సబ్ ఫీచర్

‘కాంగ్రెస్ ముక్త భారత్’ సాధ్యమేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంజాబ్‌లో అకాలీదళ్-బిజెపి సంకీర్ణ ప్రభుత్వాన్ని కా దని ప్రజలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. ఎందుకని..? అక్కడ చండీగఢ్ నగరం కొలంబియాలాగా మారింది. నెదర్‌లాండ్స్, కొలంబియా, మెక్సికో, జర్మనీల్లో నేడు మాదక ద్రవ్యాల ఉత్పత్తి కుటీర పరిశ్రమలా మారింది. ఎన్నికలు వచ్చినపుడు ప్రజలకు పలు రకాల తాయిలాలు అందించటం భారత్‌లో అన్ని రాజకీయ పార్టీలకూ అలవాటే. కలర్ టీవీలు, మిక్సీలు, సెల్‌ఫోన్లు తమిళనాడులో ఉచితంగా పంపిణీ చేశారు. ఐతే- చండీగఢ్‌లో మాత్రం ఇంటింటికీ ‘ఎల్‌ఎస్‌డి’ ప్యాకెట్లు పంచారు. ‘హాయిగా ప్రతినెలా ఎన్నికలు వస్తే ఎంత బాగుండును’ అని పంజాబ్ ఓటర్లు బహిరంగంగానే అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి నిలయంగా మారడంతో అకాలీదళ్-బిజెపి సంకీర్ణ ప్రభుత్వం పంజాబ్‌లో అధికారం కోల్పోయింది.
పంజాబ్‌లో సిక్కులు పౌరుషానికి పర్యాయపదం. అలాంటి జాతిని ‘మత్తు’కు బానిసలుగా చేసి నిర్వీర్యం చేయాలన్న వ్యూహం వెనుక అంతర్జాతీయ కుట్ర ఉంది. ఈ విషయం భారత ప్రభుత్వం గుర్తించలేదా? అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి గ్లామర్ మాత్రమే కాంగ్రెస్ విజయానికి కారణం కాదు. డ్రగ్స్ మాఫియా ఆగడాలు మరో ప్రధాన కారణం. అంటే అక్కడ కాంగ్రెస్ సొంత శక్తితో గెలిచింది అని చెప్పలేము. కాని అకాలీదళ్ , బిజెపి కూటమి ఓడింది అని మాత్రం ఖాయంగా చెప్పగలము.
ప్రధాని నరేంద్ర మోదీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే నినాదాన్ని దేశానికి అందించారు. దీని అర్థం ఏమిటో లోతుగా అధ్యయనం చేయవలసి ఉంది. ఇందులోని సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించవలసి ఉంది. 1947లో భారతదేశానికి విదేశీ వలసవాదుల నుండి విముక్తి లభించిన తర్వాత గాంధీజీ కాంగ్రెస్ పార్టీని రద్దుచేయవలసిందిగా పిలుపునిచ్చారు. అందుకు ఆనాటి అగ్ర నాయకులు అంగీకరించలేదు. ‘ఎంతో శ్రమపడి సాధించిన స్వాతంత్య్ర ఫలాలను మేము అనుభవించకపోతే ఎలా?’ అని చాలామంది నేతలు సూటిగా ప్రశ్నించారు. స్వాతంత్య్రం వచ్చాక నెహ్రూ కుటుంబ పాలన దశాబ్దాల పాటు ప్రజాస్వామ్యం పేరులోనే జరిగింది. దానిని ప్రజలు వౌనంగానే భరించారు. గాంధీజీ యుగంలో విలువలన్నీ క్రమంగా ఆవిరి అయిపోయాయి. అవినీతి రహిత రాజకీయాలు, నిరాడంబర జీవనం, కుటీర పరిశ్రమల అభివృద్ధి, గోమాత పూజ, సత్యవాక్య పాలన- ఇలా గాంధీజీ ప్రవచించిన ఆదర్శాలు ఒకటి కూడా 1947 తర్వాత అమలు కాలేదు. 1947లో అఖండ భారత్ ఇండియా, పాకిస్తాన్‌లుగా విడిపోయింది. దేశ విభజనకు కేవలం మతమే ప్రాతిపదిక. విభజన తర్వాత దేశంలో మత సమస్యలు పరిష్కారం కాలేదు సరికదా మత రాజకీయాల చుట్టూ దేశ రాజకీయాలు పరిభ్రమించాయి. ఈ కఠోర సత్యాలను మరచిపోయినట్లు నటించడం హిపోక్రసీ అనిపించుకుంటుంది.
