సబ్ ఫీచర్

ఆత్మన్యూనత వీడితే అఖండ విజయాలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎవరో వచ్చి ఏదో చేస్తారన్న’ది పాత మాట. రాబోయే ఆ ఎవరి కోసమో ఎదురుచూస్తూ మనం ఏమీ చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడం తెలివి తక్కువతనం. ఏ విషయంలోనయినా, ఎవరి విషయంలోనయినా ఈ మాటలు వర్తిస్తాయి. స్ర్తిల విషయంలోనే చూడండి.. ఒకప్పుడు ‘ఆడపిల్లలు చదువుకోకూడదు..’, ‘ఆడపిల్ల గడపదాటి బయటకు రాకూడదు’ వంటి ఎన్నో ఆంక్షలతోపాటు బాల్య వివాహాలు, బహుభార్యాత్వం, దుర్భర వైధవ్యం వంటి ఎన్నో సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు సమాజంలో విస్తారంగా ఉండేవి. వీటికితోడు పరుషాధిక్యత పెత్తనం చెలాయిస్తూ ఆమె జీవితాన్ని వంటింటికీ, పడకగదికి మాత్రమే పరిమితం చేసి.. ‘్భర్య అంటే బానిస’ అన్న సంకుచిత దృష్టితో చూడబడేది. అలా ఆ కాలం నాటి ఆడది సమాజ చట్రంలో ఇరుక్కుపోయి.. ఇరుకు బతుకు బతుకుతూన్న సమయంలో కందుకూరి వీరేశలింగం పంతులు, రాజారామ్మోహన్‌రాయ్, గురజాడ అప్పారావు వంటి మహనీయులు స్ర్తివిద్య, బాల్య వివాహాల రద్దు, విధవా వివాహాలు వంటి సంఘసంస్కరణలను ఉద్యమంలా చేపట్టి, పోరాడి స్ర్తిల చీకటి జీవితాల్లో వెలుగును నింపే ప్రయత్నం చేశారు. పురుషాధిక్య సమాజంలో పురుషులే ముందుకొచ్చి స్ర్తిల అభివృద్ధికి కృషిచేశారు. అవి ఆ రోజులు కాబట్టి అలా జరిగింది. కానీ, ఈరోజుల్లో అలాంటివారు ఎవరు వస్తారు? అసలు ఎవరు ఉన్నారు? కనుక స్ర్తిలు తమంతతామే ముందుకువచ్చి తమ ఉన్నతి గురించి చూసుకోవాలి.. అహరహం కృషిచేయాలి.
‘ఈ కాలంలోనూ ఇంకా ఎదుగుదల ఏంటి? ఆడవాళ్ళు ఎప్పుడో ఎదిగి అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు కదా?’- అని ఎవరైనా అడిగితే వాళ్ళకు మనం చెప్పాల్సిన సమాధానం- అది అర్ధసత్యమేనని. ఇప్పటికీ కొంతమంది విషయంలో- ఆడవాళ్ళ సమస్యలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే ఉన్నాయి.. కొత్త సమస్యలూ పుట్టుకొస్తున్నాయి. పుట్టబోయేది ఆడా? మగా? అన్న లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుని ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణహత్యలకు పాల్పడుతున్న దయనీయ సంఘటనలు ఈ కాలంలో జరుగుతున్నవే! ఆడవాళ్ళ మీదే కాక ముక్కుపచ్చలారని ఆడపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతుండటం, అవి హత్యలకూ దారి తీస్తుండటం ఈ అధునాతన కాలవైపరీత్యం. ప్రేమించి మోసం చేయడం, తనను ప్రేమించకుంటే కత్తితోనో, పెట్రోల్‌తోనో దాడి చేయడం, నట్టనడిరోడ్డు మీదే చంపేయడం ఇప్పుడు పేపర్లలో, టీవీ ఛానళ్ళలో కనిపిస్తున్న డైలీ న్యూస్ అయిపోయాయి. ఆ కాలం నాటి వేశ్యావృత్తి.. రూపం మార్చుకుని ‘రెడ్‌లైట్ ఏరియా’ పేరిట ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. హైక్లాస్ హోటళ్ళలో, క్లబ్బులలో వీళ్ళే కాల్‌గర్ల్స్ పేరిట పిలవబడుతున్నారు. ఆ రోజుల్లో లాగానే ఈ రోజుల్లోనూ ఎన్నో స్ర్తిల సమస్యలున్నాయి. వాటన్నింటి గురించీ వింటూ, చూస్తూ.. ఇప్పటికీ ఇంకా పురుషాధిక్యతను, అణచివేత ధోరణిని ఒకపక్క సహిస్తూనే ఆధునిక యువతి మరోపక్క తన తెలివితేటలను, తన శక్తిసామర్థ్యాలను, తన శారీరక, మానసిక బలాన్ని నిరూపించుకోవటానికి కత్తిమీద సాము లాంటి పోరాటం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికీ ఇంకా అక్కడక్కడా ‘ఆడదానికి చదువెందుకు?’అనే వాళ్ళు లేకపోలేదు. ఇంట్లో (ఆడ, మగ) ఇద్దరు పిల్లలు ఉంటే కొడుకును ఒక తీరుగా ప్రాముఖ్యతతో, కూతుర్ని మరో తీరుగా చులకన భావంతో పెంచే తల్లిదండ్రులూ లేకపోలేదు. మగపిల్లాడు ఎక్కడ తిరిగినా, ఏంచేసినా చూసీచూడనట్లు ఉండే కన్నవారు ఆడపిల్ల కాస్తంత స్వేచ్ఛగా, స్వతంత్రంగా గడిపితే గుడ్లురిమి చూస్తారు. ‘నువ్వు ఆడపిల్లవు!’ అని పదే పదే హెచ్చరించే తల్లిదండ్రులతో నేడు కూడా కొందరు అమ్మాయలు మానసిక వేదనను అనుభవిస్తున్నారు. తన ఎదుగుదలకు తన ఇంటినుండే అడుగడుగునా ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించడానికి ఆడపిల్ల తన హక్కుల పోరాటాన్ని ఇంటినుంచే ప్రారంభించక తప్పని పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తున్నది.
