సబ్ ఫీచర్

ఆత్మవిశ్వాసమే ఆలంబన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరు బాగా చదువుకున్నారు. ఉద్యోగం రాలేదు. మరొకరు ప్రాథమిక విద్య పూర్తి చేయలేదు. అందువల్ల ఉద్యోగం రాదు. ఇంకేం చేయాలి. ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే ఏదీ మార్గం. ఆలోచనలు ముప్పిరిగొన్నాయి. అయినా కుంగిపోలేదు. మెదడుకు పదును పెట్టారు. అప్పుడు తట్టింది ఆలోచన... ఉద్యోగం కోసం ఎదురుచూస్తూనో, రాదనో సమయాన్ని వృథా చేసుకునే బదులు సొంతంగా ఏదో ఒకటి చేసి సంపాదన మొదలెట్టాలని. అంతే కొంగు బిగించారు. స్వయం ఉపాధిపై దృష్టిపెట్టారు. ఇప్పుడు తోటి మహిళలకూ ‘స్వశక్తి’ రుచిని చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆర్థిక స్వావలంబన దిశగా దూసుకుపోతున్నారు నేటి నారీమణులు! ఒకరు ఆయుర్వేదాన్ని నమ్ముకుంటే మరొకరు బొమ్మలను నమ్ముకున్నారు. ఇలా ఎంతోమంది మహిళలు విజయపథాన దూసుకుపోతున్నారు. వద్దని కొందరు వారించినా సొంతంగా ఆదాయమార్గాన్ని ఎంచుకుని ఫలితం రాబట్టిన ఈ అతివలు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
ఆదుకున్న ఆయుర్వేదం
ఈమె పేరు ఎస్.అక్తరి. ఊరు వైఎస్‌ఆర్ కడప. వీరి ఇంట్లో తాతముత్తాతల నుంచి వనమూలికలతో శరీర, కీళ్ల నొప్పులు తగ్గించే ఆయుర్వేద మందును తయారు చేస్తున్నారు. మందు మంచి ఫలితాన్ని ఇచ్చి, రోగుల్లో ఆదరణ చూరగొన్నా- పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు. దీంతో ఉపాధి కూడా అంతంతమాత్రంగానే ఉండేది. చదువుకున్న అక్తరి ఈ మందుకు ఒక రూపం తెచ్చింది. రోగులకు మరింతగా సాంత్వన చేకూరేలా మరికొన్ని వనమూలికలను చేర్చింది. ఆధునిక సొబగులు అద్దింది. వినియోగదారుడిని ఆకర్షించేలా సీసాలను తయారుచేసింది. పది వేల రూపాయల పెట్టుబడి సరిపడకపోవడంతో దిగులు చెందక, మెప్మా అధికారులను సంప్రదించింది. వారుకూడా ప్రోత్సహించారు. ఇప్పుడు దేశంలో అన్ని చోట్ల ఈ మందు పరిచయం అయింది. శరీర నొప్పులతో ఉన్న వారు మందును వినియోగించి, ప్రయోజనం పొందుతున్నారు.
వనమూలికలతో చేస్తున్నా
‘సైలెంట్ పెయిన్ కిల్లర్‌గా చెప్పే ఈ ఔషధం ద్రవరూపంలో ఉం టుంది. పూర్తిగా ఆయుర్వేద ఔషధం. మన దేశంలో లభ్యమవుతున్న వనమూలికలతో తయారు చేస్తాం. ఎటువంటి నొప్పులనైనా మాయం చేస్తుంది. ప్రభుత్వ గుర్తింపు కూడా పొందింది. నొప్పున్న చోట స్ప్రే చేస్తే చాలు. మర్దన అవసరం లేదు. అంతేకాదు. సౌందర్య ప్రియుల కోసం అలొవీర, జామ్ ఆయిల్, చందనం మిళితం చేసి, మరో ఆయుర్వేద మందు (ద్రవం)ను తయారు చేశాం. ఇది కూడా ఆదరణ పొం దింది. మంగు (తెల్ల,నల్ల), మొటిమలు, చర్మరోగాలు, గజ్జి, తామర, కాలిన, తెగిన, పొడిచర్మం, ముడతలు పడ్డ చర్మం, చికెన్ ఫాక్స్ తదితర వాటికి ‘ఫెయిర్ స్కిన్’ అనే ఈ మందు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంద’ ని అక్తరి తెలిపారు. ఏడాదికి సుమారు రూ. 90 వేలకు పైగా టోర్నవర్ అవుతోందని, డిఆర్‌డిఎ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రహీం స్వశక్తి అనే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్‌కూడా తమకు ఎంతో సాయం అందిస్తోందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు.
బొమ్మలతో సొమ్ములు
విశాఖ మన్యంలోని అరకుకు చెందిన మటం శిరీష అయిదో తరగతి వరకు చదువుకుంది. కానీ, గృహాలంకరణకు ఎటువంటి బొమ్మలు నప్పుతాయో ఇట్టే చెప్పయగలదు. అందుకే ఆమె అందమైన రంగు, రంగు బొమ్మలతో స్వయంగా వ్యాపారం మొదలుపెట్టింది. ఊరిలోని షిర్డీసాయి మహిళా సంఘంలో సభ్యురాలు. బ్యాంకు అందించిన సాయంతో అడుగులు వేస్తోంది. వ్యాపారంలో వృద్ధి సాధించేందుకు ఆధునిక హంగులకు తగ్గట్టు బొమ్మలు తయారీకి ఐటిడిఎ అధికారుల సాయంతో ఒడిశాలో కొద్ది రోజులు శిక్షణ కూడా పొందింది.
‘్భర్త బాలాజీ ఎంతో ప్రోత్సహిస్తున్నారు. వెదురు, ఇనుపతీగలతో బొమ్మలను తయారు చేస్తున్నా. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ప్రదర్శనలో బొమ్మలు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నా. ఘుమఘమలాడే అరకు కాఫీ పొడిని కూడా అమ్ముతుంటా. ఇలా ఏడాదికి సుమారు 70 వేలకు పైగా టోర్నవర్ ఉంటుం ది. ప్రభుత్వ అధికారులు మరింతగా ఆర్థిక సాయం అందిస్తే ఈ వ్యాపారంతో తోటి మహిళలకు ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉంటుంది. పాప, బాబు ఉన్నారు. వీరిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలంటే, ఇంట్లో ఉంటే సరిపోదు... చుట్టూ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకు ని, ముందడగు వేయాల్సిందే’ అంటోంది శిరీష. నిజమేకదా!

- జి.కృష్ణమూర్తి