సబ్ ఫీచర్

అంధులకు ఆసరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటిచూపు సరిగ్గా లేక దైనందిన కార్యక్రమాలను చేసుకోవడానికి కూడా ఇతరులపై ఆధారపడేవారికి ఆసరాగా ఉండేందుకు సృష్టించిన చేతికర్రను ‘వైట్‌కేన్’గా పిలుస్తారు. అది కనిపెట్టిన సందర్భానికి గుర్తుగా ఏటా అక్టోబర్ 15న ‘వైట్‌కేన్ డే’ పాటిస్తారు. నిజానికి ఇది అమెరికాలో మొదట మొదలైంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దీనిని నిర్వహిస్తున్నారు. ప్రమాదాలకు గురికాకుండా తమ సాధారణ పనులు తామే చక్కబెట్టుకునేందుకు మార్గదర్శిగా ఈ వైట్‌కేన్ స్టిక్ ఉపకరిస్తుంది. ఆధునిక సాంకేతిక పరికరాలను దీనికి జోడించి మరింత ఉపయోగకరంగా ఉండే మార్పులు చేర్పులు చేసి అందుబాటులోకి తీసుకురావడంతో అంధులకు నిజంగానే అది మార్గదర్శిగా మారిపోయింది. ఈ వైట్‌కేన్‌కు మరికొన్ని సాంకేతిక మార్పులు జోడించి వారికి మరింత ప్రయోజనకరంగా ఉండే స్మార్ట్‌కేన్‌ను రూపొందించిన ఘనత మనదే. ప్రపంచ దేశాలలో అంధుల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ అగ్రభాగాన ఉంది. ఆసియా, ఆఫ్రికాలోని సహారా ప్రాంత దేశాల్లో దృష్టిదోషంతో బాధపడుతున్నవారి సంఖ్య అధికంగా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం మూడు మీటర్ల దూరం నుంచి చేతివేళ్లను సరిగ్గా లెక్కపెట్టలేకపోతే వారికి అంధత్వం ఉన్నట్లు లెక్క. అయితే భారత్‌లో ఆ ప్రమాణాలకు భిన్నమైన పరిస్థితులు మొన్నమొన్నటివరకు ఉండేవి. మనదేశంలో ఆరు మీటర్ల దూరం నుంచి చూసి చేతివేళ్లను లెక్కపెట్టలేకపోతేనే అంధత్వం ఉన్నట్లు పరిగణించేవారు. అయితే ఇటీవల ఈ నిబంధనలను సవరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణానే్న మనమూ పాటించాలని నిర్ణయించారు. అందువల్ల అంధుల సంఖ్య తగ్గుతుంది. అయినప్పటికీ మనదేశంలో అంధులు ఎక్కువే. అంధుల జీవితాల్లో చీకటిని తరిమేయడమే అసలు లక్ష్యం. మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో, సౌకర్యంగా వారి పనులు చేసుకోవడం, వారు నడచివెళ్లే మార్గంలో ఉండే అడ్డంకులను గుర్తించడానికి, ప్రమాదాల గురించి హెచ్చరించడానికి ఈ వైట్‌కేన్, స్మార్ట్‌కేన్ ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. ఢిల్లీ ఐఐటి పరిశోధక విద్యార్థుల బృందం ఈ స్మార్ట్‌కేన్‌ను రూపొందించింది. వైట్‌కేన్‌కన్నా అధునాతన పరిజ్ఞానంతో దీనిని రూపొందించారు. వైట్‌కేన్‌ను బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ జేమ్స్‌బిగ్స్ కనుగొన్నాడు. మొదట్లో నల్లనిరంగు స్టిక్ ఉండేది. అయితే ఓ అంధుడు ఆ నల్లటి స్టిక్‌తో రోడ్డు దాటుతున్నప్పుడు వాహనాలపై వెళ్లేవారు గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగింది. దీంతో ఆ స్టిక్‌కు తెల్లరంగు వేసి, అడుగుభాగంలో ఎర్రరంగు వేయడం మొదలైంది. అప్పటి నుంచి దీనిని వైట్‌కేన్‌గా పిలవడం ప్రారంభించారు. 1921 నుంచి ఇది వాడకంలోకి వచ్చింది. అమెరికాలో వీటి వాడకం కోసం చట్టాన్ని చేశారు. ఎయిర్‌పోర్టుల్లో కూడా వీటి వాడకానికి ఆమోదం తెలిపే అవకాశం కల్పించారు. మూడు మీటర్ల దూరంలోని అడ్డంకులు, కొమ్మలు, రాళ్లు, ఎవరైనా ఉంటే తరంగాల ద్వారా వైట్‌కేన్ పైన ఉన్న కేప్ కదలికలను బట్టి దానిని వాడే అంధుడు గుర్తించి ముందడుగు వేస్తాడు. మోకాలి పైభాగంకన్నా దిగువున ఉండేవాటిని గుర్తించడం వీలయ్యేది. అయితే చుట్టుపక్కల, పైభాగంలో ఉండే కొమ్మలు, ఇతర అడ్డంకులను గుర్తించడం సాధ్యమయ్యేది కాదు.