తమకూ ఉన్నత చదువులు, మల్టీనేషనల్ కంపెనీ జాబ్‌లు, సమాజంలో ఓ గుర్తింపు, ఓ హోదా కావాలంటే స్ర్తిలు ఇల్లువిడిచి బయటికి వెళ్ళక తప్పదు. పదిమందితో కలిసి పనిచెయ్యకా తప్పదు. ఆడ, మగ అన్న తేడా లేకుండా సలహాలు, సంప్రదింపులు, మీటింగులు, సెమినార్లు దేశ, విదేశీ పర్యటనలు చేయవలసి వస్తుంది. అప్పుడే బాధ్యతగల ఉద్యోగినిగా, సేవాదృక్పథం కలిగిన డాక్టర్‌గా, సైంటిస్ట్‌గా, వీర సైనికురాలిగా, అంతరిక్ష పరిశోధకురాలిగా తను ఎదిగి ఈ సమాజాన్ని, ఈ దేశాన్ని ఎదిగేలా చేయగలుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే అని స్ర్తిలేకాదు, పురుషులూ గర్వంగా చెప్పుకుంటున్న రోజులు ఇవి. ఎందుకంటే ఆ స్ర్తిలలో తన తల్లో, తన భార్యో, కూతురో కూడా ఉండే అవకాశం ఉంటుంది గనుక! అంతేకాక స్ర్తి అభ్యుదయాన్ని చూసి ముచ్చటపడే.. గర్వించే మగవాళ్ళూ ఈ సమాజంలో ఉన్నారు గనుక! ఆనాడయినా, ఈనాడయినా స్ర్తిల పట్ల వివక్షకు, వారి సమస్యలకు మూలకారణం పురుషుని ఆధిక్యభావం, సంకుచిత భావజాలం, దాని మూలంగా స్ర్తిలోనే ఏర్పడిన ఆత్మన్యూనతాభావం ఇదే! ఆధునిక యువతి వీటన్నింటినీ ఇప్పుడు స్వయంగా తన పరిజ్ఞానంతో, అవగాహనతో, స్పష్టతతో చాలామటుకు అధిగమించగలిగింది. తనకేం కావాలో, తనేం కోరుకుంటున్నదో తెలుసుకోగలిగింది గనుకనే ‘మీతో మాకూ సమాన హక్కులు ఇవ్వండి’- అని పురుషులను దేబరించటం లేదు. చెయ్యి జాపి అడుక్కోవడం లేదు. అవి తనకుతానుగా సాధించుకోవలసినవనీ, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు తన జన్మహక్కులనీ గుర్తించగలిగింది. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి, ‘ఆకాశమే తన హద్దు’అన్నంత ఎత్తుకు ఎదిగి, తనను కించపరిచే, అవమానించే ఒక్క మాటను కూడా ఎవరినుంచీ పడకుండా.. ఎవరయినా ఏదన్నా అన్నా వెంటనే ఖండిస్తూ తన ఆత్మగౌరవాన్ని చాటి చెప్పుకుంటోంది.
‘నన్ను నేనే గౌరవించుకోనప్పుడు ఎదుటివాడికి అలుసైపోతానని.. స్వయంగా తనూ ఆత్మన్యూనతకు గురయ్యే ప్రమాదం ఉందనీ గుర్తించింది గనుకనే వ్యక్తిత్వవికాసం దిశగా కూడా అడుగులేస్తూ పర్వత శిఖరంలా తలెత్తుకుని నిలబడ గలుగుతోంది. తరతరాల వివక్షకు మూల కారణాలను విశే్లషిస్తూ ముందుకు సాగుతూ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు వాటి విచ్ఛేదనకు కూడా పూనుకోవడం హర్షించదగిన విషయం. తన కడుపున పుట్టిన ఆడబిడ్డకు చిన్నప్పటినుంచే తననుతాను గౌరవించుకోవటం ఎలాగో నేర్పిస్తూ, మగబిడ్డకు స్ర్తిపురుష సమానత్వాన్ని చనుబాలతో కలిపి తాగిస్తూ ఆ విధంగా శిక్షణ ఇస్తున్నది. సంకుచిత భావాలు, స్వార్థపు ఆలోచనలు, ఆధిక్యభావనలు ఎవరిలోనూ ఉండకుండా చూస్తూ జీవిత రథానికి ఇద్దరూ రెండు చక్రాలుగా సమప్రాధాన్యతను చూపించే సరికొత్త భావాలకు ప్రోదిచేస్తూ ఓ నవ్యసమాజాన్ని ముందుతరాలకి అందించే ప్రయత్నం చేస్తున్నది. కనుక త్వరలో రాబోయే ఆ సమాజంలో ‘స్ర్తి, పురుష భేదాలు’, ‘వివక్ష’అన్న మాటలు వినబడకుండా.. ఒక అద్భుత ప్రపంచం మనముందు ఆవిష్కరించబడబోతున్నదని మనం గట్టిగా నమ్మవచ్చు.. దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండవచ్చు.

-కొఠారి వాణీచలపతిరావు