సబ్ ఫీచర్

చిన్ని చిత్రం..గొప్ప సందేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిభ, సృజనాత్మకత ఎవరి సొత్తుకాదని నిరూపిస్తోంది ఎనిమిదేళ్ల నిహారిక. కేరళలోని తిరువనంతపురానికి చెందిన ఈ చిన్నారి, మిగతా పిల్లల వలే టివీ చూస్తూ టైమ్ వేస్ట్ చేయదు. ఎపుడూ ఏదో ఒక బొమ్మ గీస్తూనే ఉంటుంది. ఆ చిట్టి మనసులో తలెత్తే చిన్ని చిన్ని ఆలోచనలతో ఎన్నో చిత్రాలను గీచింది. నిహారిక వేసే పెయింటింగ్‌లోని భావాలు మనసును హత్తుకుంటాయి. ముఖ్యంగా చెట్లను, ప్రకృతి అందాలతో వేసే పెయింటింగ్స్ చూసేవారికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆకులు అనగానే చాలామంది పచ్చ రంగులో గీస్తారు. కాని నిహారిక పింక్ కలర్‌లో వేస్తుంది. నీలం, గులాబీ రంగుల షేడ్స్‌తోనే పెయింటిగ్స్‌ను ఎక్కువగా వేస్తుంటుంది. ఏడేళ్ల వరకు నిహారిక అందరి పిల్లల వలే ఆటల్లో మునిగిపోయేది. గత ఏడాది నుంచి ఆమెలో చిత్రాలను గీచే ప్రతిభ బయటపడింది.
తల్లి కూడా ఆ చిన్నారి గీసే చిత్రాలను పెద్దగా పట్టించుకోలేదు. యాధృచ్చింగా ఓరోజు నిహారిక గీచిన చిత్రా న్ని చూసిం ది. అందులో సమతాభావం కనిపించింది. తల్లి నీతా ఆశ్చర్యపోయింది. అప్పటి నుంచి నిహారికను పెయింటింగ్స్ వేస్తుంటే ప్రోత్సహించటం ప్రారంభించింది.

30మంది కళాకారుల మధ్య చోటు..
నిహారిక తల్లి నీతా ప్రొఫెసర్. నిహారిక గీచిన చిత్రాలను ఓసారి వాట్సప్‌లో పోస్టు చేసింది. వీటిని దివంగత చిత్రకారుడు శశికుమార్ భార్య డాక్టర్ కృష్ణప్రభ చూసి నిహారికలో దాగిఉన్న ప్రతిభను గుర్తించారు. వెంటనే భర్త పెయింటింగ్స్‌తో ఏర్పాటు చేసే ఫొటోగ్యాలరీలో చిన్నారికి నిహారికకు చోటు కల్పించారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఓరోజు డాక్టర్ కృష్ణప్రభ నిహారిక తల్లికి ఫోన్ చేసి ఆమె పెయింటింగ్స్ తీసుకురమ్మన్నారు. ఎందుకో అని తీసుకువెళ్లగా 30 మంది ప్రముఖ ఆర్టిస్టుల చిత్రాలు ప్రదర్శించిన ఎగ్జిబిషన్‌లో చోటు కల్పించారు.
ఎవ్వరి వద్ద నేర్చుకోలేదు
నిహారికకు గురువు అంటూ ఎవ్వరూ లేరు. ఓ రోజు స్కూలు నుంచి వచ్చిన తరువాత పెన్సిల్‌తో నిద్రపోతున్న పసిపాప చిత్రాన్ని గీసింది. అమ్మమ్మ ఆ చిత్రాన్ని చూసి పొంగిపోయింది. అలా అప్పటి నుంచి గీచే పిచ్చిగీతాలే ఆమె సృజనాత్మకతను వెల్లడిస్తున్నాయి. టీచర్‌ను ఏర్పాటు చేస్తానంటే నిహారిక ఇష్టపడదు. స్వతహాగా తన మనసులో వచ్చే ఆలోచనలను కాన్వాస్ మీద పెడుతుంది.
పచ్చటి చెట్లు, పర్వతాలు, సముద్రాలు వాటికి వారిధిగా బ్రిడ్జిలు.. ఇలా ఎన్నో చిత్రాలను నిహారిక చేతి నుంచి జాలువారాయి.
నిహారిక ట్యాబ్ ఓపెన్ చేస్తే చిట్టి చిట్టి కథలు కూడా ఉంటాయి. పిచ్చుక మీద తొలి కథ రాసింది. ఆమె తల్లి నిహారిక రాసిన కథలను ఓ పుస్తకంగా తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది.