సబ్ ఫీచర్

డంగరీతో టింగురంగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నచ్చినట్టుగా డ్రెస్‌లు వేసుకుంటేనే ఇపుడు ఫ్యాషన్. ఈ ఫ్యాషన్ కళ ర్యాంప్‌ల మీద నుంచి రావటం లేదు. కాలేజీలు, సినిమా తారల స్ఫూర్తితో ట్రెండ్‌లో మార్పులు చేసుకుంటున్నారు. తమ ఆహార్యంలో వాతావరణ మార్పులకు అనుగుణంగా ఆహార్యాన్ని మార్చుకుంటున్నారు. వర్షాలు, చలిని తట్టుకునేలా దుస్తులను డిజైన్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు డంగరీ (పట్టీల లాగు) చిన్న పిల్లలకు సౌకర్యవంతంగా ఉంటుందని వేసేవారు. కాని ఈ డంగరీ డ్రెస్ నేడు ఫ్యాషన్‌గా మారింది. సినిమా తారలు ఎక్కువ మంది వీటినే ధరిస్తున్నారు. యామీ గౌతమి, కత్రినాకైఫ్, ప్రియాంక చోప్రా, జోహన్నా, శ్రీయాచోప్రా వంటివారు ఎంతో మక్కువగా ధరిస్తూ చిన్నపిల్లలుగా మారిపోతున్నారు. ఇవి ధరించటం వల్ల చిన్నపాటి నవ్వు పెదాలపై మెరిసినా చూడచక్కగా ఉంటున్నాయి.్ఫంక్షన్లలో వేసుకునే ఈ డంగరీ డ్రెస్‌లు స్టైల్‌గా.. కూల్‌గా ఉంటున్నాయి. వీటిలో ఎన్నో రకాలు ఉన్నాయి. లూజ్-్ఫట్, రిలాక్స్‌గా, షార్ట్స్, స్కర్ట్స్ వంటివాటిని ఎంపిక చేసుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్‌లలో వీటిని చూడచక్కగా డిజైన్ చేసి ప్రదర్శిస్తున్నారు. క్యాజువల్‌గానూ వేసుకోవచ్చు. డంగరీ డ్రెస్స్‌తో పాటు టోపీ, సన్‌గ్లాసెస్, హీల్స్, బంగారు చెవిపోగులు ధరిస్తే చాలు ఆధునికంగా కనిపిస్తారని అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ అర్చన కొచ్చార్. డంగరీని తెల్ల టీషర్ట్‌తో వేసుకుంటే మరింత ఆకర్షణీయంగా ఉంటారు. సాదా బ్లాక్ డంగరీ స్టైల్‌గా ఉంటుంది. దీనితో పాటు బూట్లు లేదా చెప్పులు వేసుకున్నా బాగుంటారు. జుట్టును వదిలేసి సింపుల్ మేకప్ వేసుకుంటే సరిపోతుంది.