సబ్ ఫీచర్

ప్రాచీన క్రీడకు ప్రాణ ప్రదాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కనుమరుగవుతున్న ప్రాచీన క్రీడకు ఆమె ప్రాణం పోస్తుంది. ధైర్యానికి నిర్వచనం, ఆత్మస్థైర్యానికి నిదర్శనం. నమ్మకం అనే పునాదిపై ‘కలరిపయట్టు’కు పునర్ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆ క్రీడను అక్కున చేర్చుకుంది. చిన్ననాటి కలను సాకారం చేస్తూ గత 67 సంవత్సరాలుగా ఆమె తీవ్రంగా కృషి చేస్తున్నారు. దేహధారుఢ్యం, ఆత్మరక్షణలకు సంబంధించి ఎన్నో ప్రాచీన క్రీడలు మన దేశంలో వున్నాయి. ‘కొత్త ఒక వింత, పాత ఒక రోత’ అన్న చందాన, మనం ఎంతో అమూల్యమైన మన ప్రాచీన క్రీడలను నిర్లక్ష్యం చేశాం. దీంతో ప్రాచీన క్రీడలు క్రమక్రమంగా కనుమరుగు అయ్యే దుస్థితిలో ఉన్నాయి. అటువంటి క్రీడలలో కలరిపయట్టు ఒకటి.
ఇది దేహదారుఢ్యాన్ని పెంచడమే కాకుండా ఆత్మరక్షణకు బాగా ఉపయోగపడుతుంది. కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ జిల్లా వడకర శివారు ప్రాంతం పుదుప్పనం. పుదుప్పనంకు చెందిన మీనాక్షి గురుకుల్ గత 50 సంవత్సరాలుగా కధితనదన్ కలారి సంఘం పేరిట కలరిపయట్టును నేర్పించే శిక్షణ సంస్థను నిర్వహిస్తున్నారు. 74 సంవత్సరాల వయసులో కూడా ఆమె ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపిస్తారు. దీనికి కారణం, తాను ప్రతిరోజూ కలరిపయట్టును ప్రాక్టీస్ చేయడమేనని ఆమె చెబుతారు. ఆమెకు ఏడు సంవత్సరాల ప్రాయంలో కలరి సంఘంలో చేరి కలరిపయట్టును నేర్చుకొన్నారు. బాలికలు తక్కువగా ఉన్నప్పటికీ ఆమె వెరవక, కలరిపయట్టులో మెళకువలను నేర్చుకొన్నారు. మధ్యలో ఆమె కొంతకాలం నాట్యాన్ని నేర్చుకొన్నారు. అయితే, కలరిపయట్టు పట్ల ఆమెకు ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదు. తన 17వ ఏట రాఘవన్ అనే ఉపాధ్యాయుడితో ఆమెకు వివాహం జరిగింది. భర్త ప్రోత్సాహంతో ఆమె కధితనదన్ కలారి సంఘంను ఏర్పాటుచేశారు. వయోభేదం, లింగభేదం లేకుండా అందరికీ ఆమె ఉచితంగా కలరిపయట్టును నేర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మీనాక్షి గురుకుల్ తరగతులు నిర్వహిస్తారు.మహిళలకు రక్షణ కరవైన ప్రస్తుత పరిస్థితులలో ఆత్మరక్షణ కోసం కలరిపయట్టు చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెబుతారు మీనాక్షీ గురుకుల్. ఈ విద్య నేర్చుకున్న వారిలో మానసిక స్థైర్యం పెరగడంతోపాటు మంచి ఆరోగ్యం కలిగివుంటారు. 74 సంవత్సరాల వయసులో కూడా ఆమె ఎంతో చురుకుగా యువతతో కలరిపయట్టు క్రీడలో పోటీపడుతుంటారు. ఎంతో ప్రాచీన క్రీడ అయిన కలరిపయట్టుకు పూర్వ వైభవం కల్పించడానికి మీనాక్షి గురుకుల్ చేస్తూన్న కృషి ఫలించాలని ఆశిద్దాం.

chitram ‘కలరిపయట్టు’ క్రీడ శిక్షణ ఇస్తున్న మీనాక్షి గురుకుల్

-పి.హైమావతి