సబ్ ఫీచర్

సులభ ప్రచారం పొందుతున్న ఒవైసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసదుద్దీన్ ఒవైసీ ఏదో అన్నాడని దానిమీద ఇంత రభస అవసరమా? - ఆయన మానాన దాన్ని వదిలేసి ఉంటే ఇంత ప్రాముఖ్యం లభించేది కాదు. ఆ తరువాత దాని గురించి ఎవరూ పట్టించుకుని ఉండేవారుకాదు. రజాకార్ల కాలంలో రాష్ట్ర ప్రధానిగా పనిచేసిన మీర్ లాయక్ అలీ పోలీసుచర్య తర్వాత గృహ నిర్బంధంనుంచి తప్పించుకుని పాకిస్తాన్ పారిపోయాడు. ఈ సంగతి విన్న సర్దార్‌పటేల్ దీన్ని ఏదో రోజుజరిగే వ్యవహారంగా తీసుకొని ఏ చర్యాతీసుకోలేదు. కొన్ని రోజులు తరువాత లాయక్‌అలీ కరాచీలో అప్రధానమైన వ్యక్తిగా మరణించాడు. అతని మరణంపై కన్నీరు పెట్టినవారు ఎక్కడా కనిపించలేదు.
1906లో స్వదేశీ ఉద్యమం వచ్చింది. దీని మారుపేరే వందేమాతరం ఉద్యమం. వందేమాతరం గీతం ‘ఆనందమఠ్’అనే నవలలో ఉంది. ఆ నవల బ్రిటిష్ ప్రభుత్వం మీద తిరుగుబాటుచేసిన ఒక సన్యాసుల మఠం కథ. ఆ నవల రచించిన మహానుభావుడు బంకించంద్ర చటర్జీ. ఆ గీతం మహామంత్రమైంది. భారతీయ ప్రజాస్వరోజని తపస్సులో మూలమంత్రమైంది. బెంగాల్‌లో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమం క్రమక్రమంగా దేశమంతటా వ్యాప్తిచెందింది. బెంగాలీలు మన సోదరులే కాబట్టి వారు ప్రారంభించిన ఉద్యమానికి మనం చేయూతనివ్వాలని. అది మన ధర్మమని భారతదేశంలోని అన్నిప్రాంతాల ప్రజలు భావించారు. దక్షిణాన ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఆ ఉద్యమం బాగావ్యాపించి ప్రజలలో గొప్ప చైతన్యం కలిగించింది. ఎందరో యువకులు వందేమాతరం ఉద్యమంనుంచి స్ఫూర్తిపొందారు. వందేమాతరం అనే పాట జాతీయ గీతమైంది. ప్రార్థనా గీతమైంది. ఆ గీతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో పాడుతూనే ఉన్నారు. హైదరాబాద్ రాష్ట్రంలో వందేమాతరం గీతం రావడానికి మరో ముప్ఫయి సంవత్సరాలు పట్టింది.
ఆ రోజుల్లో హైదరాబాద్ సంస్థానం అంతటా పాఠశాలల్లో ప్రతిరోజు ఉదయం తరగతులు ప్రారంభంకావడానికి ముందు నిజాం రాజుని కీర్తిస్తూ ప్రార్థనాగీతం పాడటం జరిగేది. అది ఇలా ఉండేది. ‘తా అబ్ద్ కాలిక్ ఆలమ్ ఏ రియాసత్ రఖ్ఖే/ తుజక్ ఉస్మాన్ బస్ద్ ఇజ్లీత్ సతామత్ రఖ్ఖే’... భగవంతుడు నిజాం రాజ్యాన్ని చల్లగా చూచుగాక. అలా నిజాం రాజుకు శుభములు చేకూర్చుగాక’ అనేని ఈ గీతం తాత్పర్యం. జాతీయోద్యమం ప్రభావం, స్టేటు కాంగ్రెస్ సత్యాగ్రాహోద్యమం ప్రభావంవల్ల విద్యార్థులు వందేమాతరం గీతాన్ని పాడసాగారు. నిజాంరాజు ప్రార్థన గీతం పాడటం నిరాకరించిన విద్యార్థులను అధికారులు పాఠశాలలనుంచి బహిష్కరించారు.
1938వ సంవత్సరంలో దసరా పండుగనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయం ‘బి’ హాస్టల్ విద్యార్థులు సమావేశమైనప్పుడు వందేమాతరం గీతం పాడుకున్నారు. ఆ తరువాత ప్రతిరోజూ రీడింగ్‌రూంలో సమావేశమైనప్పుడు వందేమాతరం గీతాన్ని మరికొన్ని భక్తిగీతాలను పాడుకోవడం మొదలుపెట్టారు. ఈ సమావేశాలలో ఎక్కువమంది హిందువులే ఉండేవారు. ఈ విషయం తెలిసి వసతి గృహం అధికారులు వందేమాతరం గీతం రాజకీయాలకు సంబంధించిందని విద్యార్థులు రాజకీయాలతో సంబంధం పెట్టుకోరాదని ఒక సర్క్యులర్ జారీచేశారు. విద్యార్థులెవరు ఈ సర్క్యులర్‌ని ఖాతరు చేయలేదు.