1948లో తెలంగాణలో రజాకార్లు చేసిన విధ్వంసం ప్రపంచ చరిత్రలోనే మరచిపోలేని పీడకల. మతోన్మాద మజ్లిస్ పార్టీతో స్థానిక పార్టీలు చేతులు కలిపి ఓట్లు దండుకున్నాయి. పంజాబ్‌లో బింద్రన్‌వాలా అనే వేర్పాటువాదికి నారుపోసి నీరు పోశారు. ‘ప్రత్యేక తమిళ ఈలం’ కావాలనే కరుణానిధి ఎల్‌టిటిఇ అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్‌తో పొత్తు పెట్టుకున్నాడు. కేరళలో మల్లపురం జిల్లాను ఇస్లామిక్ మత ప్రాతిపదిక మీద నిర్మించారు. ఇలా ఎక్కడికక్కడ దేశ భద్రతను తాకట్టుపెట్టారు. సాహిత్య అకాడమీ, సాంస్కృతిక కళా విద్యా రంగాలను కమ్యూనిస్టులకు అప్పగించారు. ఇదంతా గాంధీ యుగం తర్వాతి చరిత్ర.
పదవిని అనుభవించటం మొదలుపెట్టాక దానిని నిలుపుకోవటం కోసం రాజకీయ పార్టీల నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. అది సహజం. సంపాదనే లక్ష్యంగా ఉన్నవారు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత భారతదేశం నుండి లక్షల కోట్ల రూపాయల నిధులు విదేశీ బ్యాంకులకు తరలిపోయాయి. దేశభద్రతను తాకట్టుపెట్టి రక్షణ రంగంలో నాసిరకం కొనుగోళ్లను చేసి కొందరు నేతలు భారీ కమీషన్లు దండుకున్నారు. దీనిని కమ్యూనిస్టులు వ్యతిరేకించలేదు సరికదా- ‘అవినీతి అసలు సమస్యే కాదు, హిందూ మతోన్మాదమే ప్రధాన సమస్య’ అని గతంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబసు బహిరంగంగా ప్రకటించారు. జిహాదీ ఉగ్రవాదులు బొంబాయి, అహమ్మదాబాద్, వారణాసి, హైదరాబాద్ వంటి చోట్ల ప్రత్యక్షంగా బాంబుదాడులు జరుపుతుంటే- ‘హిందూ మతోన్మాదం నశించాలి’ అని సురవరం సుధాకర్‌రెడ్డి వంటి కమ్యూనిస్టు నాయకులు పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. కాంగ్రెస్ అసమర్థ పాలనను కమ్యూనిస్టులు అడ్డుపెట్టుకుని నెహ్రూ, ఇందిర, సోనియా గాంధీలతో ఒప్పందాలు చేసుకుని తమ సొంత ఎజెండాలను అమలు చేశారు. ఇదీ ఆధునిక భారతదేశ చరిత్ర.
నరేంద్ర మోదీ ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనే నినాదాన్ని అమలు చేయాలనుకున్నారు. తదనుగుణంగా రాజస్థాన్, యుపి, మహారాష్ట్ర, అస్సాం, బీహార్, మధ్యప్రదేశ్ వంటి ఉత్తర భారత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పేరు వినపడకుండా చేయటంలో సఫలీకృతులైనారు. అంతమాత్రాన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు భవిష్యత్‌లో ఉండవని ధీమాగా చెప్పలేము. తెలంగాణలో టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నా, కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలమైన పునాదులు ఉన్నాయి. డి.కె.అరుణ, జానారెడ్డి, ఉత్తమకుమార్‌రెడ్డి వంటి ప్రజాకర్షణగల నాయకులూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శాశ్వతంగా అదృశ్యం అయిందనే మాట నిజమే అయినా అక్కడి నాయకులు ఏమయ్యారు? కొందరు వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి జెండా కిందికి చేరిపోగా మరికొందరు తెలుగుదేశం, భాజపా శిబిరాల్లో చేరారు. దీనిని ‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనవచ్చునా? కాంగ్రెస్ అంటే కొందరు వ్యక్తులు కాదు- ఒక ప్రత్యేక సంస్కృతి. ఇస్లామిక్ వర్గాల సంతుష్టీకరణ కాంగ్రెస్ సంస్కృతిలో అంతర్భాగం. అది గాంధీజీ నుండి వస్తున్నదే. మణిశంకర అయ్యర్‌లు, దిగ్విజయ్‌సింగ్‌లూ ఈ ఎజెండాను తు.చ తప్పకుండా అమలు చేస్తున్నారు. అంటే ‘కాంగ్రెసు ముక్త’ అనే మాటకు స్వదేశీ భావనను జాగృతం చేయటం అని అర్థం. అంతేకాని కొన్ని చోట్ల కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పాటుచేసి తిరిగి కాంగ్రెస్ ఎజెండాను, భావజాలాన్ని అమలు చేయటం కాదు. సైద్ధాంతికంగా ఈ అంశాన్ని గుర్తించి తీరాలి.
ఎవరు అధికారంలో ఉంటే వారి పంచన చేరి పనులు చేయించుకోవడాన్ని ‘కాంగ్రెస్-కమ్యూనిస్టు సంస్కృతి’ అంటారు. నిజానికి తెలంగాణలో జరిగిందేమిటి? కెసిఆర్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం నాయకులు టిఆర్‌ఎస్‌లోకి చేరి వివిధ పదవులు అలంకరించటం ఈ సిద్ధాంతాన్ని బలపరుస్తున్నది. బిజెపి తన కాళ్లమీద తాను నిలబడి సిద్ధాంత ప్రాతిపదికపై ఎదగాలంటే తన కార్యకర్తలను తాను నిర్మించుకోవాలే కాని కాంగ్రెస్,కమ్యూనిస్టు కార్యకర్తలను ఆహ్వానించటం సరైన ఫలితాలను ఇవ్వజాలదు. ఇచ్చినా అవి తాత్కాలికమే.
