సబ్ ఫీచర్

జీవిత పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొమ్మిదేళ్ల వయసులో బాధ్యతలేముంటాయ్ చెప్పండి.. ఆడుతు పాడుతూ ఆనందంగా సాగిపోయే సమయం. స్కూలు, హోంవర్కు, ఆట, పాట, టీవీ.. ఇంతకుమించి చేసేదేముంటుంది? కానీ ఆ అమ్మాయి ఏకంగా ఇంటి బాధ్యతనే తన భుజాలమీద వేసుకుంది. పొద్దున ఐదింటికి లేచి న్యూస్ పేపర్లన్నీ సైకిల్‌మీద పెట్టుకుని ఇల్లిల్లూ తిరిగి పేపర్ వేసింది. తండ్రి అకస్మాత్తుగా చనిపోతే ఇంటిల్లిపాదికీ పెద్ద దిక్కైంది.
రాజస్థాన్ జైపూర్‌కి చెందిన ఎరీనాకు పదేళ్లు నిండకుండానే జీవితం అంటే ఏంటో బాధపడింది. బతకడమంటే ఏంటో తెలిసొచ్చింది. ఏడుగురు అక్కా చెలెళ్లు, ఇద్దరు తమ్ముళ్ల బాధ్యతను నెత్తికెత్తుకుంది. తండ్రి న్యూస్‌పేపర్ వెండర్. అతనికి చేదోడు వాదోడుగా నిలిచింది. కొంతకాలానికే నాన్న చనిపోయాడు. దాంతో మొత్తం ఇంటి భారం చిన్నారిపైనే పడింది.
చదువుకోవాలని ఉన్నా ఆర్థిక పరిస్థితుల రీత్యా స్కూలుకి వెళ్లడం సమస్యగా మారింది. అయినప్పటికీ పనులన్నీ పూర్తిచేసుకుని బడికి వెళ్లేసరికి ఆలస్యమయ్యేది. చాలాసార్లు ప్రిన్సిపల్ మందలించేవారు. ఎప్పటికప్పుడు ఇకపై లేట్ అవదు అని సర్ది చెప్పేది కాని తప్పేది కాదు. ఆమె కష్టాన్ని అర్థం చేసుకోలేని ప్రిన్సిపాల్ చివరికి టీసీ ఇచ్చి బయటికి పంపారు.
చదువు లేకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులేంటో ఎరీనాకు తెలుసు. అందుకే రెహ్మానీ మోడల్ స్కూలుకి వెళ్లి ఇదీ తన పరిస్థితి అని వివరించింది. వాళ్లు ఆమె బాధను అర్థం చేసుకుని జాయిన్ చేయించుకున్నారు.
ఎరీనా తొమ్మిదో క్లాసులో ఉండగా ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. దాంతో ఆమె ఒక హాస్పిటల్‌లో నర్సుగా చేరింది. మూడేళ్లు అక్కడ జాబ్. ఎందుకంటే తన తోబుట్టినవాళ్ల చదువు ఆగిపోకూడదు. వాళ్లకోసం కష్టమైనా ఉద్యోగం చేసింది. జాబ్ చేస్తూనే ప్రాధమిక విద్య పూర్తి చేసింది. ఆ తర్వాత ఓ ప్రయివేట్ కాలేజీలో చేరింది. ఇటు ఉద్యోగం ఫుల్ టైం.. అటు క్లాసులు పార్ట్‌టైం.
పసితనం నుంచే జీవితంతో పోరాడుతున్న ఈ ధైర్యవంతురాలిని చూసి ముచ్చపడ్డ హైకోర్టు జడ్జి మనీష్ భండారి శ్రీ రాజీవ్ అరోరా ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ఎక్స్‌పోర్ట్ వారి నుంచి బ్రేవరీ అవార్డు ఇప్పించారు. ఆ తర్వాత కిరణ్ బేడీ చేతులమీదుగా మరో పురస్కారం దక్కింది.
ప్రస్తుతం ఎరీనా రాజస్థాన్‌లో ప్రముఖ వ్యపారవేత్తలు నడిపిస్తున్న సంస్థ ఫెడరేషన్ ఆఫ్ రాజస్థాన్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తరఫున పనిచేస్తోంది.