సబ్ ఫీచర్

టమోటా రైతుల కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతి మనిషి నిత్యజీవితంలో ఉదయం లేవగానే అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంలోకి కూరగాయల అవసరం ఎంతో ఉంటుంది. అలాంటి కూరగాయల్ని పండించే రైతులు నేడు విలవిలలాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని రైతులు కూరగాయల్ని పండించి ప్రస్తుతం ఎంతో నష్టపోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలోని రైతులు క్వింటాళ్ళకు క్వింటాళ్ళు తగిన ధర లేక తెంపి పారబోస్తున్నారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో టమోటా ఉల్లి రైతులు ధరలు లేక నష్టపోతున్నారు. ఆరుగాలం శ్రమకోర్చి పండించిన టమోటాలకు మార్కెట్‌లో సరైన ధరల లేకపోవడంతో రైతులు విలవిలలాడుతున్నారు. ఒకప్పుడు రూ.70నుండి రూ.80 వరకు పలికిన కిలో టమోటా ధర ప్రస్తుతం మార్కెట్‌లో హోల్‌సేల్ ధర మూడు రూపాయలే ఉంది. రిటైల్ ధర నాలుగైదు రూపాయలు మాత్రమే ఉంది. అలాగే ఉల్లి ధర ఒకప్పుడు 50 రూపాయలు ఉండేది. ఉల్లి ధర కూడా తగ్గుముఖం పట్టడంతో ఉల్లి రైతులు మార్కెట్‌లో 10 రూపాయల నుండి కొన్నిచోట్ల 5రూపాయలే కిలో ఒక్కింటికి పలుకుతోంది. మార్కెట్‌లో తక్కువ ధరకు లభించిన రెండు కిలోలకు మించి ఎవరు కొనుగోలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో మార్కెట్‌లో వ్యాపారులు సరైన ధర పెట్టకపోవడంతో ఆందోళన చెందిన కొంతమంది రైతులు రోడ్డుపై పడవేసి వెళ్ళిన సంఘటనలు ఉన్నాయి. పెట్టుబడిమాట దేవుడెరుగు కానీ, తోటలోని టమోటాలను తెంపడానికయ్యే కూలీ రేటుకూడా గిట్టుబాటు కావడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లోని కొన్ని మండలాల్లోని గ్రామాల్లో రైతులు వరి, పత్తి పంటలతో సమానంగా కూరగాయ పంటలు సాగుచేస్తున్నారు. గతంలో టమోటా ధరలు పెరిగిన దృష్ట్యా, ఈ యేడాది కూడా మంచి డిమాండ్ ఉంటుందని భావించిన రైతులు సాగు విస్తీర్ణం పెంచారు. ఈ నేపథ్యంలో ఉత్పత్తి పెరగటంతోపాటు ఇతర ప్రాంతాలనుండి కూడా తక్కువ ధరలకు టమాటా అందుబాటులోకి రావడంతో మార్కెట్‌లో టమోటా ధర గణనీయంగా పడిపోయింది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టిపెట్టిన రైతులకు టమోటా ధరలు లేకపోవడంతో మరో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కొంతమంది రైతులు జిల్లాల్లోని ప్రధాన రోడ్లవెంట చిన్న పరదాలు వేసుకొని అటునుండి పంటనుండి తెంపి రోడ్డు ప్రక్కనే పోసి అమ్ముతున్నారు. ఎందుకంటే తెంపిన కూలీ రావడంలేదని పంట ప్రక్కనే రోడ్లపై పోసుకొని రోజంతా ఎండలో అమ్ముతున్నారు. కష్టాన్ని నమ్ముకున్న రైతులను ప్రకృతి కరుణించకపోగా, మార్కెట్‌లో ధరలు లేక తీరని నష్టానికి గురిచేస్తున్నారు. టమోటా, ఉల్లి రైతుల పట్ల స్పందించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉన్నదని వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని రైతు సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి.

- గుండు రమణయ్య