సబ్ ఫీచర్

ఆటలే నేర్పుతాయి జీవిత పాఠాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లియాండర్ రాయ్‌కు చిన్నప్పటి నుంచి ఆటలంటే పిచ్చి. ఆర్థికలేమి అతడి ని ఆట స్థలం వైపే వెళ్లనివ్వలేదు. కాని అతనిలోని ఆశ, ఆకాంక్ష మాత్రం వీడలేదు. అవే అతడ్ని ఉన్నతమైన కోచ్‌గా తీర్చిదిద్దాయి.
చెన్నైకు చెందిన షానే లియాండర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాడు. బాస్కెట్ బాల్‌లో కోచింగ్ తీసుకోవాలని చిరుప్రాయంలోనే తపనపడిన అతని ఆశలన్నీ తారుమారయ్యాయి. తల్లి కష్టపడి చదివించింది. జూనియర్ ఇంటర్ చదువుతున్న సమయంలో ఓ రోజు తమ స్కూల్ గ్రౌండ్‌లో ఉన్న బాస్కెట్‌బాల్ కోర్టుకు వెళ్ళాడు. ఎటువంటి శిక్షణ లేకపోయినా, పలుమార్లు ఆయన చేసిన బంతి బాస్కెట్‌లో పడింది. దీంతో, అతనిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. చెన్నైలో ఉన్న క్రాస్ ఓవర్ బాస్కెట్ బాల్ అండ్ స్కాలర్స్ అకాడమీ నిర్వాహకుడు షానే జయచంద్రన్‌ను కలిసి, బాస్కెట్‌బాల్ ఆటపట్ల తనకు ఉన్న ఆసక్తిని తెలిపాడు. అకాడమీలో చేరడానికి తన వద్ద తగినంత డబ్బు లేకపోవడంతో, పార్ట్‌టైమ్ ఉద్యోగిగా అకాడమీలో చేరాడు. ప్రస్తుతం మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న లియాండర్‌కు పిల్లలకు బాస్కెట్ బాల్‌లో శిక్షణ ఇవ్వడం ద్వారా, వారు చదువులో మరింతగా రాణించేలా చేయవచ్చునే ఆలోచన కలిగింది. పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఆయన 80 మంది చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు. 80 మందిని రెండు గ్రూపులుగా చేశారు. రోజుమార్చి రోజు వీరికి శిక్షణ ఇస్తారు.
వ్యక్తిత్వంలో ఉన్నతంగా..బాధ్యతలో సమష్టితత్వం..్భవ వ్యక్తీకరణలో నిర్భయత్వం...లింగ భేదం లేని సమానత్వ ధోరణితో మన పిల్లలు పెరిగితే మనకెంతో సంతోషం. ఇలాంటి జీవిత పాఠాలనే ఆటలతో నేర్పుతున్నాడు షానే లియాండర్ రాయ్.
పేదపిల్లలకే శిక్షణ
ప్రస్తుత పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు తమ పిల్లల్ని ర్యాంక్‌లు సాధించే యంత్రాలుగా తీర్చిదిద్దడానికే తాపత్రయపడుతున్నారే తప్ప వ్యక్తిత్వమున్న మనుషులుగా మార్చటం లేదు. దీంతో, కాంక్రీట్ జంగిల్స్ వంటి కార్పొరేట్ విద్యా సంస్థలకు డిమాండ్ పెరిగింది. ఇటువంటి పిల్లలకు ఆటలు అంటే స్మార్ట్ఫోన్, కంప్యూటర్ లేదా వీడియో గేమ్‌లు మాత్రమే. అయితే లియాండర్ రాయ్ మాత్రం పిల్లల్ని ఆటలు ఆడించడం ద్వారా, వారు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారని చెబుతున్నాడు.
నాయకత్వ లక్షణాలతో సమాజంలో గౌరవప్రదంగా ఏ విధంగా జీవించాలి అనే అంశంపై శిక్షణ ఇస్తాడు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన పిల్లనే ఆయన తన శిక్షణకు ఎంపిక చేసుకోవడం గమనార్హం. ప్రతిరోజూ సాయంత్రం తమ పాఠశాల అయిపోగానే శిక్షణ కోసం వస్తారు. పిల్లలు తమ చదువు అయిపోయిన తరువాత, ఎవరిమీద ఆధారపడకుండా, తమ కాళ్ళపై తాము స్వతంత్య్రంగా జీవించేలా చేయడమే తన లక్ష్యమంటారు లియాండర్ రాయ్. శిక్షణా సమయంలో పిల్లల కళ్లల్లో కనిపించే ఆనందమే తనకు కోట్ల రూపాయలతో సమానం అంటారు.

- పి.మస్తాన్‌రావు