సబ్ ఫీచర్

పల్లెలే ‘నెట్టిళ్లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజులు మారిపోయాయి. ఇప్పుడు ఆర్థిక వ్యవహారాలు, అధికారిక పనులు, ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహించుకోవడానికి ఇంటర్నెట్ తప్పనిసరైపోయింది. అక్షరాస్యత, వౌలిక సదుపాయాలు, విద్యుత్ సౌకర్యం అంతగా లేని గ్రామీణ భారతానికి ఇది పెద్ద సమస్య. అక్కడ ఇంకా ఇంటర్నెట్ వినియోగం మాటే లేదు. ఆ పరిస్థితుల్లో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో రెండేళ్లక్రితం ప్రారంభించిన ‘ఇంటర్నెట్ సాథి’ కార్యక్రమం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. గూగుల్, టాటాసంస్థల సారథ్యంలో ఇది 2015లో ప్రారంభమైంది. ఆ కార్యక్రమం ఎంతటి ఫలితాలనిస్తోందో తెలుసుకోవాలంటే... ‘ఇంటర్నెట్ దీదీ’ లక్ష్మిని చూస్తే తెలుస్తుంది.
పశ్చిమబంగ రాష్ట్రంలోని పురూలియా జిల్లాకు చెందిన లక్ష్మి ఓసారి గూగుల్ సారథితో భేటి అయ్యింది. మాటామంతీలో ఆయన ఓ ప్రశ్న వేశారు. ఇంటర్నెట్ సౌకర్యం ఎలా ఉందీ అని? తడుముకోకుండా ఆమె చెప్పిన సమాధానం ఆయనను ఆలోచనల్లో పడేసింది. ఇంతకీ ఆమె ఏమన్నదో తెలుసా!.. ఫోన్‌లో మన స్వరాన్ని పసిగట్టి, ఎవరు మాట్లాడారో గుర్తించే యాప్‌ను కనిపెట్టవచ్చుకదా! అని. అసలు మారుమూల పల్లెలకు ఇంటర్నెట్ అందుబాటులోకి రాకపోతే ఎలా? అంటూ మరో ప్రశ్న సంధించింది. ఇదేదో ఆమె కావాలని అన్నమాటలు కావు. వాస్తవాలను ఆమె అమాయకంగా చెప్పేసిందన్నమాట. అంత తెగువ, అలా మాట్లాడగలిగే చొరవ ఎలా వచ్చాయంటారు. అదే ఇంటర్నెట్ సాథి కార్యక్రమం చలవ. పేద కుటుంబానికి చెందిన లక్ష్మీరాణి చదువు మధ్యలోనే ఆగింది. అక్కడ ఏ పని కావాలన్నా పొరుగు పట్టణానికి వెళ్లాల్సిందే. ఓసారి పదిహేనేళ్లయినా లేని ఓ బాలికకు పెద్దలు పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. లక్ష్మీరాణికి ఆ విషయం తెలిసి వద్దని చెప్పింది. వారు వినలేదు. కానీ ఆమె ఊరుకోలేదు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మొబైల్ ఫోన్‌లో నెట్‌ద్వారా ఆమె ఈ విషయాన్ని అధికారులకు చేరవేసింది. అంతకుముందు బ్యాంకు పనులు, రెవిన్యూ పనులు, సర్ట్ఫికెట్లు తెచ్చుకోవాలన్నా పొరుగు ఊరికి వెళ్లాల్సి వచ్చేది. ఇంటర్నెట్ గురించి తెలిసేది కాదు. దానిని ఉపయోగించడమూ తెలీదు. పురూలియాకు 80 కిలోమీటర్ల దూరంలోని పటహెన్సల్ ఆమె ఊరు. గూగుల్ ప్రారంభించిన ఇంటర్నెట్ సాథీ కార్యక్రమం ఆమె జీవితానే్న మార్చేసింది. బాలిక పెళ్లిని ఆపినప్పుడు తీవ్ర విమర్శల పాలైన ఆమె ఇప్పుడు అదే గ్రామంలో అందరికీ ఆరాధ్య దేవతగా మారింది. అందరూ ఆమెను ఇంటర్నెట్ దీదీ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఎందుకంటే మొబైల్ ఫోన్‌ను ఉపయోగించి కాలుకదపకుండా ఇంట్లోనుంచే పనులు ఎలా చక్కబెట్టుకోవచ్చో ఆమె అందరికీ నేర్పిస్తోంది. సైకిల్‌పై తిరుగుతూ ఆసక్తి ఉన్నవారిని గుర్తించి ఇంటర్నెట్‌లో మెలకువలు నేర్పిస్తోంది. 2015లో దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఐదు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం మొదలెట్టారు. 15000మంది యువతులను ఎంపిక చేసి వారికి ప్రాథమిక విద్య, ఇంటర్నెట్ వినియోగం, మొబైల్ ఫోన్ లో యాప్స్ వినియోగించడం వంటి అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. పల్లెల్లో తిరుగుతూ వారు ప్రజలకు ఈ విషయంలో చైతన్యం, శిక్షణ ఇస్తున్నారు. మొదట్లో గట్టిగా మాట్లాడటానికి భయపడ్డ లక్ష్మీరాణి ఇప్పుడు సైకిల్‌పై ఊరంతా తిరుగుతూ అందరికీ తలలో నాలుకలా మారిపోయింది. గ్రామీణ భారతంలో ప్రతి పదిమంది మహిళల్లో ఒకరు మాత్రమే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. ఆ పరిస్థితిలో మార్పు తేవాలన్నదే అసలు లక్ష్యం. ఆ భారీ లక్ష్య సాధనలో లక్ష్మీరాణిలాంటివారు ఎంద రో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, గుజరాత్‌లలో ఈ కార్యక్రమం సాగుతోంది. మున్ముందు అస్సామ్, త్రిపుర, ఉత్తరప్రదేశ్‌లలో అమలు చేయనున్నారు.