సబ్ ఫీచర్

కమ్యూనిస్టులకు కన్పించని ‘సాంకేతికత’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు ఏ దేశంలోనైనా డిజిటల్ వర్క్ఫోర్స్, కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే యంత్రాల రాకతో ‘శ్రమశక్తి’ నిర్వచనం పూర్తిగా మారిపోయిం ది. అయితే, దీన్ని కమ్యూనిస్టులు, నక్సలైట్లు-మావోయిస్టులు ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోవడం లేదు. కూడు, గూడు, గుడ్డ ప్రజలకు అందేలా ‘క మ్యూనిస్టులు’ కష్టపడి పని చేస్తారని చాలామంది నేటికీ భావిస్తారు. తామే నిజమైన కమ్యూనిస్టులమని ముందుకొచ్చిన నక్సలైట్లు- మావోయిస్టులు సైతం పేద ప్రజలకు ప్రాథమిక అవసరాలు దక్కాలని అవాస్తవ దృష్టితో అంటున్నవారే. ఈ దృశ్యం సర్వత్రా దశాబ్దాలుగా కనిపిస్తోంది.
పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అందడానికి చేయాల్సిన కార్యక్రమాలకు బదులు వారు తమ పలుకుబడి, ప్రాబల్యం పెంచుకోవడానికి ఇతర కార్యక్రమాలను ఎక్కువగా చేపట్టారు. ఆ ఒరవడి ఇంకా అలాగే కొనసాగుతూ వుండడం విషాదం. ప్రజలు సంఘటితమై తిరగబడడం వల్లనే సమస్యలన్నీ పరిష్కారమవుతాయని, ప్రాథమిక అవసరాలు సైతం తీరుతాయని అనడం ఎంత లోప భూయిష్టమో ఇప్పటికీ మార్క్సిస్టు సిద్ధాంతాన్ని విశ్వసించేవారు తెలుసుకోకపోవడం విచారకరం.
ఏ కాలంలోనైనా పౌరులు తమ శక్తిసామర్ధ్యాలను పెంపొందించుకుని తమ ఆదాయాన్ని మెరుగుపరచుకోవడం వల్లనే వారి ప్రాథమిక అవసరాలు తీరుతాయి. అలాకాక అన్నీ ప్రభుత్వమే సమకూర్చాలన్న భావన ఒక హక్కుగా ప్రచారంలో పెట్టడం విడ్డూరం. ఎందుకంటే ఈ దేశంలో ఎప్పుడూ సోషలిస్టు వ్యవస్థ లేదు. పనిచేసినా, చేయకపోయినా అన్నీ ప్రభుత్వమే ప్రజలకు సమృద్ధిగా సమకూర్చే వ్యవస్థలో మనం లేం. మరప్పుడు కమ్యూనిస్టులు, నక్సలైట్లు- మావోయిస్టులు ఏ రకమైన స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాలు చేపట్టాలి? ప్రజల నైపుణ్యం పెరిగేందుకు వారి జ్ఞాన స్థాయి పెరిగేలా, వారి ఆదాయ మార్గాలు పెరిగేలా చైతన్యపరచాలి కానీ పాలకులపై తిరగబడడం అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలని చెప్పడం, ప్రభుత్వం దిగొచ్చి, తలవంచి సౌకర్యాలు అందిస్తుందని చెప్పడం దారుణం. పేద ప్రజలు అదే నిజమేమో అని వారి వెంట ఉద్యమాల్లో, సమ్మెల్లో పాల్గొన్నారు. సంఘాలుగా ఏర్పడి పిడికిలి బిగించారు. మార్క్సిజం ‘జార్గాన్’ను వల్లె వేసారు. మరి వారి జీవితాలు మారాయా..? లేనే లేదు.. అయినా వారు ఎప్పుడూ పశ్చాత్తాపం ప్రకటించలేదు. తమ ప్రాపంచిక దృక్పథం సమకాలీన పరిస్థితులకు సరైనది కాదని వారెప్పుడూ భావించలేదు. దశాబ్దాలుగా వారు ప్రజలను దగా చేస్తున్నారు.
కమ్యూనిస్టులు కూలీల్లో కూలీలుగా, కార్మికుల్లో కార్మికులుగా ఒదిగిపోయి పని చేస్తారన్న ఒక భావన ఉంది. కానీ ఇప్పుడు వారి మధ్య అంతరం కాస్తా అగాథంలా మారింది. ఈ ఒక్క పరిణామం ద్వారానే కమ్యూనిజం ‘కానె్సప్ట్’ ఎంత లోపభూయిష్టమైనదో అర్థమవుతుంది. కమ్యూనిస్టు,మావోయిస్టు కార్యకర్త ఎంతో కొంత విద్యాగంధంతో, పరిస్థితులపై పరిశీలనా దృక్పథం ఉన్నవారిగా కనిపిస్తారు. ఆ అవగాహన, అక్షర జ్ఞానం, వివేచనా శక్తి ఏదో మేరకు పేద ప్రజల్లో పాదుకునేలా పాటుపడాల్సింది పోయి ప్రజల శక్తి సామర్ధ్యాలను తమ రాజకీయ ప్రాబల్యం కోసం పెట్టుబడిగా ఉపయోగించుకోవడం పెద్ద ట్రాజెడీ! కమ్యూనిజం సిద్ధాంతంలో పెట్టుబడిదారీ విధానం ఎలా అంతర్లీనంగా ఇమిడి ఉందో ఈ విషయం తెలియజేస్తోంది. ఈ మానవ నిచ్చెన మెట్లను, సామర్ధ్యంలోని వ్యత్యాసాలను, అవగాహనలోని అంతరాలను, ఆలోచనల్లోని తేడాలను అసలు పట్టించుకోకుండా- సామ్రాజ్యవాదం, భూస్వామ్య విధానం గురించి ‘ఉపరితల’ అంశాలపై కమ్యూనిస్టులు ఆవేశంగా ఉపన్యసించడం వల్ల పేద ప్రజలకు ఏం ఒరిగింది? ‘హళ్లికి హళ్లి.. సున్నాకు సున్న మాత్రమేన’ని దశాబ్దాల అనుభవం చాటి చెబుతోంది.
