్ చేయాలి. ఫొటోలు ఎలా తీయాలో చెప్పారు. ఇపుడు ఈ లక్ష్మీశర్మ ముంబయి వెళ్లి మూవీ మేకర్ సాఫ్ట్‌వేర్‌లో శిక్షణ సైతం తీసుకుని రాణిస్తుంది. ఇలాంటి లక్ష్మీశర్మ వంటి మహిళలు ఎందరో ఈ పత్రికలో పనిచేస్తున్నారు. ఒకప్పుడు కలుపు తీసిన చేతులే నేడు కంప్యూటర్‌ను ఆపరేట్ చేస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆ పత్రిక పేరే ‘ఖబర్ లహరియా’. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలలో దాదాపు 600 గ్రామాల్లో విస్తరించిన ఈ హిందీ వారపత్రిక గ్రామీణ వార్తలకు ప్రపంచ అంశంగా చేయటంలో సఫలీకృతమైంది. ఇందులో పనిచేసేవారందరూ కూడా మహిళలే. భోజ్‌పూరి, అవాధి, హిందూస్థాని, బజ్జిక ప్రాంతాలలో నాలుగు ఎడిషిన్ కేంద్రాలలో పనిచేస్తున్న ఈ పత్రికలో ఎడిటర్స్, రిపోర్టర్స్, డిజైనర్స్ అందరూ కూడా దళిత మహిళలే. నిరంతర్ అనే ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో కో-్ఫండర్ శాలినీ జోషి ఏర్పాటుచేసిన ఈ పత్రికలో పది జిల్లాల్లో 30 మంది రిపోర్టర్లు పనిచేస్తున్నారు. పదివేల కాపీలను ప్రింట్ చేస్తుంది.
ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు ఆహ్వానం లేకపోయినా
ప్రజల నాడి తెలుసు
ప్రస్తుతం జరుగుతున్న యూపీ ఎన్నికల్లో దీని హవా అంతా ఇంతా కాదు. స్థానికంగా ఎన్నో అంశాలను వెలికితీస్తోంది. ఎవరూ వీరిని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లకు ఆహ్వానించారు. కాని ఈ చదువురాని మహిళలు ఎన్నో అంశాలను వెలికితీస్తున్నారు. పెద్ద పెద్ద పత్రికల్లో రాని ఎన్నో మానవీయ కోణాల్లోని కథనాలు ఈ పత్రికలో వస్తుంటాయి. ప్రజలలో ఈ పత్రికకు ఉన్న ఆదరణ చూసి జనమే వారిని పిలిచి ఎన్నో అంశాలను వివరిస్తుంటారు. దీంతో వాటిని చక్కటి కథనాలతో కవర్ చేస్తుంటారు. ఈ పత్రిక 15 వసంతాలు పూర్తిచేసుకుంది. టెక్నికల్‌గా శిక్షణ తీసుకున్న ఈ దళిత మహిళా జర్నలిస్టులు తలపండిన మేధావులకు ఏమాత్రం తీసిపోకుండా ముందుకు సాగుతున్నారు.

చిత్రాలు..వివరాలు రాసుకుంటున్న మహిళా విలేఖరి
*వార్తా సేకరణకు వెళుతున్న మహిళా జర్నలిస్టులు