1937లో మిలాదున్నబి పండుగ ఉత్సవాల సందర్భంగా యూనివర్సిటీ హాస్టల్‌లో సభ జరిగింది. ఈ దేశంలో గోబర్ పరస్త్ (గోపేడను పూజించేవారు) 22కోట్ల మంది ఉన్నారంటే బాధ కలుగుతుందని వౌలానా నజీరుల్ హసన్ జీలానీ అనే దీన్యాత్ (మత శాస్త్రం) ప్రొఫెసర్ చేసిన ప్రసంగం హిందూ విద్యార్థులపై కారం చల్లినట్లు చేసింది. దీన్ని హిందువులు సహించలేకపోయారు. 1938 సెప్టెంబర్‌లో ‘ఏ’ హాస్టల్ విద్యార్థులు వందేమాతరం ఉద్యమం లేవదీశారు. 1938, నవంబర్ 28వ తేదీన వందేమాతరంపై నిషేధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ విద్యార్థులు దీన్ని ఖాతరుచేయలేదు. ఈ గీతం పాడేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వచ్చింది. దీని ఫలితంగా నవంబరు 29వ తేదీన హాస్టల్‌లో ఉంటున్న హిందూ విద్యార్థులను కళాశాలనుంచి బహిష్కరించారు. హాస్టల్ గదులను ఖాళీచేయవలసిందిగా ఉత్తర్వులు జారీచేసారు.
హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థుల పట్ల అధికారులు అనుచిత ప్రవర్తనపై విశ్వవిద్యాలయ విద్యార్థులు రెండురోజులు సమ్మెకు దిగారు. అందులో అధిక సంఖ్యాకులు హిందువులే. ఆ తరువాత యూనివర్సిటీ గేట్లముందు పికెటింగ్ జరిగింది. ఈ వార్త రాష్టమ్రంతటా పాకిపోయింది. నగరంలోని ఇతర కళాశాలల విద్యార్థులు, కొందరు ఉన్నత పాఠశాలల విద్యార్థులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఔరంగాబాద్, వరంగల్, గుల్బర్గా, పర్భనీ, నాందేడ్, మహబూబ్‌నగర్ జిల్లాల విద్యార్థులు సమ్మెలుచేసి తరగతులు బహిష్కరించారు. ‘వందేమాతరం’గీతం సంస్థానమంతటా మారుమ్రోగింది. పది రోజుల తర్వాత డిసెంబరు 10వ తేదీన సమ్మెలో పాల్గొంటున్న విద్యార్థులు తమ చర్యలకు క్షమాపణ పత్రం రాసి యిచ్చి తరగతులకు హాజరుకావచ్చని అధికార ప్రకటన వెలువడింది. క్షమాపణ పత్రం రాసిఇవ్వని విద్యార్థుల పేర్లు తీసివేయబడగలదని హెచ్చరికలు జారీఅయ్యాయి. ఈ హెచ్చరికలను విద్యార్థులు లెక్కచెయ్యలేదు. ఉద్యమం ఉధృతమైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కళాశాలల్లో చదువుకుంటున్న దాదాపు 350మంది విద్యార్థులను తొలగించారు. పి.వి.నరసింహారావు, అచ్యుతరెడ్డి, నూకల రామచంద్రారెడ్డి, సర్వదేవరభట్ల రామనాథం, వందేమాతరం రామచంద్రరావు మొదలైన యువకులు ఈ ఉద్యమంనుంచి వచ్చినవారే. ఎంతో ప్రయత్నంమీద నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కేదార్ వీరికి అడ్మిషన్లుఇచ్చారు. సైన్స్ విద్యార్థులకు నాగ్‌పూర్‌లో, ఆర్ట్స్ విద్యార్థులకు జబల్‌పూర్‌లో ప్రవేశాలు లభించాయి. స్టేటు కాంగ్రెస్ నాయకుల నుంచి వీరికి కొంత ఆర్థిక సహాయం లభించేది. వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులను అభినందిస్తూ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వంటి జాతీయ నాయకులు సందేశాలు పంపించారు. ప్రార్థనా సమావేశంలో దేశభక్తి గీతమైన వందేమాతరం పాడుకునే హక్కు భారతీయ విద్యార్థులందరికీ ఉందని మహాత్మాగాంధీ ప్రకటించారు. ఒవైసీ తెలివైన నేత తన ప్రచారంకోసం సులభమైన మార్గం ఎన్నుకున్నారు. దేశంలో కొన్నిరోజులు వార్తల్లోని వ్యక్తి అయ్యారు.

- జి.వెంకట రామారావు