సబ్ ఫీచర్

సంక్షేమం.. విపక్షాల సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాస్వామ్య విధానంలో ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే తప్ప మరొకరికి కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతోంది ఏమిటి? అధికార పార్టీ తమకు (ప్రతిపక్షాలకు) జవాబుదారీగా ఉండాలని విపక్షాలు ఉబలాటపడుతున్నాయనిపిస్తోంది. ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం చేపట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమం చేపట్టినా పరిపరివిధాలా ప్రయత్నిస్తున్నాయి. బహిరంగ సభలు ఏర్పాటు చేసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం, మీడియా సమావేశాల్లో ప్రభుత్వాన్ని విమర్శించడం, ధర్నాలు, నిరసన ఊరేగింపులు, రాస్తారోకోలు ఇలా.. అనేక రూపాల్లో ఆందోళనలు చేస్తున్నారు. చట్టసభలను స్తంభింప చేయడం, చివరకు న్యాయవ్యవస్థను కూడా రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం పరిపాటైంది. అందుకే కాబోలు ఇటీవల ఒక రాజకీయ నాయకుడు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి తీవ్రంగా స్పందిస్తూ.. ‘కోర్టును మీరు రాజకీయ అవసరాలకోసం వాడుకోవాల’ని ప్రయత్నిస్తున్నారా? అంటూ ప్రశ్నించడం గమనార్హం.
తెలంగాణలో ‘బతుకమ్మ’ పండగ పెద్ద పండగ. ప్రతి ఆడపడచు ‘బతుకమ్మ’ పండగలో పాల్గొనడం సాంప్రదాయంగా మారింది. ఈ పండగ సందర్భంగా తెలంగాణ ఆడపడచులకు చీరెల పంపిణీని తెరాస ప్రభుత్వం చేపట్టింది. ఇంగ్లీషులో ‘సమ్‌థింగ్ ఈజ్ బెటర్‌దేన్ నథింగ్’ అన్న నానుడి ఉంది. మహిళలకు ఎలాంటి చేయూత ఇవ్వని గత అరవై ఏళ్లకంటే బతుకమ్మ పండగపేరుతో ఒక చీర బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించడం మంచిదే కదా! ఒకవేళ ప్రభుత్వం చేపట్టే పథకాల్లో, కార్యక్రమాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవచ్చు. పంపిణీ చేసిన చీరల్లో నిజంగా నాణ్యత లేకపోతే దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంది. అంతే తప్ప చీరల పంపిణీ చేయడమే తప్పు అన్న విధంగా పెద్దఎత్తున ప్రచారం చేశారు. కోటిమందికిపైగా మహిళలకు చీరల పంపిణీ జరిగితే ఎక్కడో ఒకరిద్దరు మహిళలు విమర్శించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు లేకపోలేదన్న భావన కలుగుతోంది. బతుకమ్మ చీరల విషయంలో విపక్షాలకు తెరాస నాయకులు, తెరాస శ్రేణులు గట్టి జవాబే చెప్పారు.
గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు చేయూత ఇచ్చేందుకు ‘రైతు సమన్వయ సమితి’లు ఏర్పాటు చేస్తేదానిపై విపక్షం నేతలు యాగీ చేశారు. కాంగ్రెస్ హయాంలో ‘ఆదర్శరైతుల’ విధానం చేపట్టిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఆదర్శరైతులను ‘నామినేట్’ప్రాతిపదికగానే ఆనాటి ప్రభుత్వం చేసిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. ఒక్కో ఆదర్శరైతుకు నెలకు వెయ్యిరూపాయల పారితోషికం కూడా ఇచ్చారు. ఇప్పుడు రైతు సమన్వయ సమితిల కోఆర్డినేటర్లకు గానీ, సభ్యులకు గానీ గౌరవవేతనం ఏదీ ప్రభుత్వం ప్రకటించలేదు. రైతులకు ఈ సమితులు బాసటగా ఉంటాయని మాత్రమే ప్రభుత్వం వెల్లడించింది. రైతులకోసం ఏర్పాటు చేసిన సమన్వయ సమితిలపై కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సాగునీటి పారుదల ప్రాజెక్టులు చేపడితే వాటిపై కోర్టులో దావాలు వేశారు. మహబూబ్‌నగర్ జిల్లా గత 60 ఏళ్లలో సాగునీటి మొహం చూడలేకపోయింది. వేర్వేరు ప్రాజెక్టుల ద్వారా సాగునీటిని ఈ జిల్లాకు అందించేందుకు ప్రయత్తిస్తే, దానిపై కోర్టుకు వెళ్లారు. అలాగే సాగునీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు తదితర వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వం సేకరించే భూములకు మంచిధర ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే, ఆ లాభం కూడా రైతులకు చేరకుండా ప్రయత్నించారు. పరిపాలనలో అనుభవం ఉన్న వారిని వివిధ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పథకాలకు ఉపయోగించుకునేందుకు వీలుగా ‘పార్లమెంట్ కార్యదర్శుల’ను నియమించుకుంటే దాన్ని రద్దు చేయించారు. ఇలా అడుగడుగునా ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు పథకరచన చేయడాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు.
