సబ్ ఫీచర్

చట్టసభల తీరు మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాదానికి ప్రతి వాదముంది, బాణానికి బాణముంది అని మహాకవి శ్రీశ్రీ అన్నట్టు చట్టసభల్లో నేడు ప్రజాస్వామిక విధానాలకు, ప్రజాశ్రేయస్సుకు చేయాల్సిన సంస్కరణలను పక్కనపెట్టి ప్రజాప్రతినిధులు వాదోపవాదాలకు చట్టసభలను వేదికగా చేసుకోవడం దురదృష్టకరం. వాదోపవాదాలే కాదు పార్టీల ఆపై వ్యక్తిగత సమస్యల్ని తెరపైకి తెచ్చి ఘర్షణాయుత వాతావరణాన్ని సృష్టించడం మరింత దారుణం. పాలిత ప్రభుత్వాల అప్రజాస్వామికాన్ని నియంతృత్వ ధోరణులను చట్టసభల్లో ఎండగట్టి ప్రజలకోసం ఆరోగ్యకరమైన సంక్షేమ పథకాల బిల్లుల్ని పాలిత ప్రభుత్వం ప్రవేశపెడితే అందులోని మంచి చెడ్డలను సహేతుకంగా విమర్శించే అవసరమైతే సవరణలు చేయించి ఆమోదించాల్సిన కర్తవ్యం ప్రతిపక్షాలకుంది. మెజారిటీ ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారని, తమ నిర్ణయాల మేరకే ప్రతిపాదిత బిల్లుల్ని ఆమోదించి తీరాలన్న అహం పాలిత ప్రభుత్వాలకు కూడా తగనిది. ప్రజల మంచిని ఎంచే పథకాల్ని ప్రతిపక్షాలు కూడా సమాలోచించి ఆమోద నిర్ణయాన్ని తెలియజేస్తే ప్రజామోదానికి మరింత వనె్న చేకూరుతుంది.
అంతేకానీ పంతాలు పట్టింపులకు పోయి పాలిత పార్టీల ప్రభుత్వం చేపట్టిన చట్టసభల్లో ప్రవేశపెట్టిన ప్రతిదానికీ అడ్డుపుల్లలు వేయాలనుకోవడం తగని పని. అంతకంటె ప్రజా ప్రతినిధులు వ్యక్తిగతాలలోకి వెళ్లి దూషణలు చేసుకోవడం మరింత సిగ్గుచేటు. చట్టసభల్లో జరుగుతున్న దృశ్యాల్ని ప్రజలు చూస్తున్నారన్న వివేచనతో నడుచుకోవాలి. ఆ మేరకు సమున్నతంగా వ్యవహరించి ప్రజాశ్రేయోదాయక వ్యవస్థను నెలకొల్పాలి కానీ ఇలాంటి వారిని గెలిపించి చట్టసభలకు పంపినందుకు ప్రజలు పశ్చాత్తాప భావంతో తలలు బాదుకునే తీరులో వ్యవహరించరాదని ప్రజాప్రతినిధులు కూడా తమ కర్తవ్యాన్ని నిర్వహించి తమ హోదాకు వనె్న తీసుకురావాల్సిన అవసరం ఎంతో ఉంది. చట్టసభలను సంత వ్యవహారం చేసి ఒకరినొకరు నిందించుకుని ఆపై వ్యవహారం ముదిరి సభలనుండి బహిష్కరించే వరకు తెచ్చుకుని న్యాయస్థానాల వరకు వెళ్లడం ఏ పార్టీ ప్రతినిధులకైనా మంచిది కాదు. ప్రతిపక్ష పార్టీ సభ్యులు కేవలం పాలిత ప్రభుత్వాన్ని నిలదీయడానికి, దుయ్యబట్టడానికే పరిమితం కానవసరం లేదు. పాలక ప్రభుత్వం వక్రమార్గాలని ఎండగడుతూ ఆరోగ్యకరమైన అర్ధవంతమైన సలహాలు, సూచనలతో సక్రమ మార్గం పట్టే దిశగా పయనింపచేయాల్సి ఉంది.
స్వాతంత్య్రం వచ్చిన తరువాత చట్టసభలు ఎంతో హుందాగా అర్ధవంతంగా జరిగేవి. పాలిత ప్రభుత్వం ఏ పార్టీదైనా ప్రభుత్వ నేతలు ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాలు అర్ధవంతమైనవైతే స్వాగతించి సమాదరించే నిబద్ధతతో వ్యవహరించేవారు. సభ్యులుకూడా హుందాగా చట్టసభల్లో ప్రసంగించి తమ పాత్రకు న్యాయం చేకూర్చేవారు. రానురాను చట్టసభలు తమ తమ పార్టీల ఆధిక్యత కోసమో, తమకు దక్కని పట్టం కోసమో ఆరాటపడో లేకుంటే తమ ఆధిక్యతను నిరూపించుకోవాలనే ఆరాటానికి గురి కావడం, అర్ధవంతం లేని ఆరోపణలతో వ్యక్తిగత లేక పార్టీపరమైన దూషణలతో సభా సమయాన్ని వృధా చేయడమే కాకుండా ప్రజాధనాన్ని సైతం వృధా చేయడం జరుగుతున్నది. సభల్లో అధ్యక్ష స్థానంలో వున్న సభా పతిని కూడా కించపరిచే విధంగా ప్రవర్తించడం, సభా మర్యాదల్ని తోసిపుచ్చడం లేదా సభాపతిపైనే లేనిపోని నిందలు వేయడం అనుచితం. ప్రజాస్వామ్యంలో పారదర్శక ప్రభుత్వాల మనుగడకు, ప్రజాభిమానం పొందడానికి ప్రజాప్రతినిధులు తమకర్తవ్యాన్ని మననం చేసుకోవడం అత్యంతావశ్యకం.

-దాసరి కృష్ణారెడ్డి