సబ్ ఫీచర్

ప్రేమ ముసుగులో మేకవనె్న పులులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని యుక్తవయసు ప్రారంభ దశలో వున్న విద్యార్థినులను అవకాశం చూసి కాటేయడానికి మేక తోలు కప్పుకున్న పులుల్లా వ్యవహరిస్తూ ప్రేమ, స్నేహం అంటూ బాలికలు నయవంచకుల వలలో చిక్కుకొని విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న దృశ్యాలు నిత్యం అనేక ఛానళ్ళలో తిలకిస్తున్నాం, అనునిత్యం దినపత్రికల్లో పతాక శీర్షికల్లో చదువుతూనే ఉన్నాము. అయినప్పటికీ ఇలాంటి దుస్సంఘటనలు కోకొల్లలు.మైనర్ బాలికల్ని ప్రేమ పేరుతో వంచించి స్నేహితుల సహకారంతో మరింత రెచ్చిపోతూ అత్యాచారాలకు గురి చేస్తన్నారు. ఇలాంటి పోకిరీ వెధవలకే అమ్మాయిలు పడిపోతున్నారు. మన రాష్ట్రంలో ఇటువంటి ఎన్నో కేసులు సంఖ్య పెరిగి ఆందోళన కలిగిస్తున్న వైనాలు ఎన్నో. పోలీసులు ఇలాంటివాటిపై అప్రమత్తంగా వున్నప్పటికీ తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తూ దోషులకు అండగా వుండటం శోచనీయం.
ఇలాంటి సంఘటనలు పెచ్చుపెరిగిపోవడానికి ఫేస్‌బుక్‌లాంటి సామాజిక మాథ్యమాలని ఉపయోగించుకోవడం దురదృష్టకరం. మొదట్లో కొత్త వ్యక్తి పరిచయంతో ఆ వ్యక్తి ఎటువంటివాడో గ్రహించక గుడ్డిగా నమ్మి ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు ముఖ్యంగా యువతీ యువకులు, బాల బాలికలు తల్లిదండ్రులకు దూరంగా వుంటూ హాస్టల్స్‌లో చదివే వారివల్ల మరింత అప్రమత్తంగా వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఇలాంటి నీచ హృదయంగల పోకిరీలవల్ల జరిగే అనర్థాల్ని పాఠశాల స్థాయి నుంచే పిల్లలకు అవగాహన కల్పిస్తూ, ఇలాంటివారిపట్ల ఎలా మెలగాలో చైతన్యపరచాలని మహిళలు తల్లిదండ్రులతోపాటు స్వచ్ఛంద సంస్థలూ విద్యార్థులకు అవగాహనా సదస్సుల్ని నిర్వహిస్తూ వుండాలి. ఆడపిల్లలకు బాల్యం నుంచే నైతిక విలువలు నేర్పాలి. వారు చేసే చిన్న తప్పే తమ జీవితానికి ఏ విధంగా ‘శాపం’ అవుతుందో అవగాహన లేకపోతే పెడత్రోవ పడి ప్రేమ ముసుగులో ఏ విధంగా నలిగి విలువైన జీవితాలను కోల్పోతారో తెలపాలి. ఇలాంటి సదస్సుల్ని కళాశాల స్థాయిల్లో నిర్వహిస్తూ ఆయా సదస్సులకు పోలీసు అధికారులను కూడా ఆహ్వానిస్తూ నయవంచకులకు పడే శిక్షలు, సెక్షన్స్ తెలియజేయాలి.
ముఖ్యంగా ప్రేమ- స్నేహం ముసుగులో కూరుకుపోయిన అమ్మాయిల-అబ్బాయిల అలవాట్లు తల్లిదండ్రులు గమనిస్తుండాలి. సెల్‌ఫోన్లలో, చాటింగ్, నెట్, ఫేస్‌బుక్ ఇలా అంతర్జాల పరిజ్ఞానం వచ్చాక ప్రేమంటూ ఆత్మహత్యలు అధికవౌతున్నాయి. ఇలాంటి అసభ్యకర వాతావరణానికి దగ్గరౌతున్న విద్యార్థులపట్ల హాస్టల్ మేట్రిన్స్, వార్డెన్స్, అధ్యాపకులూ అందరూ ప్రత్యేక నిఘా వేయాలి. యువత తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని, కొత్త కొత్త చట్టాలు వచ్చాయని, ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ బుగ్గిపాలవుతుందని, మేకవనె్నపులులు ఎవరైనా మీకు తారసపడితే పోలీసుల సాయం తీసుకోవచ్చని విద్యార్థినుల్లో అవగాహన కల్పించాలి. ముఖ్యంగా 16 నుంచి 20 లోపు అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు వారు ఎటువంటి ఒత్తిడులకు దూరంకాకుండా మరే ఇతర ప్రలోభాలాలకు లోనై మోసపోకుండా కంటికి రెప్పలా పర్యవేక్షిస్తుండాలి.
చైతన్య కార్యక్రమాలు పేరున ప్రభుత్వాలు అవగాహన సదస్సులకు ప్రోత్సహిస్తూ ఆడపిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా కషి సల్పితే భావి భారతంలో ‘మహిళా రక్షణ’ మరికాస్త దృఢవౌతుందని ఆశిద్దాం!

-ఈవేమన