సబ్ ఫీచర్

బహుముఖ ప్రజ్ఞాశాలి మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళల్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఒకరు. ఆమె కేవలం ఒక రాజకీయ నాయకురాలిగానే ప్రజలందరికీ తెలుసు. అయితే ఆమె బహుముఖ ప్రజ్ఞావంతురాలు. ఆమె మంచి చిత్రకారిణి. అటు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఇటు తృణమూల్ కాం గ్రెస్ అధినేత్రిగా ఆమె ఊపిరి సలపనంతగా పనులతో ఉన్నప్పటికీ, చిత్రాలు గీయడానికి కొంత సమయం కేటాయిస్తారు. ఆమెకు మంచి డిజైనర్‌గా కూడా గుర్తింపు ఉంది. పెయింటర్, డిజైనర్‌గానే కాకుండా సాహిత్యంలో కూడ ఆమె అందెవేసిన చెయ్యికావడం గమనార్హం. ఆమె ఇంగ్లీషు, బెంగాలీ, ఉర్దూ భాషలలో పలు రచనలు చేశారు. ఆమె ఇప్పటివరకు 68 పుస్తకాలు రచించారు. ఆమె కలంనుంచి జాలువారిన పాటలు, పద్యాలను ఏడు సీడీలుగా విడుదల చేశారు. ప్రముఖ బెంగాలీ నేపథ్య గాయకులు నచికేత, ఇంద్రాణి సేన్‌లు సీడీలకు గాత్ర దానం చేశారు.
ఆమె రచనలలో ‘ఉపలబ్ధి’ మొదటి నవల. ఈ పుస్తకం పలుమార్లు రీప్రింట్ కావడంతోపాటు, ఎక్కువ పుస్తకాలు అమ్ముడుపోయాయి. అసహనం, దాద్రీ సంఘటన వంటి సమకాలీన అంశాలపై కూడ ఆమె రచనలు చేశారు. ఇటీవల కోల్‌కత్తాలో జరిగిన అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో మమతాబెనర్జీ రచించిన పుస్తకాలను విక్రయించడంకోసం ప్రత్యేకంగా స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. మమతాబెనర్జీ పెయింటింగ్, డిజైనింగ్, పాటలు, పద్యాలు, నవలలు, కథలను కలిపి ‘ఎక్‌బాగ్ మమత’ పేరిట ప్రచురించారు. ఒక్కొక్క సెట్‌ను 9286 రూపాయల చొప్పున విక్రయించారు. మమతాబెనర్జీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత 34 పుస్తకాలను రచించడం గమనార్హం.
1997లో ఆమె రెండు పుష్పాలు లేదా ‘‘జోరాపూల్’’ను పెయంట్ చేశారు. ఇవే తర్వాత తృణమూల్ కాంగ్రెస్‌కు చిహ్నంగా మారాయ. 2005లో దీదీ తన పెయంటింగ్‌ల తొలి ప్రదర్శన నిర్వహించారు. భారతీయ మ్యూజియంలో 2007లో నిర్వహించిన రెండవ ప్రదర్శనలో వచ్చిన రూ.14 లక్షల ఆదాయాన్ని నందిగ్రామ్ బాధితులకు విరాళంగా ఇచ్చారు. 2012లో ఆమె ఒక విరాళంగా ఇచ్చిన పెయంటింగ్‌ను న్యూయార్క్‌లోని టాగోర్ గ్యాలరీలో వేలం వేయగా 3000 డాలర్లకు అమ్ముడు పోయంది. 2013లో ‘‘డ్రీమర్స్ క్రియేషన్’’ పేరుతో నిర్వహించిన ప్రదర్శనలో వచ్చిన కోటి రూపాయల ఆదాయాన్ని మమతా బెనర్జీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చారు.
త్వరలో పశ్చిమ బెంగాల్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలలో తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంకోసం ఆమె పలు గీతాలను రచించి, వాటిని రికార్డ్ చేయించారు. అటు అధికార కార్యక్రమాలు ఇటు పార్టీ పనులలో బిజీబిజీగా ఉంటున్నప్పటికీ, ఏమాత్రం ఖాళీ దొరికినా కలం లేదా కుంచెలకు పనిచెబుతున్నారు.

-హైమవతి