సబ్ ఫీచర్

చిరు దివ్వెల సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపావళికి ఇంటిని ఆకర్షణీయంగా, అందంగా అలంకరించాలంటే కొంత శ్రద్ధ పెట్టాల్సిందే. గతంలో మట్టి ప్రమిదలను ఎక్కువగా ఉపయోగించేవారు. ఇపుడు కొవ్వొత్తి ప్రమిదలే ప్రధాన ఆకర్షణగా కనిపిస్తున్నాయ. పేపర్‌తో తయారుచేసిన కొవ్వొత్తి ప్రమిదలు ఇంటికి నిండుదనాన్ని అందిస్తున్నాయ. పేపర్‌తో అందంగా చేసిన ఈ దీపాన్ని చూడండి ఎంత ముచ్చటేస్తోంది. పండుగకు కొన్ని రోజులు ముందుగానే ఇళ్లకు పెయంటింగ్‌లతో ముస్తాబు చేస్తారు. ఇంటి లోపల గోడలను సింపుల్‌గా స్టిక్కర్లతో ముస్తాబు చేసుకోవచ్చు. వాల్ పేపర్ల స్టెన్సిల్స్‌తో వివిధ డిజైన్లలో అతికించుకోవచ్చు. వీటికి పెద్ద ఖర్చు అవదు. ఇంటి ముందు ఆకర్షణీయమైన రంగోలి డిజైన్లు వేసుకుంటే పండుగకు ఇంటికి వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు వుంటుంది. గది మూలల్లో ఎక్కువ స్థలం నిరుపయోగంగా ఉంటుంది. ఈ స్థలాన్ని సద్వినియోగం చేసుకుంటూ అందమైన లైటింగ్‌ను ఏర్పాటుచేసుకుంటే వెలుగులు చిమ్ముతాయ. అందంగా ఉన్న ఈ ప్రమిదల సెట్‌ను ఎంత చక్కగా పెయింట్ చేశారో చూడండి. ఈ ప్రమిదలలో అన్ని రంగులు మేళవించి ఉన్నాయ. బంగారం వర్ణంతో డిజైన్ చేసిన మెటల్ ప్రమిదలు కూడా మార్కెట్లోకి వచ్చాయ. కుండ సైజులో ఆరెంజ్, పసుపు రంగుల్లో మెరిసే కొవ్వొత్తి దీపాల సెట్ కూడా ఇంటిని ప్రకాశవంతంగా చేస్తుంది. మట్కీ శైలిలో ఉన్న దీపాల సెట్ కూడా తక్కువ ధరకే వస్తుంది. టెర్రకోటతో విభిన్న రంగుల్లో దీపాల సెట్ అతివలను ఆకట్టుకుంటుంది. పూల ఆకారంలో తయారుచేసిన ఈ అలంకరణ కొవ్వొత్తుల సెట్ ధగధగా మెరుస్తోంది. మరింకెందుకు ఆలస్యం గది గదినీ, మూల మూలను అందంగా అలంకరించండి.