‘సౌకర్యం’ కోసం ముఫ్తీ మహమ్మద్‌తో కాశ్మీరులో బిజెపి సంకీర్ణ సర్కారును ఏర్పాటుచేసినా ఆమె పాకిస్తాన్ అనుకూల వైఖరిని మానుకున్నదా? కనీసం ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించడానికి ఇష్టపడనివారు నేడు భారత రాజకీయాల్లో, వివిధ పార్టీల్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు, నేతలుగా చెలామణి అవుతున్నారు. ‘అంతర్జాతీయ యోగ’ దినోత్సవం నాడు సూర్య నమస్కారాలు చేయడానికి ఇష్టపడని మంత్రులు, ముఖ్యమంత్రులూ ఎందరో ఉన్నారు. ఈ పరిస్థితిలో బిజెపి తన ‘స్వదేశీ’ ఎజెండాను అమలుచేయడానికి ఇలాంటి విదేశీ అనుకూల శక్తులమీద ఆధారపడి బలం పెంచుకోవాలనుకోవడం ఆత్మహత్యా సదృశ్యమవుతుంది.
‘కాంగ్రెస్ ముక్త భారత్’ అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే, అది కొందరు వ్యక్తుల సమూహం కాదు. ఒక భావజాలం. ఇలాంటి ప్రత్యామ్నాయ భావజాలం మీద ఆనాడు ‘జనసంఘ్’ అవతరించింది. దాని పరిణామ రూపమే భారత జాతీయ జనతా పార్టీ. అధికారంలోకి రావాలనే తొందరలో కర్నాటకలో గాలి జనార్దనరెడ్డి సోదరుల మీద ఆధారపడితే ఏం జరిగిందో మనకు తెలుసు. కర్నాటక అసెంబ్లీలో బ్లూఫిలిమ్స్ తమ సెల్‌ఫోన్లలో చూస్తూ బిజెపి ఎంఎల్‌ఏలు పట్టుబడ్డారు. నిజానికి ఇది కాంగ్రెస్ వారు చేయవలసిన పని. బిజిపి ఎంఎల్‌ఏలు ఎలా చేశారు? ఆర్టికల్ 370ని రద్దుచేయటం, చైనా వస్తువులను నిషేధించటం, భారత సార్వభౌమాధికారం కోసం రాజీలేని పోరాటం చేయటం- భారతీయ జీవన మూల్యాలను పరిరక్షించటం, గోమాంసం ఉత్పత్తులను నిషేధించటం , అయోధ్య, మధురలలో రామమందిరం, కృష్ణ మందిరాలను నిర్మించటం మాత్రమే కాదు, దేశమంతటా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలి. పాకిస్తాన్ నుండి బెలూచిస్తాన్‌కు విముక్తి కలిగించాలి.
బిజెపికి తనదైన ఒక స్వంత ఎజెండా వుంది. అధికారం కోసం తొందరపడి- ఈ మూలసూత్రాలను అంగీకరించని వారిని పార్టీలో చేర్చుకుంటే ఏమవుతుంది? ‘కాంగ్రెస్ ముక్త భారత్’కు బదులు ‘హిందూ ముక్త భారత్’ను చూడవలసి వస్తుంది. కాంగ్రెస్ భావజాలానికి తిలోదకాలిచ్చి, నెహ్రూ కుటుంబ ఆనువంశిక పాలనను వదిలించుకొని, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, స్వామి వివేకానంద, దయానంద సరస్వతి, అరవిందుడు వంటి జాతినేతలు ప్రతిపాదించిన ‘సాంస్కృతిక జాతీయవాదాన్ని’ అంగీకరించినవారినే బిజెపి తన పార్టీలో చేర్చుకోవాలి. కాంగ్రెస్, కమ్యూనిస్టు కూటమి నేడు అవకాశవాదానికి పర్యాయపదాలు. అవకాశవాద రాజకీయాల నుంచి భారత ప్రజాస్వామ్యాన్ని విముక్తం చేయటం అంత సలభం కాదు. ఒకవేళ 2019లో కర్నాటకలో బిజెపి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ నుండి భారీగా వలసలు జరుగుతాయి. ఇందుకు ఎం.ఎస్.కృష్ణ ఇటీవల భాజపాలో చేరడం నాందీ ప్రస్తావన లాంటిది! అధికారమే పరమావధిగా ఫిరాయింపులు జరుగుతున్న నేపథ్యంలో ‘కాంగ్రెస్ రహిత భారత్’ (కాంగ్రెస్ ముక్త భారత్) ఎలా సాధ్యమవుతుంది?

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్