పేద ప్రజల పట్ల, బలహీనుల పట్ల ప్రేమ గలవారు, సానుభూతి, సహానుభూతి గలవారు చేయాల్సింది ఏమిటి? చేసింది ఏమిటి? సోషలిస్టు వ్యవస్థ స్వప్నం చూపిస్తూ కాలం వెలిబుచ్చారు. ఇప్పటికీ అదే మార్గంలో ప్రజల్ని నడిపించేందుకు ‘ఓవర్‌టైం’ పనిచేయడం సబబేనా? ప్రజల్లోని శక్తి సామర్ధ్యాలను, నైపుణ్యాలను సమకాలీన సమాజ ఉన్నతీకరణకు, ఉత్పత్తికి, మెరుగైన సేవలకు ఉపయోగించేలా జనాలను పురిగొలిపితే ఫలితాలు మరోలా ఉండేవి. కానీ కొన్ని తరాలపాటు, వాస్తవ దూరమైన కలలు కనేలా చేయడం వల్ల నష్టపోయింది పేద ప్రజలే. చీకటి దారిలో ప్రయాణించడం, అదే గొప్ప ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని పేర్కొనడం అదీ దశాబ్దాలపాటు కొనసాగించడం.. తత్త్వం బోధపడ్డాక సైతం అ హంతో, అదే ప్రణాళికతో ముందుకెళ్లడం పేద ప్రజలను చైతన్యపరిచే అంశం కానేకాదు. కానీ ఆ పద్ధతే సరైనది , శాస్ర్తియమైనది, సాధికారితను సాధించిపెట్టేదని చెప్పడం ఎంతటి అన్యాయం?
రానున్న దశాబ్ద కాలంలో సమాజంలోని అన్ని రంగాలలో అనూహ్యమైన మార్పులు జరగబోతున్నాయని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. గత అర్ధ శతాబ్దంలో ఎన్నడూ జరగని మార్పులు త్వరలో చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఆ సూచనలు ‘డిజిటల్ ఇండియా’ ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. ‘ఆటోమేషన్’ అన్న ఒకే ఒక్క అవగాహన, ఆలోచన సమాజం రూపురేఖల్ని మార్చేస్తోంది. ఇది కొత్త తరాలకు కొత్త అవకాశాలను కల్పించనుంది. సమాజం ఎదుర్కొనే సవాళ్లకు సాంకేతికత పరిష్కారం చూపనున్నదని నిపుణులు భావిస్తున్నారు. కృత్రిమ మేధ అందిస్తున్న సదుపాయాలు, సౌకర్యాలు సమాజం నిండా పరుచుకోనున్నాయి. సేవల తీరు, వ్యాపారం తీరు, పాలన తీరు పూర్తిగా మారబోతోంది. సమాజం సంపూర్ణంగా రూపాంతరం చెందనున్నది. ఇది అతి త్వరలో వాస్తవ రూపం దాల్చనుంది. ఇప్పటికే ‘రోబోలు’ బ్యాంకుల్లో దర్శనమిస్తున్నయి. ఫ్యాక్టరీల్లో వస్తు ఉత్పత్తిలో పాల్గొంటున్నాయి. డ్రైవర్లు లేని కార్లు, ట్రక్కులు రానున్నాయి. డ్రోన్లు విస్తృత ఉపయోగంలోకి వచ్చాయి. వివాహాల్లో, పెద్ద పెద్ద సభల్లో విహంగ వీక్షణం ఫోటోలు తీయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటి వ్యవస్థాకుల్లో ఒకరైన తెలుగువాడు రాజ్‌రెడ్డి రోబోలకు మాటలు, భాషలు నేర్పుతున్నాడు. ప్రపంచంలో మెరుగైన రోబోల తయారీకి ఆయన అమెరికాలో ఒక సంస్థను ప్రారంభించి చాలా దూరం ప్రయాణం చేసారు. ఆ సంస్థ ఫలాలు అందరినీ ఆశ్చర్యపరస్తున్నాయి. కృత్రిమ మేధకు పరాకాష్ఠగా నిలిచే పరిజ్ఞానాన్ని అక్కడ ప్రోది చేస్తన్నారు. సత్య నాదెళ్ల కార్యదీక్ష సరేసరి!
అలాగే మరో గ్రహం మీద మానవ నివాసం సాధ్యమేనని తరచూ వార్తలు వెలువడుతున్నాయి. అటువైపుగా వేగంగా అడుగులు పడుతున్నాయి. భారతదేశం సైతం అటువైపు చూపు నిలిపింది. ఈ నేపధ్యంలో కమ్యూనిస్టులు, నక్సలైట్లు-మావోయిస్టులు చెబుతున్న మార్కెట్ రహిత ఆర్థిక వ్యవస్థ నిజమయ్యే అవకాశాలు ఎవరికైనా కనిపిస్తున్నాయా?

-వుప్పల నరసింహం