సబ్ ఫీచర్

చేతిలో సరికొత్త ఫిడ్జెట్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒత్తిడిని చిటికెలో తుర్రుమనిపిస్తోందంటూ ఓ సరికొత్త స్ట్రెస్ యాంటీ డోట్ మార్కెట్లోకొచ్చింది. రెండు వేళ్లమధ్య ఇమిడిపోయే ఆ చక్రమే ‘్ఫడ్జెట్ స్పిన్నర్’. ఫిడ్జెట్ స్పిన్నర్ అనేది వేళ్లమధ్య ఇమిడిపోయి గుండ్రంగా తిరిగే గాడ్జెట్. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా ఫిడ్జెట్ స్పిన్నర్ గిర్రున తిరుగుతోంది. చేతివేళ్లమధ్య ఇమిడిపోయే ఈ చిన్న ఆట వస్తువు ఇప్పుడు క్రేజీగా మారింది. స్పిన్నర్‌ను తిప్పుతుంటే రిలాక్సేషన్ వస్తుందని చెప్పేవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఫిడ్జెట్ స్పిన్నర్ ఒకసారి తిప్పగానే కొన్ని నిమిషాలపాటు అలా తిరుగుతూనే ఉంటుంది. అలా తిరగడమే ఈ ఆటలో ఉన్న అసలు స్పెషాలిటీ. 1993లో కనిపెట్టిన ఈ ఆట వస్తువు ఇటీవలికాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రకరకాల రంగుల్లో, వివిధ రకాల ఆకృతుల్లో వీటిని తయారుచేస్తున్నారు. ఇందులో కొన్ని ఎల్‌ఇడిల కారణంగా వెలుగుతాయి. సింపుల్‌గా దీనిని స్ట్రెస్ బస్టర్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఫ్లోరిడాకు చెందిన శాస్తవ్రేత్త క్యాథరిస్ హెట్టింగర్ దీన్ని కనిపెట్టినట్లు ఆధారాలున్నాయి. తప్పుదారి పడుతున్న యువత ఆలోచనలను ట్రాక్‌లో పెట్టే ఉద్దేశ్యంతో.. ఈ ఫిడ్జెట్ స్పిన్నర్‌ను కనిపెట్టింది హెట్టింగర్. ఫిడ్జెట్ స్పిన్నర్‌ని ఎనిమిదేళ్లపాటు హెట్టింగర్ పేటెంట్ తీసుకుంది. ఫిడ్జెట్ స్పిన్నర్‌పైన పేటెంట్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత ప్రపంచ మార్కెట్‌లకు ఈ ఆట బొమ్మలు వెల్లువలా వచ్చాయి. సరదాకోసం స్ట్రెస్ రిలీజ్ కోసం జనాలు దీనిని కొనడం మొదలుపెట్టారు. ఐతే ఈ ఏడాది మార్చి నుంచి జూన్ మధ్యలో ఫిడ్జెట్ స్పిన్నర్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయింది. రకరకాల రంగుల్లో డిజైన్లలో ఫిడ్జెట్ స్పిన్నర్లను తయారుచేస్తున్నారు. రెండు చివరలు మాత్రమే ఉండేవి కూడా దొరుకుతున్నాయి. కొన్ని తిరిగేటప్పుడు ఎల్‌ఇడిల కారణంగా వెలుగుతాయి. రేడియంతో తయారుచేసిన గాడ్జెట్స్ రాత్రిపూట మెరుస్తుంటాయి. ప్లాస్టిక్, కంచు, స్టీల్, టైటానియమ్, కాపర్, అల్యూమినియం మెటల్స్‌తో ఈ గాడ్జెట్స్‌ను తయారుచేస్తున్నారు. ఈ స్పిన్నర్‌ను తిప్పితే రిలాక్సేషన్ ఉంటుందని స్ట్రెస్ బస్టర్‌గా పనిచేస్తుందని ఈ ఆటను ఆడేవారు చెబుతున్నా, ఇదంతా కేవలం కల్పితాలే అని కొట్టిపారేస్తున్నారు సైకాలజిస్టులు. స్పిన్నర్ కేవలం ఆట వస్తువు మాత్రమేనని, దీనివల్ల కొంత వినోదం లభిస్తుంది తప్పితే ఒత్తిడి తగ్గడం లాంటివి జరగవని చెబుతున్నారు ఈ స్పిన్నర్‌ను ఆట వస్తువుగా మాత్రమే చూడాలని, అలవాటుగా మారితే ప్రమాదం పొంచి ఉందని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఈ ఆట విషయంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించాలని లేదంటే గాయాలు అయ్యే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఫిడ్జెట్ స్పిన్నర్ గురించి మంచే కాదు, చెడు కూడా ప్రచారంలో వుంది. చెడు ఆలోచనలను దారిమళ్లించేందుకు స్పిన్నర్‌ను కనిపెట్టారు. కానీ, వాటికి విద్యార్థులు, యువత అడిక్ట్ అయిపోయి చదువుల మీద ధ్యాస పొగొట్టుకుంటున్నారట. అందుకే చాలా స్కూళ్ళల్లో వీటిని బ్యాన్ చేశారు. విద్యార్థులు పాఠం వినే సమయంలో కూడా వీటిని వినియోగిస్తున్నట్లు గుర్తించిన యజమాన్యలు వీటిపై నిషేధాన్ని విధించాయి. బడికి పంపే సమయంలో విద్యార్థుల సంచులను పరిశీలించి, అందులో ఫిడ్జెట్‌లు లేకుండా చూడాలని తల్లిదంఅడులకు సూచించాయి. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు వీటిని ఉంచుకున్నా, వినియోగించినా జరిమానాలు వేస్తున్నారు. కొన్ని స్పిన్నర్‌లలో లిథియమ్ బటన్ ఉన్న బ్యాటరీస్ పేలిపోయే ప్రమాదాలు కూడా జరగవచ్చు.

-తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి