సబ్ ఫీచర్

ఆమెకు చూపులేదు.. వారికి హృదయముంది!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటినుంచి పొమ్మన్న కుటుంబంఅంధురాలికి
అండగా నిలిచిన జనం లా చదువుకు ప్రోత్సాహం,
ఓ రేడియోజాకీ చొరవతో సత్ఫలితం

చదువంటే ఆమెకు ఇష్టం... కానీ తండ్రి ఆలోచన వేరు...
పైగా అంధురాలైన కూతురు అతడికి బరువుగానే అనిపించింది. పెళ్లిచేస్తే బాధ్యత తీరిపోతుందన్నది అతడి ఆలోచన.. చదువు వద్దన్నాడు.. పెళ్లివద్దంటే ఇంట్లోంచి వెళ్లిపోమన్నాడు. అంతే ఆ టీనేజ్ అమ్మాయి మనసు విరిగిపోయింది. చెప్పాపెట్టకుండా బయటకు వచ్చేసింది. స్నేహితుల చొరవతో అతికష్టం మీద హాస్టల్‌లో చేరి చదువుకు సిద్ధమైంది. కానీ డబ్బులు ఎలా? తోటి విద్యార్థినీవిద్యార్థుల ఇచ్చిన సొమ్ము దేనికీ సరిపోదు. రోజుకు ఒకపూటే భోజనం. అదీ నెలలో 20 రోజులు మాత్రమే. మిగతా అంతా పస్తులే. అయితే ఇవేమీ ఆమె బయటకు చెప్పుకోలేదు. కానీ ప్రపంచానికి తెలిసిపోయింది. ఆమె పేరు నిఖిత శుక్లా అని, అంధురాలని. ఆర్థిక ఇబ్బందులతో లా నాలుగో సంవత్సరం కొనసాగించలేకపోతోందని. ఆమె కథ బయటకు ఎలా తెలిసింది? అదే అసలు కథ.
ముంబైలోని ప్రసిద్ధ ప్రైవేట్ రేడియో సంస్థ రేడియోసిటీ. ఓ పోటీలో నెగ్గిన నిఖిత శుక్ల విజేత. బహుమతి అందుకోడానికి రేడియోసిటి స్టూడియోకు వచ్చింది. పదేళ్లుగా రేడియోజాకీగా పనిచేస్తున్న సుచరిత త్యాగి ఆమెతో కబుర్లు చెప్పింది. మాటల మధ్యలో నోరుజారిన నిఖిత తన ఇబ్బందులను చెప్పుకొచ్చింది. సరే, ఆ తరువాత నిఖిత హాస్టల్‌కు వెళ్లిపోయింది. సుచరిత ఈ విషయాన్ని సామాజిక మాధ్యమంలో ఓ కథగా చెబుతూ, ఆమెను ఆదుకునేవారున్నారా? అని అడిగింది. అంతే, స్పందన మొదలైంది..ఓ ప్రవాహంలా. ఒకరా ఇద్దరూ పదులు, వందల సంఖ్యలో ముం దుకొచ్చారు. ఆధారాలు అడగలేదు. నిజమేనా అన్న అనుమానమూ వ్యక్తం చేయలేదు. చెక్కులు, నగదు ఎవరికి తోచినదివారు పంపారు. ఆ మొత్తం ఆమె హాస్టల్ ఖర్చులు, ఫీజులు, ఇతర కనీస అవసరాలు తీర్చడానికి సరిపోతుంది. అయినా దాతలు ఆగలేదు. నిరంతరం ఎవరో ఒకరు సహాయాన్ని అందిస్తూనే ఉన్నారు. ఆమె చదువు ఆపొద్దన్నది అందరి సూచన. ఆమెకు కళ్లు లేకపోతేనేం, ఈ లోకానికి మనసుందని అర్ధమైందంటోంది సుచరిత. నిజంగా సమాజం ఇంత గొప్పగా స్పందిస్తుందన్నది తన ఊహకు అందలేదని, తను పనిచేసే మాధ్యమం ఇంత బలంగా ప్రభావం చూపుతుందని భావించలేదని, ఇప్పుడు తనకెంతో తృప్తిగా ఉందని అంటోంది సుచరిత. ఇక నిఖిత ఆనందానికి అవధులే లేవు. ఇంట్లో పెద్దవారు తిట్టినపుడు కోపంతో మధురలోని స్నేహితుల వద్దకు వెళ్లిపోవాలని టిక్కెట్ కొనుక్కుని బయలుదేరింది. కానీ చిన్ననాటి స్నేహితులు, తోటి విద్యార్థినీ విద్యార్థులు వారించారు. తమవద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో హాస్టల్‌లో చేర్పించారు. మరికొందరు ఫీజులుకు డబ్బు సర్దారు. కానీ రానురాను కష్టమైపోయింది. ఓ పూట తిండే గగనమైపోయేది. ప్రస్తుతం ఆ కష్టాలు గట్టెక్కినట్లే. మూడుపూటలా కడుపునిండా తిండి తినే స్థితి వచ్చింది. హాస్టల్ పూర్తి ఫీజు కట్టడంతో ఆమె తిండికి ఢోకాలేదు. ఇక ఫీజులూ చెల్లించేస్తోంది. కనుక లా చదువూ ఆగిపోదు. ముంబై ప్రజల సహాయంతో ముందడుగు వేస్తున్న నిఖితకు చూపులేకపోతేనేం, ఆమె కళ్లల్లో వెలుగు మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక సుచరిత త్యాగి ప్రశంసల వెల్లువలో మునిగితేలుతోంది.

chitram...

లా విదార్థిని నిఖిత శుక్ల