సబ్ ఫీచర్

అక్షరదీపాల వెలుగులో ప్రగతి మార్గాన పల్లెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదం, శాంతి భద్రతల సమస్యకు నెలవైన జమ్ము-కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో నిరుపేద పిల్లలను విద్యావంతులను చేయడానికి కంకణబద్ధురాలై ఆమె నిర్విఘ్నంగా అక్షర యజ్ఞం చేస్తోంది. బెంగళూరులో మంచి జీతభత్యాలున్న ఉద్యోగాన్ని వదులుకుని సబహ్ హాజీ (30) తన సొంత ఊరైన బ్రెస్వానాకు చేతనైనంత సాయం చేద్దామని దీక్ష వహించింది. అక్షర కాంతులు ప్రసరిస్తేనే పల్లెలు ప్రగతి దారిలో పయనిస్తాయని ఆమె నిరూపించింది. దోడా జిల్లాలోని అనేక గ్రామాలకు నేటికీ తగినంతగా రవాణా సౌకర్యం లేదు. ఈ కారణంగానే బ్రెస్వానా సహా అనేక పల్లెలు ప్రాథమిక వసతులకు దూరంగా ఉన్నాయి. పాఠశాల, ఆసుపత్రి, మంచినీరు, రహదారులు వంటి కనీస వౌలిక సదుపాయాలు లేక పల్లెవాసులు అభివృద్ధికి దూరంగా జీవితాలను నెట్టుకొస్తున్నారు. ఈ పరిస్థితులను చూసి చలించిపోయిన సబహ్ తన గ్రామంలో అక్షరాస్యతను పెంచాలని నడుం బిగించింది. ‘హాజీ పబ్లిక్ స్కూల్’ పేరిట పాఠశాలను ఏర్పాటు చేసి పిల్లలకు చదువు చెబుతోంది. లోయర్‌గ్రేడ్, అప్పర్‌గ్రేడ్ స్థాయిలో ఇక్కడ పిల్లలకి విద్య చెబుతారు. సబహ్ కొంత మంది టీచర్లని కూడా నియమించుకుంది. సబహ్ పుట్టిపెరిగిన గ్రామంలో జనాభా పదిహేను వందలు మాత్రమే. అక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం మీదనే ఆధారపడి జీవిస్తుంటారు. ఎవరూ పెద్దగా చదువుకోనందున ఉపాధి అవకాశాలు గానీ, ఉద్యోగాలు గానీ వారికి ఎండమావిగానే కనిపిస్తుంటాయి. బాహ్య ప్రపంచం గురించి వారికి పెద్దగా తెలియదు కూడా. దీంతో పిల్లలు చదువు సంధ్యలు లేకుండా పెరుగుతుంటారు. ఇవన్నీ గమనించిన సబహ్ బెంగళూరులో ఉద్యోగానికి స్వస్తి పలికి సొంత గ్రామానికి చేరుకుంది.
తల్లిదండ్రులను ఒప్పించి ఇంట్లోనే ఒక గదిలో పాఠశాలను తెరిచింది. గ్రామస్థులు సబహ్ ప్రయత్నానికి ముందు సహకరించకపోయినా, సబహ్ పట్టుదలతో వారిని ఒప్పించి వారి పిల్లలు చదువుకోవడానికి ఒప్పించింది. ఆమె ప్రారంభించిన పాఠశాలలో చేరిన పిల్లలు చక్కగా చదువుకోవడమే కాకుండా మంచి అలవాట్లను నేర్చుకున్నారు. ఉతికిన దుస్తులు ధరించడం, మాటతీరు మారడం వంటివి పిల్లల్లో గమనించిన గ్రామస్థులు ఈ మార్పును సంతోషంగా అంగీకరించారు. దాంతో మిగిలినవారు కూడా తమ పిల్లల్ని సబహ్ పాఠశాలకు పంపడం మొదలుపెట్టారు.
ఉద్యోగం కోసమో, ఉపాధి కోసమో కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సబహ్ చెబుతుంటుంది. ముఖ్యంగా ఆడపిల్లలు మరింతగా చదువుకోవాలని, చదువే వారికి జీవితాంతం తోడుండే నేస్తమని ఆమె అంటోంది. చదువు లేకపోవడం వల్లనే అమాయకత్వంతో ఆడపిల్లలు మోసపోంటారని అంటోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని విద్యా పథకాలను తమ పాఠశాలలో వర్తింపజేసేందుకు కృషి చేస్తున్నట్లు చెబుతోంది. తన స్వగ్రామంలో పాఠశాలకు ఆదరణ పెరగడంతో ఆమె పర్షోల్లా, షాదివాన్ గ్రామాల్లో కూడా స్కూళ్లు ప్రారంభించి చదువు చెబుతోంది. పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దడం, ఎలాంటి కల్మషం లేని వారి ముఖాల్లోని ఆనందాన్ని చూడడం కంటే తనకు వేరే లక్ష్యాలు లేవని ఆమె అంటోంది.

chitram...
విద్యార్థులతో సబహ్

బ్రెస్వానాలో హాజీ పబ్లిక్ స్కూల్

-బాబు