సబ్ ఫీచర్

నేతన్నల సంక్షేమం పట్టదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చేనేత ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో ఉంది. వరుస ప్రభుత్వాలు సృష్టించిన విలయంలో నేతన్న బయటకు రాలేక... అందులో ఇమడ లేక చచ్చిపోతున్నాడు. ప్రభుత్వాలకు మాత్రం నేతన్న ఓట్లు కావాలి కానీ... నేతన్న సంక్షేమం మాత్రం అక్కర్లేదు. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి చూపిస్తున్న నేతను పాలకులు బలిపీఠం ఎక్కిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో నేతన్న ఓట్లతో గద్దెనెక్కిన తెలుగుదేశం ప్రభుత్వం... ఇప్పుడు చేనేత సంక్షేమాన్ని మరచి... నేతన్నలపై కేంద్రం కత్తిగడితే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఎన్నో సమస్యలపై తక్షణం స్పందించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతన్నల విషయంలో మాత్రం పట్టీపట్టనట్టుగా ఉన్నారు. సమాజంలో అట్టడుగు వర్గాలు చేనేతతో ప్రయోజనం పొందుతున్నాయి. తొలుత కుల వృత్తిగా మాత్రమే ఉన్న చేనేత ఇప్పుడు అగ్రవర్ణాలకు, సమాజంలోని ఇతర కులాలకు సైతం ఉపాధి కల్పిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చేనేతకు ఆదరణ లభిస్తున్నా... మన పాలకులకు మాత్రం అవి వినపడవు. కనపడవు. మగ్గం ముక్కలై... నేతన్న అకారణంగా మృత్యుఒడికి చేరుతున్నాడు.
ఎన్నో కష్టాలతో నేతను సాగు చేస్తున్న కార్మికులపై ఇప్పుడు జీఎస్టీ పోటుపడింది. నేతన్న ఉపాధి లభించక నడిరోడ్డుపై పడుతుంటే... నేతన్నకు పని కల్పించాల్సిన మాష్టర్ వీవర్లు వస్త్రాలు అమ్ముకోలేక సతమతమైపోతున్నారు. తక్కువ ధరకు నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న చేనేతపై ఇప్పటికే పవర్‌లూమ్ పిడిగు శరాఘాతమైంది. తాజాగా వస్తున్న కార్పొరేట్, ఈ కామర్స్ సంస్థలు సైతం నేతన్న తయారు చేసిన వస్త్రాలను కొనేందుకు సవాలక్ష కొర్రీలు పెడుతున్నాయి. ఇప్పుడు జీఎస్టీ ద్వారా వస్త్రాలపై 5 శాతం పన్ను వేయడం అమ్మకాలపై తీవ్ర ప్రభావం చూపెట్టబోతోంది. అదే సమయంలో నేతన్నకు నూలే ముడి సరకు. ఇప్పుడు చిలపనూలుపై 5 శాతం జీఎస్టీతో అది మార్కెట్లోంచి కార్మికుడి చెంతకు చేరే సరికి సుమారు 10 శాతానికి పైగా పెరగనుంది. దీంతో వస్త్రాల తయారీ వ్యయమవుతుంది. సామాన్యులు నేత వస్త్రాలు కొనుగోలు చేయడం కష్టతరమవుతుంది.
దర్జీ కులం నుంచి వచ్చారని చెప్పుకునే ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. చేనేతల వస్త్రాలను విదేశీ ప్రముఖులకు అందించడం కాదు... ఆ బట్టల తయారీ వెనుక ఉన్న శ్రమను ఆయన గుర్తించాలి. కార్పొరేట్ సంస్థల ఊడిగం చేస్తున్న పాలకులు.. మొద్దు నిద్ర వదలాలి. చేనేత కుటుంబాలను ఆదుకోవాలి.
డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే కావాలనుకుంటాడు... ప్రొఫెసర్ కొడుకు ప్రొఫెసర్ అవ్వాలనుకుంటాడు. రైతు కొడుకు వ్యవసాయం వద్దంటున్నాడు... అలాగే నేతన్న కొడుకు సైతం నేత పని వద్దంటున్నాడు. దీనికి కారణం... పాలకుల విధానాలే. రైతన్నను ధ్వంసం చేస్తున్న పాలకులు ఇప్పుడు చేనేతపై కత్తిగట్టారు.
తాజాగా పెంచిన చిలపనూలు ప్రభావం మూలిగే నక్కపై తాటిపండు చందంలా ఉంది. తాజా నిర్ణయంతో ఏపీలోనే చేనేత రంగంపై రూ.50 కోట్లకు పైగా భారం పడనుంది. నూలు తక్కువ ధరకు లభిస్తుంటేనే మనుగడ కష్టసాధ్యమైన తరుణంలో జీఎస్టీ భారం తమ జీవన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేతన్నలకు రుణమాఫీతో సాంత్వన చేకూర్చిన తెలుగుదేశం ప్రభుత్వం... అది పూర్తిస్థాయిలో నేతన్న ప్రయోజనాలు కాపాడాలి. రైతుకు రుణమాఫీ ఒక్కటే ఏవిధంగా పరిష్కార మార్గం కాదో... నేతన్నకు అంతే. లక్షలమంది నేతన్నలుంటే... వేల సంఖ్యలో మాఫీ జరిగిన ఘటన మనం ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇప్పటికే చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసాం. నేతన్నల విషయంలో ముఖ్యమంత్రి ఔదార్యం ప్రదర్శించాలి. లేకుంటే రాజకీయ పార్టీలపై నేతన్న ఆగ్రహాన్ని చవిచూడాల్సిందే...

- మాడిశెట్టి శివ శంకరయ్య సెల్: 9849678140