సబ్ ఫీచర్

కలిసి ఉంటేనే ముద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్యనే ప్రచురితమైన ‘విడిగా ఉంటేనే ముద్దు!’ అనే అంశం చదివాక నా స్పందన ఇది.
నేను ‘విడిగా ఉంటేనే ముద్దు!’ అనే భావనతో ఏకీభవించ లేకపోతున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు విడిపోవటాలు, విడాకులు తీసుకోవటాలు వంటివి ఎక్కువ కావటానికి కారణం చాలా వరకు ఇలాంటి విడి కాపురాలే.
ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవారి అదుపు ఆజ్ఞల నడుమ జీవించే వారిలో సామాన్యంగా ఇలాంటివి జరగటానికి అవకాశముండదు. పెద్దవాళ్ళపట్ల గల గౌరవంతోనో - భయంతోనో సర్దుకుపోవటమో లేదా ఒక వేళ ఆలుమగల మధ్య పొరపొచ్చాలు వచ్చినా పెద్దవాళ్ళు సరిదిద్దడమో జరుగుతుంటుంది.
విడిగా ఉన్న కాపురాలలో కావాల్సినంత స్వేచ్ఛ లభించటంలో ఎన్నో అనర్థకాలు జరిగిపోతుంటాయి.
ఉదాహరణకు తాగుడుకు అలవాటుపడ్డ మగవాడు విడిగా ఉన్నాడంటే... అంటే భార్యాభర్త మాత్రం ఉంటున్న కాపురమయితే అతను తాగి ఇంటికి రావటమో - లేదా నేరుగా ఇంటికే సరకును తెచ్చుకొని తాగటమో చేస్తుంటాడు. ఓ ప్రక్క భార్య కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా తన పని కానిచ్చుకుంటాడు. లేదా పెళ్ళాన్ని పట్టుకుని కొట్టడం వంటివి కూడా జరుగుతుంటాయి. అదే పెద్దవాళ్ళతోపాటు ఉన్నారంటే ఎవరూ తాగితందనాలాడటానికి సాహసించరు. పెద్దవాళ్ళను గౌరవిస్తూ చెడు అలవాట్లను దరిచేరనివ్వరు.
అంటే వాళ్ళ ప్రవర్తన కూడా బాగుంటుందన్నమాట. ఆడవాళ్ళు కూడా తమ సాంప్రదాయబద్దమైన జీవితాన్ని గడుపుతూ... తమ ఆచారాలను, సంస్కృతిని ఆకళింపు చేసుకునే అవకాశముంటుంది.
ఏది ఏమైనా ఎక్కువగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడే ఆలుమగల్లో ప్రేమాభిమానాలు పటిష్టింగా ఉంటాయి. భర్తలు కూడా భార్యలను ప్రేమగా చూసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వారికి కలిగే పిల్లలు... ఎంతో భద్రతా భావాన్ని కలిగి ఉంటారు.
తండ్రి లేదా తల్లి కొట్టినప్పుడు పిల్లలు నేరుగా తాతయ్య, నానమ్మ దగ్గరికి వెళ్ళి వాటేసుకుని తను బాధల్ని చెప్పుకోవటం చూస్తుంటాము. అదే విడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు పోట్లాడుకుంటున్నప్పుడు చూసిన పిల్లలు భీతిల్లిపోవటం... అభద్రతా భావాన్ని పెంపొందించకోవటం జరుగుతుంటుంది. కొత్తగా పెళ్ళయి, జీవితాన్ని ఆరంభిస్తున్న సమయంలో కనీసం కొంతకాలమైనా పెద్దవాళ్ళ చెంత ఉండటం ఉత్తమం. పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఎన్నో జీవిత పాఠాలను నేర్చుకునే వీలుంటుంది. వారి జీవిత మార్గం సుగమమవుతుంది.

- షహనాజ్, అనంతపురం