సబ్ ఫీచర్

మనసెరిగి మలచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు మీ పిల్లల చేత మా అమ్మ చాలా మంచిది. అందరికన్నా మా అమ్మ చాలా తెలివైనది అని అనిపించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ క్రింది విషయాల్ని ప్రతి ఒక్క మాతృమూర్తి తెలుసుకోవాలి!
నమ్మకం కలిగించాలి..
నేను అందరికన్నా మంచి అమ్మగా వుండగలను అన్న నమ్మకం ముందు మీకు కలగాలి. ‘‘నాకేమైనా కష్టం వస్తే దాన్ని తీర్చడానికి మా అమ్మ వుంది’’ అన్న నమ్మకాన్ని మీ పిల్లల్లో ముందు కలిగించండి. నీకేమైనా సందేహాలున్నా లేక ఏదైనా అడగాలన్నా ధైర్యంగా నన్నడుగు. అలాగే ఏం చెప్పాలన్నా భయపడకుండా నాతో చెప్పు. నేను నీ బెస్ట్‌ఫ్రెండ్‌నిరా’’ అన్న పాజిటివ్ అభిప్రాయాన్ని పిల్లల్లో కలిగించండి. దీనితో పిల్లలు మీకు మరింత చేరువవుతారు.
వారుచెప్పేది శ్రద్ధగా వినండి..
ఈ గుణం మీకు లేకపోతే అమ్మ నేను ఏం చెప్పినా వినదు అంటూ మీకు దూరమైపోయే అవకాశం మెండుగా వుంది. చిన్నప్పుడు పిల్లలు తాము చెప్పే మాటల్ని అమ్మా నాన్నలు శ్రద్ధగా వినాలని కోరుకుంటారు. అందువల్ల ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి. మీకు ఎన్ని పనులున్నా వాటిని కొంచెం సేపు ప్రక్కన పెట్టి వారి మాటలు వినండి. ఆ తర్వాత వారి మాటల్లోని మంచిని, చెడుని చక్కగా బోధపర్చండి. దీనివల్ల వారిలో మీ పట్ల ఆకర్షణ మొదలవుతుంది. మంచి అలవాట్లని నేర్చుకుంటారు.
ప్రేమని పరిపూర్ణంగా పంచండి
మీరు పిల్లలకి మంచి బలమైన తిండి పెడితే సరిపోదు. వారికి ప్రేమని కూడా బోల్డంత ఇవ్వాలి. మీరు ఇచ్చే ప్రేమ, వారు సమాజంలో మంచివాళ్లుగా ఎదగడానికి చాలా దోహదపడుతుంది. పిల్లలు ఎంత అల్లరి చేసినా కోపం తెచ్చుకోకుండా ప్రేమతో చెప్పి చూడండి. వాళ్లు మారుతారో లేదో మీకు తెలుస్తుంది.
ఓ కంట కనిపెడుతూ ఉండాలి..
పిల్లలపట్ల ఎక్కువగా ప్రేమ చూపించినా లేదా వాళ్లని అసలు పట్టించుకోకుండా వున్నా అది వాళ్ల ఎదుగుదలని బాధిస్తుందని తెలుసుకోండి. వాళ్లు చేసే చిన్న చిన్న అల్లర్లని పెద్దగా పట్టించుకుని వాళ్లని వేధించకండి. అలాగే వాళ్లు అప్పు చేసినప్పుడు చూసీ చూడలేనట్లు వుండక వాళ్లకి బుద్ధి చెప్పి బోధపర్చండి. మీరు ఒకేసారి హిట్లర్‌లాగుంటే మీ పిల్లలు మీ దగ్గరికి రావడానికి భయపడతారు. జ్ఞాపకం వుంచుకోండి. అలాగని ఫ్రీగా వదిలేస్తే, చెడిపోవడానికి ఎక్కువ ఆస్కారముంది. కాబట్టి మీరు పిల్లలపట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది.
బాధ్యతగా వుండండి
ఎప్పుడూ ప్రేమగా ఉండడం కూడా పిల్లలు ఇష్టపడరు. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్లు మరింత ప్రేమ చూపించినా, దానికి వాళ్లు విసిగిపోవడానికి అవకాశముంది. కొన్ని ముఖ్యమైన బాధ్యతాయుతమైన పనుల్ని చాలా చక్కగా చేసి చూపించండి. అలాగే కుటుంబంలో ఎలాంటి క్లిష్ట సమస్య వచ్చినా చాకచాక్యంతో పూర్తిచేసి మా అమ్మ ఏ పనినైనా చాలా చక్కగా చెయ్యగలదు, అలాగే కుటుంబం సాఫీగా నడుస్తుంది అంటే దానికి కారణం అమ్మ ప్లానింగే అన్న భావాన్ని పిల్లల్లో కలిగిస్తే మిమ్మల్ని ఒక రోల్ మోడల్‌గా ఆరాధిస్తారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
మిమ్మల్నే అనుసరిస్తారు..
ఎప్పుడు చూసినా టీవీల్లో సీరియల్స్ చూసుకుంటూ, చుట్టుప్రక్కలవాళ్లతో బాతాఖానీ కొట్టే అమ్మ అయితే మీరు మీ అలవాట్లని వెంటనే మార్చుకోండి. ఎందుకంటే తల్లి గుణగణాల్లో చాలావరకు పిల్లలకి వస్తాయన్నది ఒక సర్వేలో తేలింది. అందువల్ల సాధ్యమైనంత వరకూ మీరు మంచి అలవాట్లని చేపడితే మీ పిల్లలూ మిమ్మల్ని అనుసరించి మంచిపేరు తెచ్చుకోవడానికి నూటికి నూరు పాళ్ల ఆస్కారముంది.

-వసంతకుమార్ సూరిశెట్టి