సబ్ ఫీచర్

మహిళా విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న తాగుడుపై మహిళల పోరాటం విజయవంతమైంది. రాజస్థాన్‌లోని కచ్చాబాలే అనే గ్రామం మద్య నిషేధంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈ గ్రామ సర్పంచ్ సీతాదేవి లేవదీసిన ఉద్యమం విజయవంతమై అధికారులు గ్రామానికి వచ్చి మద్యం దుకాణాల మూసివేతపై ఓటింగ్ నిర్వహించాల్సి రావటం అతివల విజయంగా చెప్పవచ్చు. గ్రామం లో మద్యం దుకాణాలు ఉండాలా?వద్దా? అనే అంశంపై ఓటింగ్ నిర్వహించగా.. దాదాపు 2039 ఓట్లు దుకాణాల మూసివేతకు అనుకూలంగా పడ్డాయి. మద్యం మహమ్మారి వల్ల ఈ చిన్ని గ్రామంలో ఇప్పటివరకు 84 మంది చనిపోయారు. ఈ ఘటనలన్నింటినీ కళ్లారాచూసిన సీతాదేవి తాను సర్పంచ్ అవ్వగానే మద్యనిషేధానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని లేవదీసింది. ఓటింగ్‌లో మెజార్టీ అభిప్రాయం ప్రకారం మద్యం దుకాణాలను అధికారులు మూతవేశారు.