సబ్ ఫీచర్

యమహా నగరి కలకత్తాపురి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నా పెద్దా అందరినీ కేరింతలు కొట్టించే హోళీ పండుగు నెలరోజుల్లో మన ముంగిటకు రానున్నది. అంతేకాదు గుడ్‌ఫ్రైడే కూడా ఏప్రిల్‌లో జరుపుకోనున్నారు. ఈ రెండు పండుగలను పురస్కరించుకుని చక్కగా ఎక్కడైనా ఆనందంగా గడపాలనుకుంటున్నారా? అయితే కోల్‌కతాలోని ఈ ప్రదేశాలు మిమ్మల్ని మరింత ఆనంద డోలికల్లో ముంచెత్తుతాయి. హాలీడే ట్రిప్‌ను తీపిగుర్తుగా మలుచుకోండి. పచ్చటి తేయాకు తోటలు, వేలాడే పర్వత శిఖరాలు స్నేహంగా పలుకరిస్తాయ. ఆధ్యాత్మికతకు ఆలవాలమైన ఈ నగరంలో గజిబిజి ఉరుకుల పరుగుల మధ్య కాస్తంత సేద తీరటానికి అనువైన ప్రదేశాలు ఉన్నాయ. రోజూ చేసే పనులు ఒక్కొక్కసారి బోర్ కొట్టేస్తుంటాయి. మనసును ఉత్సాహంగా.. ఆహ్లాదంగా ఉంచుకోవాలంటే హాలీడే ట్రిప్‌లను ప్లాన్ చేసుకుంటే మీతో పాటు మీ కుటుంబ సభ్యులు కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. కుటుంబ సమేతంగా మన బడ్జెట్‌కు అనుగుణంగా కోల్‌కతాలోని ఈ లొకేషన్లు రిలాక్స్‌నిస్తాయి.
డార్జిలింగ్ : సిటీ ఒత్తిడి నుంచి బయటపడాలంటే పల్లె వాతావరణాన్ని తలపించే విధంగా చల్లటి కొండ ప్రాంతాలు, పిల్లతిమ్మెరను తలపించే స్వచ్ఛమైన గాలి, అద్భుతంగా కనిపించే వేలాడే శిఖరాలతో కోల్‌కతాకి సమీపంలో ఉండే డార్జిలింగ్‌ను ఎంపికచేసుకోవటం ఉత్తమం. డార్జిలింగ్‌లో పర్యటిస్తుంటే అలసటే అనిపించదు. టైగర్ హిల్స్‌పై నిలబడి సూర్యుడు ఉదయించటం చూడముచ్చటగా చూడవచ్చు. పక్కనే పిల్లలతో కలిసి జూను సందర్శించవచ్చు. కోల్‌కతాకు 6,710 అడుగుల ఎత్తులో ఉన్న డార్జిలింగ్ చేరుకోవాలంటే న్యూజల్పైగురి రైల్వేస్టేషన్‌లో దిగి అక్కడ నుంచి టాక్సీ లేదా లోకల్ బస్‌లో చేరుకోవచ్చు. లేదంటే సిలిగురి బాగ్దోగ్రా నుంచి ట్యాక్సీలో డార్జిలింగ్ చేరుకోవచ్చు.
దర్శిని :పురులియా జిల్లాలోని సద్గురం నది పక్కన ఉండే ప్రశాంతమైన కొండ ప్రాంతం. కోల్‌కతాకు 393 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోల్‌కతా నగరంలోని రణగొణ ధ్వనుల నుంచి బయటపడాలంటే దర్శిని ఎంతో ప్రశాంతమైన ప్రదేశం. నది పక్కన నడిచివెళుతుంటే పక్షుల కువకువలు వినిపిస్తుంటాయి. కొండపైకి వెళుతుంటే అడవి పందుల, హైనాలు, ఏనుగులు కనిపిస్తుంటాయి. విభిన్నంగా ఉండే వీరి జీవనశైలిని గురించి తెలుసుకోవాలంటే సంతల్, ముండా, కెరియా, సబారథ్ గ్రామాలకు వెళితే సరిపోతుంది. నిగమ్ అటవీశాఖ కాటేజీలు ఉన్నాయి. అటవీశాఖ కాటేజీలు చుట్టూ ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు ఉన్నాయి. సంతాల్ బంద్వాన్‌కు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఘట్సిలియా, పురులియా స్టేషన్లకు దగ్గరగా ఉంది.
సజ్ఞేఖాలి : వణ్యప్రాణులను కనులారా వీక్షించాలంటే సజ్ఞేఖాలి అద్భుతమైన ప్రాంతం. పచ్చటి ప్రకృతి, స్వచ్ఛమైన జలాశయాలు, అక్కడి ప్రజల సాధారణ జీవనశైలిని చూడవచ్చు. అంతేకాదు పక్షుల ప్రేమికులకు ఈ ప్రాంతం నచ్చుతుంది. పక్షులకు నెలవైన అభయారణ్యం ఉంది. అందుకే పక్షుల ప్రేమికులు గంటల తరబడి ఇక్కడ గడపటానికి మక్కువ చూపుతుంటారు. సరస్సుల్లో మొసళ్లు కూడా కనిపిస్తుంటాయ. వాచ్‌టవర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. 400 సంవత్సరాలనాటి నెటిధోపాని అనే ఆలయం ఉంది. మంచుకురిసే వేళలో ఈ ప్రాంతానికి వస్తే మనసుకు హాయిగా ఉంటుంది. ఇక్కడకు చేరుకోవాలంటే సోనాఖాళీ నుంచి బస్‌లోగానీ కారులోగానీ రావచ్చు. ఇక్కడ నుంచి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదు బసంతి, నామ్ఖాన్, గోసాబా నుంచి బోటు ద్వారా చేరుకోవచ్చు.