ప్రజలే న్యాయ నిర్ణేతలు..
ప్రజలు తమకు ఇష్టం వచ్చిన వారికి సాధారణ ఎన్నికల్లో పట్టం కడతారు. చట్టసభలో మెజారిటీ లభించిన పార్టీ ఐదేళ్లపాటు పాలించేందుకు భారత రాజ్యాంగం అవకాశం ఇచ్చింది. అధికారంలో కొనసాగే పార్టీ ఐదేళ్లలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు చేపడితే ప్రజలు మళ్లీ అదే పార్టీకి మరో పర్యాయం అవకాశం ఇస్తారు. లేనిపక్షంలో సదరు పార్టీని ఇంటికి పంపిస్తారు. అయితే అధికారం చేపట్టిన పార్టీని ఐదేళ్లపాటు సజావుగా పాలన కొనసాగనివ్వకుండా అడుగడుగునా ఎవరైనా అడ్డుకోవాలనుకుంటే అది ప్రజాస్వామ్య విధానం కాదు.
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) 2014 లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. సమైక్య రాష్ట్ర విభజనలో తెరాస చేసిన కృషి అంతా ఇంతా కాదు. పనె్నండేళ్ల పాటు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. పనె్నండేళ్ల కాలంలో తెరాస పార్టీ నుండి వివిధ పదవులకు ఎన్నికైన వారిని ఆనాటి అధికార పార్టీ తమ పార్టీలో చేర్చుకుని, తెరాసకు మంచినీళ్లు కూడా పుట్టకుండా చేయాలని శతవిధాలా ప్రయత్నించింది. ప్రజాస్వామ్య విధానంలో ఆందోళనలు చేపడితే ఉక్కుపాదంతో అణచివేసేందుకు అహరహం కృషి చేసింది. ‘తెలంగాణ’ అన్న పదాన్ని కూడా చట్టసభల్లో పలకకుండా శతవిధాలా ఘనత గతంలో అధికారంలో ఉండి, తెలంగాణలో ఈనాడు విపక్షాల్లో ఉన్న పార్టీలు దక్కించుకున్నాయి.
తెలంగాణ ప్రజలు అనేక కష్టనష్టాలకు లోనై తెలంగాణ రాష్ట్రం సాధించుకుని కేవలం మూడంటే మూడేళ్లు పూర్తయ్యాయి. 1956 లో తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి కావలసిన కృషి జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన తెరాసను ఐదేళ్లపాటు పనిచేసేందుకు ఆటంకాలు కలిగించకపోతే బాగుండేది. అధికార పార్టీ తప్పు చేస్తే ప్రజలే శిక్షిస్తారు కదా! మధ్యలో విపక్షాల అవసరం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది.
ప్రజాస్వామ్య విధానంలో విపక్షాలది కీలకమైన భూమిక. ప్రభుత్వం నిజంగా తప్పు చేస్తే ఎత్తి చూపించవచ్చు. తప్పు సరిదిద్దుకునేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడం సరికాదు. అసలు తప్పే జరగకపోతే నానా యాగీ చేయడం వల్ల ప్రజల్లో చులకన అవుతారు. అధికారంలోకి రావాలని రాజకీయ పార్టీలు ప్రయత్నించడం తప్పు కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపార్టీ కూడా అధికారం చేపట్టేందుకు తహతహ లాడుతుంటాయి. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా ఏం చేస్తున్నారో ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. ‘సరైన సమయంలో సరైన నిర్ణయం’ తీసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తుంటారు. ప్రజల మన్నన చూరగొనేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తే మంచిది. దుందుడుకుపోకడల వల్ల మంచికన్నా కీడే ఎక్కువ జరుగుతుందన్న విషయం గమనించాలి.

-పి.వి. రమణారావు 98499 98093