సబ్ ఫీచర్

విద్యాశాఖలో అవినీతి చీడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాశాఖలో జరుగుతున్న తంతు తమాషాల పై నవ్యాంధ్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. రాష్టవ్య్రాప్తంగా విద్యాశాఖలో జరుగుతున్న జరిగిన అవినీతి అక్రమాలు మరే శాఖలోను లేవన్నది నిర్వివాదాంశం. రాష్టవ్య్రాప్తంగా వివిధ పాఠశాలలకు చదువుల నిమిత్తం వేలాది బాల బాలికలు హాజరవుతున్న మాట వాస్తవం. అయితే సంక్షేమ పథకాల ద్వారా విద్యాశాఖ ద్వారా కోట్లాది రూపాయలు ధన ప్రవాహం బయల్దేరింది. గత బిజెపి ప్రభుత్వంలోగల మానవ వనరుల శాఖ నిర్వహించిన మురళీ మనోహర్ జోషి ఆధ్వర్యంలో విద్యకి ఉన్నత స్థాయి కల్పించాలి, మేధో వలస అరికట్టాలని అన్ని విధాలుగా యోచించి పెట్రోలు, నిత్యావసరాలు సబ్బులు, పేస్టులు తదితర అన్నింటి మీదా విద్యా సెస్సు రు.1 చొప్పున వసూలుచేసి విద్యాభివృద్ధికి కేటాయించాలని నిర్ణయంచారు.
అయితే అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి. విద్యాశాఖలో అసలు సంగతి మొదలైంది. సర్వశిక్షా అభియాన్, రాజీవ్ విద్యామిషన్ అనే లేబుల్స్ తగిలించి అవినీతి తిమింగలాలు బయలుదేరాయి. రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో జరిగే అవినీతిని కనిపెట్టడం చాలా ప్రధానం. మండల డివిజన్ స్థాయి జిల్లాస్థాయి ఆపైస్థాయిల్లో కూడా అధికారులు ఈ పథకంలో చేవాటుతనం బాగానే చూపిస్తున్నారు. చాలామంది డిఇఓలుగా గాదెకింద పందికొక్కుల వలె తయారయ్యారు. గవర్నమెంట్‌లో పలుకుబడి ఉపయోగించుకుని బాగా లాభం వచ్చే చోట పోస్టింగులు వేయించుకుంటున్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గత ప్రభుత్వ ఏలుబడిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారందరు లంచాలు సమర్పించి తప్పుడు మార్గంలో పరీక్షలు రాసారని అందరూ ఆ సామాజిక వర్గానికి చెందినవారే డిప్యూటీ డిఇఓలుగా ఎంపికయ్యారని ఆరోపణలున్నాయి. వీరందరు ఒకే గదిలో పుస్తకాలు చూసి పరీక్షలు రాసారని, తర్వాత పేపర్లు మిగిలిన అభ్యర్థుల పేపర్లతో కలిపి పంపించేసారని ఈ తంతు కార్యక్రమానికి ఒక్కొక్కరి వద్ద సుమారు పదినుండి పదిహేను లక్షలు వసూలు చేసారన్న ఆరోపణలున్నాయ.
అతి తక్కువ వ్యవధిలో విద్యాశాఖాధికారి డివిజన్ స్థాయిలో పోస్టింగ్ పొంది అతి తక్కువ సేవా కాలంతో సరాసరి పెద్ద ఉద్యోగంలోకి రావాలంటే ఇంత వాటం ఏ డిపార్టుమెంట్‌లో కుదరదు. పైగా ఎవరికీ ఈ రకమైన సావకాశం లేనేలేదు. ఈ సంగతులు అంతగాను బయటికి రావు. నకిలీ ప్రమాణ పత్రాలు తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు సమర్పించినట్టు కూడా ఆరోపణలున్నాయి. అవినీతి మార్గంలో ఉద్యోగాలు సంపాదించిన సదరు అధికారులు విధి నిర్వహణలో లంచావతారులుగా మారిపోయారు. ప్రతిపనికి లంచాలు లేనిదే పనిచేయమని స్పష్టంగా చెబుతున్నారు. కిందిస్థాయిలో సిబ్బంది మీద తీవ్రమైన వత్తిడి తేవడం వత్తిడి ద్వారా డబ్బులు వసూలు లేదంటే సస్పెన్షన్ ఆదేశాలిస్తున్నారు. సస్పెన్షన్ సమస్య పరిష్కరించాలంటే లంచాలు ఇవ్వవలసిందేనని స్పష్టం చేస్తున్నారు. ఇంక్రిమెంటు, లీవు, శలవు మంజూరు, విధులనుండి తాత్కాలిక విడుదలకు, విదేశీ ప్రయాణాలకు ఇలా ఒకటి రెండు కాదు ప్రతినిత్యం లంచం కోసం నానా తం టాలు పడుతున్నారు. ఉఫాధ్యాయులని నిరంతరం వేధించేందుకు వీరు సిద్ధంగా ఉంటున్నారు. క్షేత్రస్థాయి సిబ్బందిని కూడా నానా ఇబ్బందులు పెట్టే పనిలో వీరు నిరంతరం వుంటున్నారు. పైకి వీరు చెప్పేదంతా ఒకరకంగా ఉంటుంది. లోపల ఇంకోరకంగా ఉంటుంది కాబట్టి అవినీతి రహితంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ప్రమాణాలు నెరవేరాలంటే అక్రమ మార్గంలో అధికారులుగా చెలామణిలోకి వచ్చిన వారి జాబితా తయారుచేసి ఇంటిలిజెన్స్ డిపార్టుమెంట్ సిఐడి ద్వారా దర్యాప్తు సంస్థలవారిచే అక్రమ మార్గంలో అధికారులైపోయిన వారిని పట్టుకుని విచారించి దోషులపై క్రిమినల్ కేసులు పెట్టి శిక్షించాలి. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ నియామకాలు వెంటనే రద్దు చేయాల్సిందిగాను పారదర్శకంగా అధికారుల నియామకాలు చేయించాల్సిందిగా ప్రజలు కోరుకుంటున్నారు. ఇటువంటి అక్రమ నియామకాలు అనర్హులతో నియామకాలు మరల జరగకుండా చూడాలి.

- ఎన్‌బికె చక్రవర్తి