సబ్ ఫీచర్

చదువుతో అల్లుకుపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం’ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదని, దానిని ఆచరణలో పెడితే అది వాస్తమేనని నిరూపించారు ఎడారి రాష్ట్రం అయిన రాజస్థాన్‌లోని ఒక కుగ్రామానికి చెందిన మహిళలు. గతంలో ఆ గ్రామానికి చెందిన బాలికలు ఎవరూ బడి గడప తొక్కేవారు కాదు. ఒకవేళ ఎవరైనా వెళ్లినా అది మూడునాళ్ల ముచ్చటే. అటువంటి గ్రామానికి చెందిన బాలికలు ప్రస్తుతం పొరుగూరులో వున్న హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్నారు. వారిలో అంతమార్పు రావడానికి కారణం రంగ్‌సూత్ర అనే ఒక స్వచ్ఛంద సేవాసంస్థ. రాజస్థాన్‌లోని అందూరి గ్రామ పంచాయితీ శివారులో ‘2ఎడి’ అనే కుగ్రామం ఉంది. నిన్నమొన్నటివరకు ఈ గ్రామం ఒకటి ఉందని కూడా ఎవరికీ తెలియదు. నేడు ఆ గ్రామానికి చెందిన మహిళల హస్తకళా విన్యాసం వలన ప్రపంచ స్థాయి గుర్తింపును సాధించింది.
2ఎడి గ్రామంలో చిన్నారుల నుంచి వృద్ధ మహిళల వరకు, వారి చేతులలో దారం, లేస్, సూది ఎప్పుడూ ఉంటాయి. వారు వాటి ద్వారా అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరిస్తారు. ఎంతో నైపుణ్యం, నాణ్యతలతో వారు రూపొందించిన వస్త్రాలను దళారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెట్ చేయడం ద్వారా లాభాలు గడించేవారు. ఈ గ్రామంలో మహిళలు నిరక్షరాస్యులు కావడంతో, దళారులు వారిని మోసం చేయడానికి మరింతగా కలిసివచ్చింది. గ్రామంలో మాథ్యమిక పాఠశాల ఉన్నప్పటికీ బాలికలు ఎవరూ పాఠశాలకు వెళ్లేవారు కాదు. 2ఎడి గ్రామానికి చెందిన మహిళలు వస్త్రాలపై అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేస్తున్నారనే విషయం తెలుసుకొన్న ఉర్మూల్ ట్రస్ట్ వారికి అండగా నిలిచింది. వారు తయారు చేసిన ఎంబ్రాయిడరీ
వస్త్రాలను మార్కెట్ సౌక ర్యం కల్పించింది. అనంతరం రంగ్‌సూత్ర అనే స్వచ్ఛంద సేవా సంస్థ మహిళలు రూపొందించే వస్త్రాల ప్రదర్శన, మార్కెటింగ్ బాధ్యతలను స్వీకరించింది.
2ఎడి గ్రామానికి చెందిన మహిళలు రామచిలుకలు, నెమళ్లు, పువ్వులు, ప్రకృతి సౌందర్యం తదితర దృశ్యాలను వస్త్రాలపై ఎంబ్రాయిడరీ చేయడంలో అత్యంత నిపుణులు. ఆ సంస్థ సహాయంతో గ్రామంలోని మహిళలకు ఆర్థిక స్వాతం త్య్రం లభించింది. ప్రస్తుతం మహిళలకు నెలకు నాలుగునుంచి ఐదువేల రూపాయల ఆదాయం లభిస్తున్నది. వారు చదువు ప్రాముఖ్యతను తెలుసుకొని, తమ పిల్లలను చదివిస్తున్నారు. తమ గ్రామంలో ఉన్న మాథ్యమిక పాఠశాలలో చదువు అయిపోయిన తరువాత, పిల్లల్ని హాస్టల్‌లో ఉంచి పొరుగూరులో చదివిస్తున్నారు. 2ఎడి గ్రామ మహిళలు రూపొందించే కుషన్స్, టేబుల్ క్లాత్, బెడ్‌షీట్స్, కుర్తాలకు మంచి డిమాండ్ ఉంది. మహిళలు పుక్కా, సూప్, ఖరక్ వంటి కుట్టు పద్ధతులను తమ ఎంబ్రాయిడింగ్‌కు వినియోగిస్తున్నారు. మహిళలు ఎంబ్రాయిడరీ డిజైన్‌ల రూపకల్పనకు తమ ఊహాశక్తిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామ ప్రజలు చదువు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని, తమ పిల్లలను బాగా చదివిస్తున్నారు. గ్రామ ప్రజల జీవన పరిస్థితులు కూడా మెరుగుపడ్డాయి. ‘మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం’ అనడానికి 2ఎడి గ్రామాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
*

చిత్రాలు..ఎంబ్రాయిడరీ వర్కుతో చేసిన దుస్తుల్లో అందంగా ముస్తాబైన మగువ

*రంగ్‌సూత్ర అనే స్వచ్ఛంద సేవా సంస్థ మహిళలు రూపొందించే వస్త్రాల ప్రదర్శన, మార్కెటింగ్ బాధ్యతలను స్వీకరించింది

*2ఎడి గ్రామంలో చిన్నారుల నుంచి వృద్ధ మహిళల వరకు, వారి చేతులలో దారం, లేస్, సూది ఎప్పుడూ ఉంటాయి. వారు వాటి ద్వారా అద్భుతమైన చిత్రాలను ఆవిష్కరిస్తారు

- పి.హైమావతి