సబ్ ఫీచర్

శ్రావణ మాసం నైవేద్యాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రావణమాసం పూజల వేళ. అమ్మవారికి శెనగపప్పు, బెల్లం, మినప్పిండితో చేసిన తొమ్మిది రకాల నైవేద్యాలు పెడతారు. వీటిని విభిన్నంగా చేసి అమ్మవారికి నివేదిద్దాం. కాత్యాయనీదేవికి ఉప్పు వేసి చేసిన అప్పాలను నైవేద్యంగా పెడతారు. దద్ద్యోజనం, చక్రపొంగలి ఇలా 9 రకాలు పెడతారు.
బూరెలు
శెనగపప్పు - 1 కప్పు, బెల్లం - 1 కప్పు, ఏలకులు - 8, నెయ్యి - 5 చెంచాలు, నూనె - 250గ్రా., శెనగపిండి - 1 కప్పు
మైదా - 1 కప్పు, బియ్యం పిండి - 1 కప్పు, ఉప్పు - చిటికెడు
విధానం: ముందుగా మైదా, శెనగపిండి, బియ్యంపిండిలో ఉప్పు వేసి ముద్దగా బజ్జీల పిండిలా కలిపి ఒక ప్రక్కన పెట్టాలి. ఈ మూడు రకాల పిండిని తోపు పిండి అంటారు. శెనగపప్పు మెత్తగా ఉడకబెట్టి, బెల్లం ఏలకులు వేసి ముద్దగా చేసుకోవాలి. నిమ్మకాయంత ఉండలు చేసి దీన్ని పిండిలో ముంచి కాగిన నూనెలో వదలాలి. ఇలా మొత్తం ఉండలన్నీ బూరెలుగా చేసుకోవాలి. ఈ పిండిలోనే మిర్చి ముక్కలు, అల్లం పేస్ట్, జీలకర్రా కలిపితే కారం బూరెలు తయారవుతాయి.

ఉప్పు అప్పాలు
మెత్తని బియ్యం పిండి - 2 కప్పులు
ఉప్పు - 1/2 చెంచా
తరిగిన బెల్లం - 2 కప్పులు
నూనె - 250 గ్రా.
నెయ్యి - 1 చెంచా
విధానం: 4 కప్పుల నీటిలో ఉప్పు వేసి పొంగనివ్వాలి. నెయ్యి, బెల్లం పోసి కరగనిచ్చి బియ్యం పిండి పోసి ఉడకనివ్వాలి. పిండి ఉడికాక దింపి చల్లార్చి అరచేతికి సరిపడు అప్పాలు నూనె తడితో వత్తుకొని నూనెలో వేయించాలి. ఇలా ఉప్పు అప్పాలు అన్నీ వత్తుకొని వేయించాలి.
శెనగపప్పు
పాయసం
శెనగపప్పు - 1 కప్పు, బియ్యం - 1 కప్పు, కొబ్బరి కోరు - 1/2 కప్పు
నెయ్యి - 5 చెంచాలు, ఏలకులు - 5, జీడిపప్పులు - 12, బాదం పప్పులు - 12, కిస్‌మిస్ - 24, పాలు చిక్కనివి - 1 లీటరు, కుంకుమ పువ్వు - 1 చెంచా, బెల్లంతరుగు - 2 కప్పులు, పంచదార - 1/2 కప్పు
విధానం: పాలు బాగా కాయాలి. కుక్కర్‌లో బియ్యం, పప్పు, కొబ్బరి పెట్టి నాలుగు విజల్స్ రావాలి. నేతిలో కిస్‌మిస్‌లు, డ్రైఫ్రూట్స్ వేయించి పాలల్లో వేసి కలపాలి. కుక్కర్ మూత తీసి బెల్లం పంచదార పాలు చేర్చి సన్నని సెగని ఉడకనివ్వాలి. ఏలకులు వేసి దింపాలి. అమ్మవారికి ఇష్టమైన శనగపప్పు పాయసం రెడీ!

-వాణీ ప్రభాకరి