సబ్ ఫీచర్

శ్రుతి తప్పుతున్న క్రమశిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ‘దండన‘ తప్పనిసరి. కానీ ఇటీవలి కాలంలో వార్తలకెక్కుతున్న స్కూలు టీచర్ల మరియు యాజమాన్యాల క్రమశిక్షణా విధానాలు బహు విచిత్రంగా వుంటున్నాయి. చిన్న చిన్న క్షమార్హమైన కారణాలకు కూడా చిన్నారులను తీవ్రస్థాయిలో శిక్షించడం వినడానికి/చూడ్డానికి కూడా చాలా జుగుస్సాకరంగా, బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఉదాహరణకు మొన్నీ మధ్య స్కూలు యూనిఫారమ్ వేసుకోని కారణంగా ఓ అమ్మాయిని అతి దారుణంగా అబ్బాయిల టాయ్‌లెట్‌లో రోజంతా నిలబడాల్సిందిగా శిక్షించి ఓ ఉపాధ్యాయిని తన పైశాచిక ఆనందాన్ని పదుగురికీ చాటి చెప్పింది. మరో ఉపాధ్యాయుడు చేతిలో బెత్తం విరిగేట్టు ఇంకో విద్యార్థిని గొడ్డుని బాదినట్టు చితక్కొట్టాడు. ఇదంతా క్రమశిక్షణ అమలులో భాగమేనా? లేక అత్తమీద కోపం దుత్తమీద చూపిందన్న సామెత చందాన ప్రవర్తిస్తున్న మానసిక లోపమా? ఏది ఏమైనా సభ్య సమాజంలో వెలుగు చూస్తున్న ఇలాంటి వాస్తవాలు మనుషుల్లో దిగజారుతున్న మానవతా విలువల్ని గుర్తు చేస్తాయి.
ఇక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్య పద్ధతులు చాలా మటుకు డబ్బుతో ముడిపెట్టబడి సామాన్యుల పిల్లలకు,తల్లిదండ్రులకు తలకు మించిన భారమై ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ పద్ధతులపై ప్రభుత్వ జోక్యం అంతంతమాత్రమై యాజమాన్యాల అజమాయిషీ అంతకంతకూ శృతిమించి రాగాన పడుతోంది. అడిగే దిక్కూ నిలదీసే ధైర్యం రెండూ కరువై ఇష్టారాజ్యంగా కొనసాగుతున్న ఈ అరకొర చదువుల మేలు మాట అటుంచి- ఇప్పుడు జరుగుతున్న కీడు మాత్రం మాటల కందనంత సత్యం! భరించకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయాందోళనతో తప్పనిసరి బాధను భరిస్తున్న తల్లిదండ్రులు-అచేతనులై మిగులుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలు నామ్‌కే వాస్తేగా నడుస్తున్నాయని చెప్పడానికి-మొన్నీ మధ్యనే దినపత్రికలో చదివిన వార్త- ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య- అన్ని తరగతులు కలిపి 9 కాగా-అదే పాఠశాలలో ఉపాధ్యాయుల సంఖ్య హెచ్చుగా వుందనే వాస్తవం! ఇది మన విద్యా నిర్వాకానికి ఓ మచ్చుతునక. ఇక ఫీజుల వసూళ్ల విషయంలో నియంత్రణకు నోచుకోని మన ‘పైసావసూల్’ ప్రైవేటు విద్యాసంస్థలు విద్యా వ్యాపారంలో పోటీ పడుతున్నాయి. ‘చదువులుచారెడు-బలపాలు దోశెడు’ అన్న తెలంగాణ సామెతను సాక్షాత్తు నిజం చేస్తున్న వైనం కడు దయనీయం! అయినా సరే ‘ఈ చదువులుమాకొద్దు’ అనే సాహసం మనకెక్కడిది?

-యం.్భనుప్రియ, వనస్థలిపురం