స్మార్ట్‌కేన్‌తో సౌలభ్యం
అంధులకు మరింత ఆసరా కల్పించే దిశగా పరిశోధనలు మొదలుపెట్టారు. ఆ సమయంలో ఢిల్లీ ఐఐటి విద్యార్థులు సెన్సార్ డివైజ్‌తోకూడిన కాప్‌ను పెట్టి స్మార్ట్‌కేన్‌ను రూపొందించారు. చౌకగా, మడచిపెట్టేందుకు వీలుగా, నేలపైనే కాకుండా చుట్టుపక్కల ఉండే అడ్డంకులను గుర్తించగలిగే విధంగా ఈ స్మార్ట్‌కేన్‌ను రూపొందించారు. అసిస్టోటెక్ స్వస్చంద సంస్థ వీరికి అండగా నిలిచింది. రోడ్స్-ఆక్స్‌ఫర్డ్ సంస్థలు వీరికి సహకరించేందుకు ముందుకు వచ్చాయి. ది వెల్‌కమ్ ట్రస్ట్ 450,000 పౌండ్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. వీరందరి కృషితో 2014 నాటికి స్మార్ట్‌కేన్ సిద్ధమైంది. కేవలం 3 వేల రూపాయలకే అది లభిస్తుంది. ఈ స్మార్ట్‌కేన్ పైభాగంలో ఉండే సెన్సార్ ద్వారా ఎదురుగా మోకాలికన్నా తక్కువ ఎత్తులో ఉండే అడ్డంకులను గుర్తించి తెలియచేస్తుంది. కారిడార్లు, అపార్టమెంట్లలో నడిచేటప్పుడు తెరచి ఉన్న కిటీకీలు, బయటకు ఉన్న ఎసి మిషన్లు, విస్తరించిన కొమ్మల వంటి అడ్డంకులకు సంబంధించిన విషయం కూడా గుర్తించేలా సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన డివైస్‌ను ఈ స్టిక్‌కు అమర్చారు. అంధులైన మహిళల కోరిక మేరకు ఈ స్టిక్‌ను మడతపెట్టి చేతిపర్సులో దాచుకునేంత నాజూకుగా కూడా తయారు చేసిన స్మార్ట్‌కేన్‌లు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీపేంద్ర మకోచ్, ప్రొఫెసర్ బాలకృష్ణన్‌లు రోహన్ పాల్ సారధ్యంలో స్మార్ట్‌కేన్‌ను రూపొందించడంలో పాలుపంచుకున్నారు. ఈ స్మార్ట్‌కేన్‌ల ప్రమాణాలను, పనితీరును, ప్రయోజనాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన ఐరోపా, అమెరికా వారి దేశాల్లో కూడా వీటిని వాడేందుకు సిఫారసు చేశాయి. మనదేశంలో 16 సంస్థల ద్వారా 12 రాష్ట్రాల్లో వాటిని విక్రయిస్తున్నారు.
ఇదీ లక్ష్యం
ప్రపంచంలోని దాదాపు 150 దేశాల్లో వైట్‌కేన్ డే పాటిస్తారు. అంధత్వ సమస్య, అంధులు స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో, భద్రమైన జీవితాన్ని గడిపగలిగే పరిస్థితులను కల్పించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంధత్వ నివారణ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేస్తారు. ప్రపంచం మొత్తంమీద 34 మిలియన్లమంది అంధులు ఉన్నట్లు అంచనా. ఏటా 17.9 శాతం మేరకు అంధుల సంఖ్య పెరుగుతోంది. భారత్‌లో 1990 నాటికి 7.2 మిలియన్ల మంది అంధులు ఉన్నారు. 2015 నాటికి ఆ సంఖ్య 8.8 మిలియన్లకు చేరుకుంది. 2050 నాటికి 115 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. అయితే అంధత్వ సమస్యను పరిష్కరించాలన్నది విస్తృత లక్ష్యం. అంధుల సంఖ్య రేటును గణనీయంగా తగ్గించేందుకు బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. గడచిన కొన్ని సంవత్సరాలుగా తీసుకున్న చర్యల ఫలితంగా కంటి శస్త్ర చికిత్సలు బాగా పెరిగి కంటి సమస్యల నుంచి బయటపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పైగా మనదేశంలో అంధత్వ నిర్ధారణ పరీక్షల నిబంధనల్లో మార్పులు చేయడం వల్ల అంధుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలలో మార్పు అనివార్యంగా కనిపిస్తుంది. స్మార్ట్‌కేన్ రూపొందించడంలో ఫోనిక్స్ మెడికల్ సిస్టమ్స్ సంస్థ కూడా అద్భుతమైన సహకారాన్ని అందించింది. వైట్‌కేన్ ద్వారా కేవలం మూడు అడుగుల దూరంలో అడ్డంకులను గుర్తించే వీలుంది. స్మార్ట్‌కేన్ ద్వారా మూడు మీటర్ల దూరంలో ఉండే అడ్డంకులను గుర్తించే వెసులుబాటు ఉంది. దీనికి అమర్చిన సాంకేతిక పరికరాల వల్ల అడ్డంకి ఉన్న దూరం, దాని గట్టితనం, చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మోకాలికన్నా ఎతె్తైన అడ్డంకులు ఎంత దూరంలో ఉన్నాయన్న వివరాలు అందించగలుగుతాయి. సెన్సార్‌లు, త్రిడి ఇమేజింగ్ పరికరం వంటివన్నీ ఈ స్మార్ట్‌కేన్‌కు ఉంటాయి. మొత్తంమీద గతంకన్నా ఆత్మవిశ్వాసం, స్వతంత్రంగా, ఎవరి సహాయం లేకుండా అందరిలా బయటకు వెళ్లి పనులు చక్కబెట్టుకునే వెసులుబాటు వీటివల్ల అంధులకు కలిగింది. అది వారికి కొండంత ఆసరా ఇస్తోంది.

- భారతి