సబ్ ఫీచర్

సముద్రాలూ కలుషితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి అటు జీవనోపాధిని ఇటు పౌష్టికాహారాన్ని సముద్రాలు అందిస్తున్నాయి. ప్రపంచ పటంలో మూడు వంతులకు పైగా సముద్రాలు విస్తరించి ఉన్నాయి. ప్రకృతి సంపదలో సముద్ర జలాలది కీలక స్థానం అయినప్పటికీ రానురానూ అవి కాలుష్యం బారిన పడుతున్నా యి. మనం యథేచ్ఛగా సముద్ర జలాలను కలుషితం చేస్తూ, సముద్ర జీవుల మనుగడకే ముప్పు ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం నానాటికీ పెరిగిపోతున్నది. ప్లాస్టిక్ సంచులు, ఇతర వస్తువులు పర్యావరణానికి హాని చేస్తాయని అందరికీ తెలిసినా, వాటి వినియోగాన్ని నియంత్రించడానికి ఎటువంటి చర్యలు తీసుకొనకపోవడం గమనార్హం. ప్లాస్టిక్ వినియోగం విషయంలో యావత్ మానవాళి ‘తాను కూ ర్చున్న చెట్టుకొమ్మను తానే నరుక్కొన్నట్లు’గా వ్యవహరిస్తున్నది.
మానవ శరీర నిర్మాణంలో ప్రొటీన్లది చాలా కీలక పాత్ర. అటువంటి ప్రొటీన్లను సమృద్ధిగా అందజేసే సత్తా ఒక్క సముద్ర జీవులకే ఉంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం సముద్రాలలో 5 ట్రిలియన్‌ల మైక్రోప్లాస్టిక్స్ ఉన్నాయి. వీటిని సముద్ర జీవులు (చేపలు వంటివి) మింగడం, వాటిని మనం ఆహారంగా తీసుకోవడంతో పలువురు కాన్సర్ల బారిన పడుతున్నారు. 2025వ సంవత్సరం నాటికి సముద్రాలలో ప్లాస్టిక్, చేపల నిష్పత్తి 1:3గా ఉంటుందని అంచనా. పలు దేశాలు వ్యర్థ జలాల ను సముద్రంలోకి వి చక్షణా రహితంగా వ దులుతున్నాయి. విశ్వవ్యాప్తంగా సముద్రం లో కలుస్తున్న డ్రైనేజ్ వాటర్‌లో 70 శాతం శుద్ధి చేయనందు న సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి. సముద్ర వాతవారణంలో పెను మార్పులు కలుగుతున్నాయి. దీనివల్ల సాలీనా 13 బిలియన్ డాలర్ల నష్టం జరుగుతుందని యుఎన్‌ఇపి అంచనా వేసింది.
ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్ర జలాల్లో పారవేస్తున్న దేశాల్లో భారత్, చైనాలు ముందువరసలో ఉండటం గమనార్హం. మన దేశంలో సాలీనా ప్లాస్టిక్ వినియోగం 15 మిలియన్ టన్నులు. ఇది 2050 నాటికి 20 మిలియన్ టన్నులు అవుతుందని అంచనా. 2050 నాటికి సముద్ర జలాల్లోని ప్లాస్టిక్ వస్తువులను తొలగించకపోతే, సముద్రాలలో ఉండే చేపల బరుకన్నా ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువగా ఉంటుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2016 మార్చిలో ‘రీ సైక్లింగ్’కు పనికిరాని ప్లాస్టిక్ బ్యాగ్‌ల తయారీని చాలా దేశాల్లో నిషేధించారు. అయితే దాని అమలు శూన్యం. ప్లాస్టిక్ వ్యర్థాలను కొన్ని దేశాలు రోడ్ల నిర్మాణంలోను, విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నాయి. మన దేశంలో పశ్చిమ బెంగాల్‌లో రోడ్ల నిర్మాణంలో ప్లాస్టిక్ వ్యర్థాలను వినియోగిస్తున్నారు. వీటిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. మనకన్నా అభివృద్ధిలో, ఆర్థికంగా వెనుకబడిన దేశాలైన రువాండా, బంగ్లాదేశ్, కీన్యాలు ప్లాస్టిక్ బ్యాగుల తయారీ, వినియోగాన్ని పూర్తిగా నిషేధించాయి. ఇకనైనా సముద్ర జలాలలోకి ప్లాస్టిక్ వ్యర్థాలను వదలడం ఆపకపోతే, చేపలకన్నా ప్లాస్టిక్ వ్యర్థాలే ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది.

-పి.్భర్గవరామ్